For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళికి ఇల్లు కళకళలాడాలంటే అమేజింగ్ డెకెరేషన్ టిప్స్ ..!

దీపావళి అంటేనే బోలెడు దీపాలు,బాంబుల శబ్దాలు,బాణాసంచా, స్వీట్లు, బంధు మిత్రుల ఆప్యాయ పలకరింపులూ ఇవన్నీను.ఇలాంటి పండుగల సీజన్లోనే ఇతరులతో ఉన్న వైరాన్ని మర్చిపోయి మనస్ఫూర్తిగా వారిని హత్తుకుంటాము.

By Staff
|

అక్టోబరు, నవంబరు నెలలంటే భారతీయులకి పండగల సీజన్.గణేష్ చతుర్ధి తో మొదలయ్యే పండుగలు భాయీ-దూజ్ తో ముగుస్తాయి. ఈ మధ్యలో రెండు అతి పెద్ద పండగలైన దసరా మరియూ దీపావళిని జరుపుకుంటారు. నవరాత్రుల 9 రోజుల ఉత్సవాలు ముగిసాకా బోరనిపిస్తుంటే దీపావళి వచ్చెస్తుంది.దీపావళి అంటేనే బోలెడు దీపాలు,బాంబుల శబ్దాలు,బాణాసంచా, స్వీట్లు, బంధు మిత్రుల ఆప్యాయ పలకరింపులూ ఇవన్నీను.ఇలాంటి పండుగల సీజన్లోనే ఇతరులతో ఉన్న వైరాన్ని మర్చిపోయి మనస్ఫూర్తిగా వారిని హత్తుకుంటాము.ఎందుకంటే కొందరిని మళ్ళీ మళ్ళీ కలవము కదా.

పండుగలప్పుడు అందరూ తమ స్నేహితులూ బద్ణువుల ఇళ్ళకి వెళ్ళి పండుగని ఉత్సాహభరితం చేస్తారు.ప్రతీ ఇల్లు దీపాలు, తోరణాలతో అలంకరించబడి ఉంటుంది.అందరూ కూడా మంచి బట్టలు వేసుకుని పండగ కళతో మెరిసిపోతుంటారు.

ఈ పండుగ రోజుల్లోనే మధుమేహ వ్యాధిగ్రస్తులకి స్వీట్లు తినడానికి పర్మిషన్ ఉంటుంది అలాగే పేకాటకి కూడా.దీపావళంటే పిల్లలకి కూడా ఎంతిష్టమో.వారు అలసిపోయేవరకూ బాణాసంచా కాలుస్తూనే ఉంటారు.ఇంకా ఈ సంవత్సరపు దీపావళికి పది రోజుల ఉంది.మీ ఇంటి అలంకరణ మొదలెట్టారా లేదా??ఈ అలంకరణకి ఏమైనా టిప్స్ కావాలా??మీ ఇంటిని అందంగా అలంకరించి మీ అతిధులని సమ్మోహభరితులని చెయ్యాలనుకుంటున్నారా?? అయితే కనుక మీ ఇంటి అలంకరణకి కావాల్సిన టిప్స్ కొన్ని క్రింద ఇచ్చాము. ఇవి ప్రయత్నించండి.దీపావళి కొన్ని రోజుల ముందే మొదలు పెడితే పండుగ రోజు ఇల్లు మెరిసిపోతుంది.

Amazing Diwali Decoration Tips

1.ఇంట్లో తయారు చేసే క్యాండిల్స్: ఈ పండుగ రోజు ఇంటిని బయట కొన్న క్రొవ్వుత్తులతో కాకుండా మీరే చెయ్యండి.దీనికోసం గ్రుడ్డు పెంకులు, సాల్ట్ డవ్ తదితరాలు ఉపయోగించవచ్చు.

