వాస్తుశాస్త్రం ప్రకారం బహుమతులుగా ఇవ్వకూడని వస్తువులు

Posted By: Lekhaka
Subscribe to Boldsky

బహుమతులు ఇవ్వడం, తీసుకోవడం అనేవి నేటి ప్రపంచంలో సాధారణమైన సంప్రదాయం. ప్రజలు ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమను, శ్రద్ధను తెలియచేయడానికి ఇదో మంచి మార్గం. అవి పుట్టినరోజు, పెళ్ళిరోజులు, గృహప్రవేసాలు కాని బహుమతులు ఇచ్చుకోవడం అనేది అందులో ఒక భాగమైపోయింది. ఎటువంటి కారణం లేదా సందర్భం లేకుండా కూడా ప్రజలు బహుమతులు ఇచ్చుకోడం ఆనవాయితీ అయిపొయింది.

ఏ సందర్భం ఉన్నా, బహుమతి ఇవ్వడం అనేది తీసుకునే వారు బాగుండాలని కొరుకొవడానికి ఇదో మంచి మార్గం. మీరు బహుమతి కొనడానికి ఎంతో ఆలోచిస్తారు, మీరు బహుమతి ఇవ్వబోయే వారి ముఖంలో ఆత్రుత కూడిన నవ్వును చూసి ఇది నిజంగా విలువైనది అనుకుంటారు.

వాస్తుశాస్త్రం ప్రకారం బహుమతులుగా ఇవ్వకూడని వస్తువులు

ఖచ్చితంగా, బహుమతిపై మీరు ఎంతో ఆలోచనలు చేస్తారు. మీరు వ్యక్తి వ్యక్తిత్వానికి సరిపోయే వస్తువుల గురించి ఆలోచిస్తారు. మీరు అతను/ఆమె ఇష్టాలను తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు. ఆ సమయంలో ఆ వ్యక్తికీ అవసరమైన లేదా కోరుకున్న వస్తువులేమిటో అని మీ సన్నిహితులను అడుగుతారు కూడా.

కానీ నిజంగా అలోచించి ఇచ్చే బహుమతి కేవలం అరుదుగా ఉంటుంది. బహుమతులు ప్రేమను, శ్రద్ధను ఇచ్చిపుచ్చు కోవడానికి మాత్రమే కాదు. ఇది ఇచ్చేవాడు, తీసుకునేవాడి ఇద్దరి మానసిక స్థితిని బట్టి సానుకూలత, ప్రతికూలతలను, బహుమతి ఇచ్చే వస్తువును కూడా తెలియచేస్తుంది.

బహుమతి ఇచ్చే కొన్ని వస్తువులు ఉన్నాయి, ఇవి తీసుకునేవాడు, ఇచ్చేవాడు ఇద్దరికీ సానుకూల ఫలితాలను ఇస్తాయి. కొన్ని బహుమతులుగా ఇచ్చే వస్తువులు ప్రతికూలతలను తీసుకువచ్చి, ఇరు పార్టీలకు దురదృష్టాన్ని కలుగచేస్తాయి.

మీరు మీ స్నేహితుని కోసం బహుమతిని ఎంచుకోవాలి అనుకున్నపుడు వాస్తు శాస్త్ర నియమాలను దృష్టిలో ఉంచుకోడం చాలా ముఖ్యం. మీ దగ్గరి, ఇష్టమైన వారికి మంచి బహుమహితి ఎంచుకోడానికి సహాయపడతాయి, మీరు ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకూడని కొన్ని బహుమతుల జాబితాలను ఇక్కడ ఇచ్చాము. మరిన్ని వివరాల కోసం కింద చదవండి.

టవల్స్, చేతిరుమాలు

టవల్స్, చేతిరుమాలు

టవల్స్, చేతిరుమాలు వ్యక్తిగత బహుమతులుగా చాలా పెరుగంచాయి. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని బహుమతిగా అసలు ఇవ్వకూడదు. ఈ వస్తువులు ప్రతికూలత కారణమవుతాయి, ఇచ్చేవారికి, పుచ్చుకునేవారికి మధ్య వివాదాలకు దారితీస్తాయి. వాటి అనారోగ్య ప్రభావాల గురించి తెలియని వారు మీకు చేతి రుమాలు పాక్ ని బహుమతిగా ఇచ్చినట్లయితే, మర్యాదపూర్వకంగా వద్దని చెప్పండి లేదా తిరిగి ఒక నాణాని వారి చేతిలో పెట్టండి.

