Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
పండ్లు తినడానికి కరెక్ట్ టైం ఏది? నిపుణులు చెబుతుందిదే
పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి..వాటిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు, ఖనిజాలు, శక్తి అందుతుందని చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉంటాం. అయితే పండ్లు తినడమే కాదు అవి ఏ టైంలో తినాలో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ టైంలో పడితే ఆ టైంటో ఫ్రూట్స్ తింటే వాటి ప్రయోజనాలు మీ శరీరానికి అందకపోగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే పండ్లు తినడానికి ఏం టైం మంచిది? ఏ సమయంలో వాటి ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చో ఇప్పుడు చూద్దాం.
పండ్లు ఈ టైంలోనే తినాలి
పొద్దున్నే ఖాళీ కడుపుతో ఫ్రూట్స్ తినడం మంచిదని చాలామంది ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం సమయంలో జీర్ణవ్యవస్థ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని, ఫ్రూట్స్ లోని షుగర్స్ ని విచ్చిన్నం చేయడానికి అవసరమైన ఎంజైమ్స్ మరింత యాక్టివ్ గా ఉంటాయని తెలిపారు. ఇది పోషకాలను గ్రహించడానికి, రోజంతా మీరు ఫుల్ ఎనర్జీతో ఉండటానికి సహాయపడుతుందని తెలిపారు.
పొద్దున్నే అరటికాయ, బొప్పాయి, యాపిల్, బెర్రీలు వంటి పండ్లు తినడం మంచిదని..ఇది ఎక్కువ ఫైబర్ ని కలిగి ఉండి త్వరగా జీర్ణమవుతాయని చెబుతున్నారు. దీని వల్ల పేగు ఆరోగ్యం కూడా బాగుంటుందని తెలిపారు. అయితే ఉదయం ఖాళీ కడుపుతో ఎట్టి పరిస్థితుల్లోనూ నారింజ,నిమ్మ,ద్రాక్ష పండు వంటి సిట్రస్ పండ్లను తినకూడదని సూచిస్తున్నారు.

భోజనం చేసిన వెంటనే పండ్లు తినవచ్చా
సాధారణంగా మనలో చాలామంది మధ్యాహ్నాం భోజనం చేసిన వెంటనే ఫ్రూట్స్ తింటుంటారు. వాస్తవానికి ఇలా చేయడం కరెక్ట్ కాదు అని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే ఎలాంటి పండ్లు తినకూడదని, తిన్నారంటే కడుపు ఉబ్బరం, అజీర్ణం, పేగు సమస్యలు వస్తాయని నిపుణులు తెలిపారు. పండ్లు సాధారణంగా చాలా త్వరగా జీర్ణమవుతాయని.. ఫుల్ గా భోజనం చేసిన తర్వాత పండ్లు తినడం వల్ల జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుందని,అసౌకర్యం కలుగుతుందని తెలిపారు.
పండ్లను ఖాళీ కడుపుతో లేదా లంచ్ కి కనీసం గంట ముందు లేదా భోజనం చేశాక రెండు గంటల తర్వాత తినడం మంచిదని సూచిస్తున్నారు. భోజనానికి కనీసం అరగంట ముందు పండ్లు తినడం ద్వారా కడుపు నిండిన భావన ఉంటదని దీని వల్ల అతిగా తినడం తగ్గింపోతుందని మరికొందరు చెబుతున్నారు.
రాత్రి పూట పండ్లు తినొచ్చా,తినకూడదా?
రాత్రి పూట పండ్లు తింటే బరువు పెరుగుతారని తరుచుగా చాలామంది అంటుండటం మనం వింటుంటాం. నిపుణుల ప్రకారం రాత్రి పూట పండ్లు తింటే బరువు పెరుగుతారని చెప్పే ప్రత్యక్ష ఆధారాలు లేనప్పటికీ మామిడికాయ,ద్రాక్ష వంటి కొన్ని రకాల పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెన స్థాయి పెరిగే అవకాశం ఉంది కాబట్టి నిద్ర పోయే ముందు పండ్లు తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. నిద్రపోయేటప్పుడు పండ్లు తింటే కొందరికి జీర్ణ, యాసిడ్ రిఫ్లక్స్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications