For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటి ముస్తాబు మహా బేష్...!

|

Home Decorating Ideas
ఇల్లన్నాక గాలీవెల్తురూ సరిగా లేకుంటే ఇల్లు కారాగారాన్ని తలపిస్తుంది. గదులు ప్యాలెస్‌ను మరిపించేలా వుండాల్సిన అవసరం లేదుగానీ మరీ ఇరుగ్గా మంచం, టేబుల్‌ లాంటి సామాన్లు అమర్చాక నడవడం కష్టమనిపించేలా ఉండకూడదు. గది విశాలంగా ఉంటే చెక్క లేదా కర్టెన్‌ క్లాత్‌తో పార్టిషన్‌ చేసుకోవచ్చు. మరీ చిన్న గదులైతే ఏ వస్తువులూ పట్టక ఇబ్బంది పడాల్సొస్తుంది.

ఇంట్లో ఫర్నిచరు, అలంకరణ సామగ్రి ఉన్నంత మాత్రాన సరిపోదు. వేటినెక్కడ అమర్చాలో తెలుసుకోవడంలో వుంది మన ప్రావీణ్యం. నట్టింట్లో నాలుగు వస్తువులనూ పరవక ఒక పద్ధతి ప్రకారం అందంగా అమర్చాలి. డైనింగ్‌ టేబుల్‌, టీవీ, సోఫాసెట్లకు అందమైన కవర్లతో దుమ్ముపట్టకపోవడం సంగతలా వుంచి ఇంటికి ఎనలేని అందం వస్తుంది. రైటింగ్‌ టేబుల్‌పై చెత్త పేర్చకపోవడం మరో కళ. ఒక స్క్రిబ్‌లింగ్‌ ప్యాడ్‌, పెన్‌ స్టాండ్‌, అవసరమైన పుస్తకాలు మాత్రమే వుంచితే అందంగా, మనసుకు హాయిగా వుండి రాసుకోవాలి లేదా చదువుకోవాలనే కాంక్ష కలుగుతుంది. డైనింగ్‌ టేబుల్‌ మాత్రం ఏం పాపం చేసింది నిండా పాత్రలు పేర్చడానికి?! భోజనాలు కాగానే శుభ్రంగా తుడిచేసి పాత్రలు, గ్లాసులు ఎక్కడివక్కడ నీట్‌గా సర్దేసి, వీలైనంత ఖాళీగా వుంచాలి. లేదంటే అటక లేదా గోడౌన్ను తలపించడం ఖాయం.

వంటిల్లు సర్వ సామాన్యంగా ఇల్లాళ్ళు ఎక్కువసేపు గడిపేది ఇక్కడే. ఉదయం కాఫీతో ప్రారంభమైతే రాత్రి పెరుగు తోడేసేందుకు పాలు కాచడం వరకూ అంతా అక్కడేగా! వంటిల్లు ఎంత పొందిగ్గా, శుభ్రంగా వుంటే మనకు అంత సుఖంగా, శాంతంగా వుంటుంది. ఉప్పు, పప్పు, పంచదార, టీపొడి డబ్బాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా, వరుసక్రమంలో సర్దుకోగల్గితే చూడ సొంపుగా వుండి అవసరమైనవి సులభంగా దొరుకుతాయి. ఏవీ పుచ్చిపోవు, పాడైపోవు. అల్మారాలను డెటాల్‌ కలిపిన నీళ్ళతో తరచు తుడిస్తి బొద్దింకలు కాదుగదా, బాక్టీరియా క్రిములు కూడా మన ఇంటివైపు తొంగిచూడవు.

హాలు విశాలంగా వుంటే దానికి తగ్గ పెద్ద పెద్ద సోఫాసెట్లను ఎంచుకోవాలి. లేనిపక్షంలో స్థలం ఆక్రమించని, సుఖంగా ఆసీనం కాగలిగే సోఫాలను కొనుక్కోవడం ఉత్తమం. నడుం నొప్పి గట్రా రాకుండా సౌఖ్యంగా కూర్చోగల్గడం ఎంత ముఖ్యమో, వాటివల్ల ఇల్లు శోభించడం కూడా అంతే ముఖ్యం. టీపాయ్‌ ఏదో ఒకటి అని సరిపెట్టుకోకుండా సోఫా లేదా కేన్‌ కుర్చీలకు అనుకూలమైన దాన్ని ఎన్నుకున్నట్లయితే వన్నె పెరుగుతుందంటారు ఇంటీరియర్‌ డిజైనర్లు. టీపాయ్‌మీద పాత పేపర్లను పచడడం చాలామందికి అలవాటు. దీనివల్ల ఇంటి అందం తగ్గుతుందని గుర్తుంచుకుని, వాటిని లోపల వరుసగా భద్రపరిస్తే సరి. ఇల్లు కొత్త పెళ్ళికూతురిలానూ వుంటుంది, అవసరమైన పాత పేపర్‌ తేలిగ్గానూ దొరుకుతుంది.

ఇక పడకగదుల్లో వీలైతే రోజూ లేదంటే వారానికి రెండుసార్లయినా దుప్పట్లు మార్చి ఉతికించుకుంటే మనసు, శరీరం కూడా సేదతీరతాయి. బెడ్‌షీట్లు, కప్పుకునే దుప్పట్లకు ఆకర్షణీయమైన రంగులు, డిజైన్లు వుండేలా ఎంచుకోవడం మన చేతిలో పనేకదా! ఇందులో మన అభిరుచి ప్రతిఫలిస్తుంది. ఖరీదెంత అనేదానికంటే కూడా ఎంత అందమైనవి అనేదానికే మెజారిటీ ఓటేస్తారు. మన అభిరుచి గొప్పగా వుండాలేకానీ తక్కువ ధరతో కూడా ఆకట్టుకునే వస్తువులు, దుస్తులను ఎంచుకోవచ్చు.

English summary

Home Decorating Ideas to get most attractive...! | ఇంటి ముస్తాబు మహా బేష్...!

Interior design describes a group of various yet related projects that involve turning an interior space into an effective setting for the range of human activities that are to take place there. An interior designer is someone who conducts such projects. Interior design is a multifaceted profession that includes conceptual development, liaising with the stakeholders of a project and the management and execution of the design.
Story first published:Wednesday, May 2, 2012, 14:37 [IST]
Desktop Bottom Promotion