నీటితో కూడిన వస్తువులు

నీటితో కూడిన వస్తువులు

అక్వేరియం, ఫిష్ బౌల్స్, చిన్న చిన్న ఫౌంటెయిన్ లు వంటివి సాధారణంగా ఇచ్చే బహుమతులు. కానీ ఈ వస్తువులను బహుమతులుగా ఇవ్వడం వల్ల మీదగ్గర ఉన్న అదృష్టం తీసుకునే వారికి వెళ్ళిపోతుంది. మీరు మీ స్నేహితుడికి మంచి అదృష్టం ఉండాలని కోరుకోవచ్చు, కానీ మీకు కూడా అదృష్టం ఉండాలి అనుకోవాలి కదా. నీటికి సంబంధించిన వస్తువులను బహుమతులుగా ఇవ్వడం వల్ల తరచుగా ఆర్ధిక పరమైన నష్టాలూ వస్తాయి.

చిత్రాలు, బొమ్మలు లేదా ఇతర దేవుని బొమ్మలు

చిత్రాలు, బొమ్మలు లేదా ఇతర దేవుని బొమ్మలు

పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు జరిగినపుడు దేవునికి సంబంధించిన బహుమతులు అందుకుంటారు. అది మంచి బహుమతే కావొచ్చు, కానీ అది అంత అద్భుతమైనదేమీ కాదు.

మీరు చిత్రాలు లేదా దేవుని బొమ్మలు బహుమతిగా ఇస్తే, దానిని అందుకున్నవారికి వాటిని భద్రపరచడం ఎలాగో తెలియదు. ఇది ఇద్దరికీ ప్రతికూలతని, దురదృష్టాన్ని సృష్టింప చేస్తుంది.

కాబట్టి, మీరు నిజంగా ఒక చిత్రం లేదా దేవుని బొమ్మ బహుమతిగా ఇవ్వాలి అనుకుంటే, అది ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి వారికి వివరించడం కూడా చేయాలి. మీరు అలంటి బహుమతులు తీసుకుని ఉంటే, ఆ గ్రంధాలను అనుసరించి వాటిని జాగ్రత్తగా చూసుకోండి దయచేసి.

పనికి సంబంధించిన వస్తువులు

పనికి సంబంధించిన వస్తువులు

పనికి సంబంధించిన వస్తువులను ఇచ్చినట్లయితే వాటివల్ల ;మీ పని పతనమవుతుంది. మీరు ఒక రచయితగా లేదా క్రియేటివ్ ఫీల్డ్ లో పనిచేస్తుంటే, పెన్నులు, పుస్తకాల వంటి బహుమతులు ఎప్పుడూ ఇవ్వకండి. ఇతర పరిశ్రమల వారికి కూడా ఇదే వర్తిస్తుంది.

పదునైన వస్తువులు

పదునైన వస్తువులు

బహుమతి దుకాణాల్లో ఫాన్సీ చాకులు, కత్తులు చూసే ఉంటారు. కానీ వీటిని కొని, మీ దగ్గరి వారికి బహుమతిగా ఇవ్వడం ఎప్పుడూ చేయకండి.

పదునైన, కోణాలు గల వస్తువులు ఇంటిలో ప్రతికూలతలను సూచిస్తాయి. ఇది మీ ఇద్దరికీ దురదృష్టలను కలిగించి, వెంటనే అనారోగ్య ఫలితాలు పొందేట్టు చేస్తాయి. వీటివల్ల మీ అనుబంధంలో సమస్యలు కూడా రావొచ్చు. కాబట్టి మీరు ఎప్పుడూ పదునైన వస్తువులను బహుమతులుగా ఇవ్వొద్దు, మీరు వాటిని తిరస్కరించడం మంచిది.

English summary

Gifts That Should Not Be Given According To Vastu Shastra

Gifts That Should Not Be Given According To Vastu Shastra, Read more to know about,
Story first published: Friday, June 9, 2017, 20:00 [IST]
Subscribe Newsletter