వాడి పారేసిన ప్లాస్టిక్ కప్పులను తిరిగి వాడుకోగలిగే సరికొత్త విధానాలు

Posted By: Deepthi TAS
Subscribe to Boldsky

ప్లాస్టిక్ - ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న దారుణమైన భయంకర సమస్య. మీరు ఎక్కడన్నా ఒక కాగితం వాడి పడేస్తే, అది సులభంగానే విఛ్ఛిన్నమయి ఎక్కడా దేనికీ అడ్డుపడదు.

కానీ ప్లాస్టిక్ అలాంటి సులభమైన పదార్థం కాదు. మీరు ప్లాస్టిక్ ను ఎక్కడన్నా పడేస్తే, అది ఎన్నో ఏళ్ళ తర్వాత కూడా అలానే ఉంటుంది. కానీ ప్లాస్టిక్ లేకుండా ఇప్పుడు జీవితాన్ని ఊహించుకోవడం కష్టం, కదూ? ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ కప్పులు, గిన్నెలు, బ్యాగులు, ప్లాస్టిక్ ఒకటేమిటి?

మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోడానికి, మీరు వాడి పారేసిన ప్లాస్టిక్ కప్పులను తిరిగి ఎలా వాడుకోవచ్చో ఈ ముఖ్య చిట్కాలలో తెలుసుకోవాలి.

ఐస్ క్రీములు, స్వీట్లు, సాఫ్ట్ డ్రింకులు మరియు ఇతర వస్తువుల ద్వారా ప్లాస్టిక్ కప్పులు మీ ఇంట్లోకి వస్తాయి. మీకు ప్లాస్టిక్ కప్పులను సరిగా తిరిగి వాడుకునే విధానాలు తెలిస్తే, మీ పరిసరాలు చెత్తగా తయారవ్వకుండా చూసుకోవచ్చు.

Innovative Ways To Use Plastic Cups

ఉదాహరణకి, మీరు ఐస్ క్రీమ్ కప్పులను మీరు చదువుకునే బల్లపై పెన్ స్టాండ్ గా వాడుకోవచ్చు. మీరు కళాత్మక హృదయం కలవారు అయితే, ఆ కప్పుకి రంగు కాగితం చుట్టి దానిపై డిజైన్లు వేసి పెట్టుకోవచ్చు.

ప్లాస్టిక్ కప్పులను వాడుకోటానికి ఇంకా చాలా పద్ధతులున్నాయి. మీ పిల్లల స్కూలు ప్రాజెక్టులు, క్రాఫ్టులలో వాడటానికి ప్లాస్టిక్ కప్పులు చాలా ఉపయోగపడతాయి. టూత్ బ్రష్ లు పెట్టుకోడానికి మళ్ళీ ప్రత్యేకంగా స్టాండు కొనడం ఎందుకు? ప్లాస్టిక్ కప్పులు పనికొస్తాయిగా.

అందుకని, కొత్తవి కొనేముందు, ఇంట్లో ఉన్నవాటిని తిరిగి వాడటానికి ప్రయత్నిస్తే, అవి చాలా రకాలుగా ఉపయోగపడి, డ్రైనేజిలు, రోడ్లపై పైపులకు అడ్డుపడకుండా ఉండి, కొత్త సమస్యలు తీసుకురావు.

అందుకని ప్లాస్టిక్ కప్పులను డస్ట్ బిన్ లో పడేయకుండా తిరిగి వాడండి. ఇక్కడ ప్లాస్టిక్ కప్పులను వాడే కొన్ని చిట్కాలను అందించాం, అవేంటో చూడండి.

టూత్ బ్రష్ హోల్డర్

టూత్ బ్రష్ హోల్డర్

పెరుగుతో వచ్చే కప్పులను వేస్టు చేయకండి. వాటిని బాగా కడిగేసి, మీ బాత్ రూంలో టూత్ బ్రష్ లను పెట్టుకోడానికి వాడుకోండి. మళ్ళీ దానికోసం కొత్తది కొని డబ్బు వేస్టు చేయడం ఎందుకు, కదా? పిల్లలకి బాత్ రూంలో రంగురంగుల కప్పులు నచ్చుతాయి.

