For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లివింగ్ రూమ్ ఆకర్షనీయంగా కనిపించాలంటే...

|

Living Room
ఇంటిని చూసి, ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. ఇంటిని ఎంత చక్కగా దిద్దుకుంటే అంతపేరు ప్రతిష్ఠలు వస్తాయి. అందుకే ఇంటిపై పెక్కు శ్రద్ధ చూపండి. ఇంటిని శుభ్రంగా పెట్టుకోక పోతే చాలామందికి విరక్తి పుడుతుంది. సామాన్లతో ఇంట్లోని గదులన్నిటినీ నింపేస్తే చాలా చికాకుగా కనిపిస్తుంది. గదిలో ముప్పావు భాగం లేదా సగభాగమైనా ఖాళీగా వదిలేసి చూడటానికి విశాలంగా కనిపిస్తుంది. గదులన్నీ సామాన్లతో నింపేస్తే ఎంత విశాలమైన ఇల్లయినా చిన్నదిగానే కనిపిస్తుంది.

ఇంటికి వచ్చే అతిథులు ముందుగా చూసేది లివిలింగ్ రూం. కాబట్టి మనస్థాయికి తగినట్టుగా అతిథులను ఆకట్టుకునే విధంగా అమర్చుకోవాలి. స్థిరంగా ఒకచోట ఉండకుండా ఇల్లు మారుతూ ఉండే వారు లివింగ్ రూంలో అమర్చుకునే కుర్చీలు, సోఫాలు ఏ ఫ్లోర్‌కైనా నప్పే విధంగా సహజమైన రంగులను ఎంపిక చేసుకోవాలి. సోఫాలు, కుర్చీలు, దివాన్ బెడ్‌లు వంటివి గోడవారగా ఉంటే బాగుంటుంది. పైగా అవి స్థలం ఎక్కువగా ఆక్రమించినట్టుగా కనిపించదు. గది మధ్యలో వేస్తే నడవటానికి ఇబ్బందే కాకుండా గది కూడా విశాలంగా అగుపించదు. గదిలో వెలుతురు ఎక్కువగా ఉండి, గది విశాలంగా ఉన్నప్పుడు దివాన్ కవరు, కుషన్ కవర్స్ ముదురు రంగులయితేనే అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తుంది.

అలాగే కర్టెన్లు కూడా కుర్చీలకు, సోఫాలకు, దివాన్ సెట్స్‌ కు వాల్ హాంగింగ్స్‌ కు మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. లివింగ్ రూంలో ఎటాచ్‌డ్ టాయ్‌లెట్స్ ఉన్నప్పుడు అక్కడ కర్టెన్లు వేయడమో లేదా తలుపునకు పోస్టర్ అమర్చడమో చేయాలి. ఇంకా అందంగా కనిపించాలంటే కర్టెన్లకు బదులుగా కర్టెన్ హాంగింగ్స్ వాడుకోవచ్చు.

కర్టెన్లు కుట్టించేటప్పుడు లోపలికి మడతలు ఎక్కువగా ఉంచుకున్నట్లయితే కిటికీలు పెద్దవైనా, చిన్నవైనా అమర్చుకోవడానికి వీలుగా ఉంటాయి. ప్రతిసారీ కొత్త కర్టెన్లు కొనే అవసరం రాకుండా తరచూ బదిలీలపై వెళ్లేవారు ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం.

English summary

How to keep Living Room looking beautiful...? | లివింగ్ రూమ్ ఆకర్షనీయంగా కనిపించాలంటే...

Living area decorated with comfortable upscale furnishings and appointments, featuring a queen size easy pull out sleeper sofa.
Story first published:Friday, December 16, 2011, 18:10 [IST]
Desktop Bottom Promotion