For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ స్నానాల గదిని సౌకర్యవంతంగా తీర్చిదిద్దుండి..!!

|

Shower Room Decoration..!!
తక్కువ స్థలంలో నిర్మించుకునే స్నానాల గదులకు ముదురు రంగులు వేయటం అంత ఉత్తమం కాదు. గోడలకు ఎప్పుడూ లేలేత రంగులో ఉండే టైల్స్ నే వేయించాలి. తెల్లటి కాంతినిచ్చే బల్బులను అమర్చితే, ఆ విద్యుత్ కాంతుల వెలుగులో చిన్నగా ఉంటే బాత్ రూమ్ కాస్తా విశాలంగా కనిపిస్తుంది. స్నానాల గదిలో వాష్ బేషిన్లు వాడటం కొత్తదనాన్ని ఇవ్వటంతో పాటు, ఉపయుక్తంగా ఉంటుంది. అయితే వాటిని తక్కువ స్థలంలో అమర్చగలిగే జాగ్రత్తలు తీసుకోవాలి.

అక్రిలిక్ షీట్ లేదా మార్బుల్స్ తో బాత్ రూమ్ మూలాల్లో అరల్లాగా నిర్మించుకోవాలి. వీటిలో సబ్బులు, షాంపూలు, ఇతర వస్తువులను పొందికగా అమర్చుకునే విధంగా చూడాలి. షవర్ లేకుండా ప్రత్యేకంగా ఉండాలనుకునేవారు అద్దం లేదా అక్రిలిక్ షీట్ తో బాత్ రూమ్ లో పార్టిషన్ ఏర్పాటు చేస్తే స్థలం కూడా వృధా కాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇరుకుగా అనిపించదు.

స్నానాల గదిలో వస్తువులను ఎక్కడపడితే అక్కడ అలాగే వదిలేయకూడదు. అలా వదిలివేస్తే గది ఇరుకుగా తయారవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆయా వస్తువులను అక్కడి నుంచి తీసివేయటమే కాకుంగా.. అక్కడ తప్పని సరిగా ఉండాల్సిన వస్తువులను నీట్ గా సర్దుకుంటే, స్నానాల గది అందంగా తయారవంటంతో పాటు సౌకర్యవంతంగా ఉంటుంది.

English summary

Shower Room Decoration..!! | ‘జలక’మాడే గది ఏలా ఉండాలంటే..?

Creating the right mood in your bathroom with lighting is essential. Too bright and it will seem harsh and unwelcoming, too dim and you'll find it hard to see what you're doing.
Story first published:Saturday, August 13, 2011, 11:18 [IST]
Desktop Bottom Promotion