నాణేలు వేసి పెట్టుకోవచ్చు

నాణేలు వేసి పెట్టుకోవచ్చు

చిల్లర కోసం వెతికేటప్పుడు మీరెంత చిరాకు పడతారో తెల్సా. వాటిని హాయిగా ప్లాస్టిక్ కప్పుల్లో పెట్టుకుంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి కప్పును మీ కార్ యొక్క కప్ హోల్డర్ లో కూడా ఒకటి పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడ పెట్టారో ఇలా తెలిసాక ఇంక చిల్లర కోసం వెతుక్కోవక్కర్లేదు.

రోజువారీ నగలు దాచుకోవచ్చు

రోజువారీ నగలు దాచుకోవచ్చు

ప్లాస్టిక్ కప్పులను వాడుకోటానికి ఇదో మంచి మార్గం. మీకెంతో ఇష్టమైన ఇయర్ రింగ్స్ దొరకనప్పుడు మీరెన్నిసార్లు మీ అమ్మగారిపై అరిచి ఉంటారు? ఇంక అరవక్కర్లేదు. మీ రోజువారీ నగలను పేపర్లో చుట్టి, ప్లాస్టిక్ కప్పుల్లో పెట్టండి. ఆ కప్పులను ఒక బాక్స్ లో పెట్టుకోండి.

మొక్కల విత్తనాలు

మొక్కల విత్తనాలు

ప్లాస్టిక్ కప్పులను తిరిగి వాడటానికి ఇది చాలా ఉపయోగకరమైన విధానం. మీకు మొక్కలను పెంచే హాబీ ఉందా? కప్పులను అయితే మట్టితో నింపి, విత్తనాలు నాటండి. ఆకులు వస్తున్నప్పుడు వాటిని తీసుకెళ్ళి పెద్ద కుండీలలోకి మార్చండి. కప్పుల కింద సన్నని చిల్లులు చేయటం మర్చిపోకండి.

పేపర్ వెయిట్ గా వాడండి

పేపర్ వెయిట్ గా వాడండి

ఎలా? కప్పులో సింపుల్ గా రాళ్లను నింపేసి పేపర్ వెయిట్ గా వాడుకోండి. రోడ్డు పక్కన కన్పించే రాళ్ళు అయినా ఫర్వాలేదు. వాటిని కడగండి. మీకు ఇంకా అందంగా కన్పించాలంటే హోం డెకర్ షాపుల్లో రంగురంగుల రాళ్ళు కూడా లభిస్తాయి.

రంగుల ప్యాలెట్ గా వాడుకోండి

రంగుల ప్యాలెట్ గా వాడుకోండి

ప్లాస్టిక్ కప్పులు తిరిగి ఉపయోగపడే మరో అద్భుతమైన పద్దతి ఇది. మీరు చిత్రకారులైతే, పెయింట్ ట్యూబ్ లలోంచి రంగులను తీసి, కలపాల్సి ఉంటుంది. మీరు విడివిడిగా ప్లాస్టిక్ కప్పులను వాడితే, రకరకాల షేడ్లను ప్రయత్నించటానికి సులువుగా ఉంటుంది.

పండగ లైట్లు

పండగ లైట్లు

ప్లాస్టిక్ కప్పులను సృజనాత్మకంగా వాడే ఐడియా ఇది. దీపావళి లేదా క్రిస్మస్ అప్పుడు, మీ ఇంటిని ఎలాగో లైట్లు, దీపాలతో అలంకరిస్తారు. ప్లాస్టిక్ కప్పులను ఈ లైట్ల షేడ్లలాగా పెట్టండి, మీ చుట్టూ పరిసరాలు మరింత అందంగా కాంతితో మెరిసిపోతాయి.

లాలీపాప్ అచ్చు

లాలీపాప్ అచ్చు

ప్లాస్టిక్ కప్పులను తిరిగి వాడగలిగే విధానాల లిస్టులో ఆఖరిగా ఇది మరో అద్భుతమైన ఆలోచన. ప్లాస్టిక్ కప్పుల్లో రంగునీరును పోసి, ఫ్రిజ్ లో పెట్టండి. మీకూ, మీ పిల్లలకి రంగురంగుల, రుచికరమైన లాలీపాప్ లు రెడీ అవుతాయి.

English summary

Innovative Ways To Use Plastic Cups

Innovative Ways To Use Plastic Cups,Did you know that there are many ways to reuse plastic cups. Yes, take a look at the best ways to reuse plastic cups.
Story first published: Tuesday, February 6, 2018, 18:00 [IST]