For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరటి మొక్కలకు ఖర్చులేని సేంద్రియ ఎరువు....

|

Fertilizing Vegetable Garden Soils
సాధారణంగా ఇంటి దగ్గర పెంచుకొనే పెరటి మొక్కలు మట్టిలో కాకుండా ఇటుకలతో మడులను ఏర్పాటు చేసుకొని మట్టితో పని లేకుండా వట్టి కంపోస్టులోనే మొక్కలు పెంచుకోవచ్చు. వీటికి పుష్కలమైన పోషకాలుంటే ఆకు ఎరువులో కూరగాయలు మొక్కలు చక్కగా పెంచుకోవచ్చు. ఆకు ఎరువుతో పాటు కొద్దిగా వర్మిక్యులైట్, కొబ్బరి పొట్టు కలుపుతాను. కొబ్బరి పొట్టు కర్బనంగా మారుతుంది. వర్మిక్యులైట్ దుకాణాల్లో దొరకదు. ఇది మైకా గనుల వద్ద వ్యర్థ పదార్థాలను సేకరించవచ్చు. ఈ ఎరువు వేయటం వల్ల ఇంటి వద్ద పెంచుకొనే కూరగాయ మొక్కలు కూరలు ఆరోగ్యకరంగానే కాదు రుచిగా కూడా ఉంటాయి.

మట్టికన్నా ఆకు ఎరువు సగం బరువే ఉంటుంది కాబట్టి ఈ మడులను ఏర్పాటు చేసుకోవడం సులభం. తర్వాత కూడా శ్రమ తక్కువ. ఆకు ఎరువు పోసిన మడి కాబట్టి కలుపు అసలు రాదు. చీడపీడలు ఆశించవు. కాబట్టి మనకు శ్రమ ఉండదు. మడి ఎండిపోకుండా.. తడీ పొడిగా ఉండేలా రోజూ తగినంత నీరు చల్లుకుంటే చాలు. ఒక్కసారి మడి ఏర్పాటు చేసుకుంటే రెండేళ్ల వరకూ ఖర్చు ఉండదు.

ఆకు ఎరువును ఉపయోగించుట వల్ల పది నుండి 15 దఫాలు ఆకుకూరలు, కూరగాయ మొక్కలు వేసుకోవచ్చు. ఎవరైనా సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆకు ఎరువును కూరగాయలు, పండ్ల తొక్కలు, రాలిన ఆకులతో స్వయంగా ఇంటి వద్దనే తయారుచేసుకోవచ్చు. వ్యర్థ పదార్థాలను తిరిగి ఉపయోగించడమే లక్ష్యం... అతి తక్కువ స్థలంలో ఆరోగ్యదాయకమైన కూరగాయలు పండించుకొని ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. కాబట్టి ఖర్చులేని ఆకుఎరువును వర్మికంపోస్ట్ తో బోలెడన్ని కూరగాయల్ని ఇంటి దగ్గరే పెంచుకోవడం మొదలెట్టండి. ఆరోగ్యానికి ఆరోగ్యం..రుచికి రుచి...డబ్బు పొదుపు..అన్నివిధాల శేయష్కరం.

English summary

Fertilizing Vegetable Garden Soils | చెత్తతో.....చాటంత లాభం...

Compost contains a small percentage of the essential plant nutrients required by vegetables. Vegetable plants, like all other green plants, require several nutrient elements for growth, development and productivity.
Story first published:Monday, March 19, 2012, 16:14 [IST]
Desktop Bottom Promotion