Amazing Diwali Decoration Tips

2.అరోమాటిక్ క్యాండిల్స్: ఇవి యే గిఫ్ట్ స్టోర్లో అయినా దొరుకుతాయి.ఇవి వెలిగించగానే ఇల్లంతా సుగంధ భరితం అవుతుంది.చాలా మంది ఈరోజు లక్ష్మీ పూజ కూడా చేస్తారు కదా. అటువంటప్పుడు ఇవి వెలిగిస్తే ఒక విధమైన భక్తి భావన కలుగుతుంది.

Amazing Diwali Decoration Tips

3.ఫ్లోటింగ్ క్యాండిల్స్: హాలు మధ్యలో సెంటర్ టేబిల్ మీద ఒక బౌల్లో నీటిలో తేలియాడే క్యాండిల్స్ వేస్తే దీపావళి శోభ మరింత పెరుగుతుంది.నీటిలో గులాబీ రేకులు, తామర పువ్వులూ వేస్తే కన్నులపండుగగా ఉంటుంది చూసేవారికి.

Amazing Diwali Decoration Tips

4.చాక్లెట్ ట్రీ: మీ ఇంటికొచ్చే అతిధులలో పిల్లలు కూడా ఉంటారు కదా.ఈ డెకరేషన్ వారికి మరింత ఆనందాన్నిస్తుంది.ఒక గట్టి కొమ్మ తీసుకుని కుండీలో పాతి చాక్లెట్లని రంగురంగుల కాగితాల్లో చుట్టి కొమ్మలకి పెట్టండి.దీనిని హాలు మధ్యలో పెట్టాలి.

Amazing Diwali Decoration Tips

5.గ్లాసు లాంతర్లు: దీపావళీకి ప్రతీ ఇంట్లో లాంతర్లు ముఖ్యం కదా.ఈ సారి క్రొత్తగా ప్రయత్నించాలనుకుంటున్నారా??గ్లాసు లాంతర్లు తీసుకురండి.లేదా గాజు సీసాలకి రంగులు వేసి మధ్యలో క్యాండిల్స్ లేదా ఎల్‌యీడీ బల్బులు అమర్చండి.ఇలా అమర్చిన సీసాలని ఇంటి చుట్టూ వ్రేళాడదీయండి.ఎంత బాగుంటుందో ఇలా రంగు రంగుల గ్లాసు లాంతర్లలో దీపాలు వెలుగుతోంటే.

Amazing Diwali Decoration Tips

6.ముగ్గులు: దీపవళి అలంకరణ గురించి మాట్లాడుతూ ముగ్గులని వదిలెస్తే ఎలా??ముగ్గులో రంగులతో పాటు పూల రెక్కలు, ఆకులు, దీపాలు ఉపయోగించి మీ ముగ్గుని అలంకరించండి.మీ హాలులో అడుగిడేముందు లేదా ఇంటి వాకిట్లో ఇలాంటి ముగ్గొకటి వేస్తే వచ్చే అతిధులకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నట్లుంటుంది.

7.దీపావళి తోరణాలు: దీపవళీ రోజు లక్ష్మీ దేవినీ, గణేశుణ్ణి మీ ఇంటికి ఆహ్వానిస్తారు కదా.మీ ఇంటి మహా ద్వారాన్ని రంగు రంగుల దీపావళి తోరణాలతో అలంకరించండి. ఇది మీ ఇంటికి ఒక క్రొత్త వెలుగుని తెస్తుంది.

8.పాట్ పౌరీ: చిన్న చిన్న బౌల్స్‌లో ఎండిన పూ రెక్కలని వేసి ఇంటిలో అక్కడక్కడా ఉంచితే ఆ సువాసన ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.దీనిని బయట కొనచ్చు లేదా అంతర్జాలంలో చూసి ఇంట్లోనే మీ సొంతంగా చెయ్యచ్చు.ఎలా చేస్తారనేది మీ ఇష్టం.

English summary

Amazing Diwali Decoration Tips

October and November is the month of festivals for all Indians. It starts with Ganesh Chaturthi and ends with 'Bhai-Dooj'. In between, Indians celebrate two major festivals, and they are Navratri and Diwali.
Desktop Bottom Promotion