Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Diet Tips: రోజూ ఒకే సమయంలో ఆహారం ఎందుకు తినాలి? హెల్త్ బెనిఫిట్స్ ఏంటి?
సమయానికి ఆహారం తినాలని, తినే విషయంలో సమయపాలన పాటించాలని చాలా మంది చెబుతుంటారు. ఇలా రోజూ ఒకే సమయానికి ఆహారం తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెప్పే మాట. బరువు తగ్గడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ సమయపాలన చాలా కీలకమని వైద్యులు చెబుతుంటారు.
రోజూ ఒకే సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఏం జరుగుతుంది.. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ ఒకే సమయంలో తింటే కలిగే ప్రయోజనాలు
* బరువు తగ్గడం:
రోజూ ఒకే సమయంలో ఆహారం తీసుకోవండ వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. రెగ్యులర్ టైముకు తిన్నప్పుడు ఒంట్లోకి వెళ్లిన కొవ్వు నిల్వకాకుండా దానిని కరిగించడానికి శరీరం ప్రయత్నిస్తుంది. ఇలా బరువు తగ్గడానికి అవసరమైన కేలరీల లోటును సృష్టించడంలో సహాయపడుతుంది.
* మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది:
రెగ్యులర్ టైముకు తినడం కూడా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఎక్కువ సమయం పాటు ఆహారం తీసుకోకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి. ఇది అలసట, చిరాకు, ఆకలి కోరికలకు దారితీస్తుంది. క్రమమైన వ్యవధిలో తినడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది మూడ్‌ను, ఎనర్జీ లెవల్స్‌ను మెరుగుపరుస్తుంది.
* దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది:
క్రమమైన వ్యవధిలో తినడం వల్ల గుండె జబ్బులు, గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రెగ్యులర్ టైమ్‌కు తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
రోజూ ఒకే సమయంలో తినడం ఎలా ప్రారంభించాలి:
* భోజనం, స్నాక్స్ ఎప్పుడు తినాలో ఒక సమయం సెట్ చేసుకోవాలి.
* నిద్రలేచిన 30 నిమిషాల్లోపు బ్రేక్‌ఫాస్ట్ తినడానికి ప్రయత్నించాలి.
* మధ్యాహ్నం, అలాగే సాయంత్రం 6, 7 గంటల ప్రాంతంలో రాత్రి భోజనం చేయాలి.
* మధ్యలో ఆకలి వేస్తే పండ్లు, కూరగాయలు, గింజలు లాంటి ఆరోగ్యకరమైన చిరుతిండి మంచిది.
రోజూ సమయానికి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
* నిద్రను మెరుగుపరుస్తుంది
* ఎనెర్జీ లెవెల్స్ ను మెరుగుపరుస్తుంది
* ఒత్తిడి స్థాయిలను తగ్గించుకుంటుంది
* ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది
* జీవక్రియను పెంచుతుంది
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications