For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో వాస్తుకోసం: అనుసరించాల్సిన 10 ఫెంగ్ షుయ్ నియమాలు

By Super
|

ఫెంగ్ షుయ్ సానుకూల శక్తి లేదా చి పెంచడానికి నిర్వహించే కళ మరియు శాస్త్రం అని చెప్పవచ్చు. ఇది పురాతన చైనాలో ఉద్భవించింది. అలాగే పాశ్చాత్య ప్రపంచంలో చాలా ప్రజాదరణ పొందింది.
ఫెంగ్ షుయ్ ని విజయవంతంగా సాధన చేయాలి. ఈ కారణంగా ఇక్కడ ఇచ్చిన ప్రాథమిక నిర్వచనం కంటే చాలా క్లిష్టమైనది.
ఇక్కడ ఉన్నా 10 ఫెంగ్ షుయ్ నియమాలను అనుసరిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.

ఇంటి ముందు ఆహ్వానం పలికేలా ఉండాలి

ఇంటి ముందు ఆహ్వానం పలికేలా ఉండాలి

ఇంటిలోనికి సానుకూల శక్తి ముందు తలుపు ద్వారా ప్రవేశిస్తుంది. ఇంటి ముందు ఆహ్వానించటానికి అస్తవ్యస్తంగా లేదా అడ్డంకులు లేకుండా చక్కగా ఉండాలి. చనిపోయిన మొక్కలను కట్ చేయటం లేదా విచ్ఛిన్నం చేయాలి.

ప్రతి గది చిందరవందరగా లేకుండా చూడాలి.

ప్రతి గది చిందరవందరగా లేకుండా చూడాలి.

ఇల్లు సామరస్యపూర్వకముగా ఉంటే కనుక మీ జీవితంలో భరోసా ఖచ్చితంగా ఉంటుంది. ఇల్లు చిందరవందరగా ఉంటే సానుకూల శక్తి ప్రవాహాన్ని నియంత్రిస్తుంటాయి. అలాగే ఆలోచనలు కూడా చిందరవందరగా ఉంటాయి. ఇల్లు చక్కని నిర్వహణ కలిగి ఉంటే ప్రశాంతమైన మరియు విశ్రాంతి అనుభూతి కలుగుతుంది. ఉపయోగించని మరియు విరిగిన వస్తువులు మరియు అసంతృప్తి కలిగించే జ్ఞాపకాలను దూరంగా విసిరి చేయాలి.

ఫర్నిచర్ సరిగ్గా ఉంచాలి

ఫర్నిచర్ సరిగ్గా ఉంచాలి

ఫర్నిచర్ మంచి స్థానంలో ఉండాలి. గది ద్వారా శక్తి ప్రవాహం స్వేఛ్చగా లోపలికి రావాలి. దానిని పరిమితం చేయకూడదు. మీరు కుర్చునేటప్పుడు సాధ్యమైనంత వరకు వెనక భాగంలో గోడ ఉండేలా చూసుకోవాలి.

పని మరియు విశ్రాంతి ప్రాంతాలను ప్రత్యేకంగా ఉంచండి.

పని మరియు విశ్రాంతి ప్రాంతాలను ప్రత్యేకంగా ఉంచండి.

ఇంటిలో పని లేదా ఆఫీస్ పనుల ప్రాంతం నిద్ర నుండి చాలా వైవిధ్యముగా ఉంచవలెను. ఒకవేళ రెండు కలిసి ఉంటే రిలాక్సేషన్ అసాధ్యం అవుతుంది. బెడ్ రూం లో పనికి సంబందించిన వస్తువులు ఉంటే మంచి నిద్రకు ఆటకం కలుగుతుంది.

వెంటనే మరమ్మతులు చేయండి.

వెంటనే మరమ్మతులు చేయండి.

ఇంటిలో విరిగిన మెట్లు, తలుపులు లేదా కిటికీలు ఉంటే సానుకూల శక్తి ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. వీలైనంత త్వరగా మరమత్తులు చేయిస్తే శక్తి మళ్లీ స్వేచ్ఛగా ప్రవహించేందుకు వీలుగా ఉంటుంది.

అద్దాలను వ్రేలాడతీయుట

అద్దాలను వ్రేలాడతీయుట

అద్దాలు సానుకూల శక్తిని ప్రతిబింబిస్తాయని నమ్ముతున్నారు. అందువల్ల దాని సామర్థ్యం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఇంటికి చుట్టూ ఉండే ప్రతికూల శక్తి ప్రవాహాన్ని నిరోధిస్తాయి. అయితే ఇంటి ముందు తలుపు ఎదురుగా ఒక అద్దం ఉంచడానికి సిఫార్సు లేదు. దీని వలన మంచి శక్తి ఇంటిలోకి రాకుండా అడ్డుకుంటుంది.

మొక్కలు,పువ్వులు మరియు పండ్లను ప్రదర్శించండి

మొక్కలు,పువ్వులు మరియు పండ్లను ప్రదర్శించండి

తాజా పుష్పాలు మరియు మొక్కలు ప్రదర్శించుట వలన సానుకూల శక్తిని ప్రోత్సహిస్తాయి. అయితే ముళ్ళు ఉన్న వాటిని వాడరాదు. బెడ్ రూమ్ లో ఒక బౌల్ పండ్లు కాకుండా పూలను ఉంచితే లైంగిక ఆరోగ్యంను ప్రోత్సహిస్తుంది. ఇల్లు మొత్తం నారింజ మరియు నిమ్మకాయలను ప్రదర్శిస్తే మంచి అదృష్టం వస్తుందని భావిస్తున్నారు.

ఫెంగ్ షుయ్ గురించి,ఇది గాలి నీటిగా అనువదించబడుతుంది.

ఫెంగ్ షుయ్ గురించి,ఇది గాలి నీటిగా అనువదించబడుతుంది.

ఒక నీటి ఫీచర్ రిలాక్సేషన్ మరియు సంతులనం యొక్క భావాలను ప్రోత్సహిస్తుంది.

ఇంటికి సరైన రంగులు వేయాలి

ఇంటికి సరైన రంగులు వేయాలి

ఫెంగ్ షుయ్ లో రంగులు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. వివిధ రంగులతో వివిధ విషయాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఉదాహరణకు,ఆకుపచ్చ ప్రకృతిని సూచిస్తుంది. అందువలన జీవితం మరియు ఆశ యొక్క ప్రతినిధిగా ఉంటుంది. పసుపు రంగు అధికారాన్ని సూచిస్తుంది. ఎరుపు మరియు ఊదా రంగులు అదృష్టంను సూచిస్తాయి. నివసిస్తున్న ప్రదేశాల్లో రిలాక్సింగ్ రంగులు ఉపయోగించటం ఉత్తమం.

షార్ప్ లైన్స్ మరియు కార్నర్స్ నివారించండి

షార్ప్ లైన్స్ మరియు కార్నర్స్ నివారించండి

ఫెంగ్ షుయ్ సంపూర్ణత్వానికి మేలైనది. పదునైన అంచులు ప్రతికూల శక్తిని విడుదల చేస్తాయి. సాధ్యమైనంత వరకు మూలల్లో మంచాలు లేదా కుర్చీలు ఉండకుండా చూసుకోవాలి. అవి ప్రశాంతత మరియు రిలాక్స్ ను నిరోధిస్తుంది.

మీరు తప్పకుండా ఈ 10 ఫెంగ్ షుయ్ నియమాలను పాటిస్తే,మీరు మీ ఇల్ల్లును మరింత అనుకూలమైన మరియు సుసంపన్నమైన ఇంటిగా సృష్టించుకోవచ్చు. ఈ పురాతన కళ ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రజలకు ప్రశాంతత మరియు శ్రేయస్సును ప్రోత్సహించడానికి మరియు వారి జీవితాలను మంచిగా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఫెంగ్ షుయ్ గురించి తెలుసుకోవడానికి చాలా ఉన్నప్పటికీ, ఈ నియమాలు కొన్ని బేసిక్ ప్రాధమిక దశలు అని చెప్పవచ్చు. ఇది మీ జీవితంలో ఒక వైవిధ్యంను ప్రారంభిస్తుంది

English summary

10 Fengshui to follow

Feng shui is the art and science of organizing space to maximize positive energy, or chi. It originated in ancient China, and has become very popular in the western world.
Story first published: Monday, August 4, 2014, 17:47 [IST]
Desktop Bottom Promotion