For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిచెన్ స్పా౦జ్ లను స్టేరిలైజ్ చేయడం ఎలా?

|

వంట గది లో పాత్రలు, వంట సామాను, ఒలికిన ఆహార పదార్ధాలు శుభ్రం చేయడానికి ఉపయోగపడే బహుళ ప్రయోజనకారి సాధనాలు కిచెన్ స్పా౦జ్ లు. వీటిలో మెత్తగా ఉండే పాలి యురితేన్ ఫోమ్ ఉండడం వల్ల ద్రవాలను పీల్చుకున్నా తమ ఆకారాన్ని కోల్పోవు. ఐతే స్పాంజ్ లలో గుడ్ల నుంచి, మాంసాహార పదార్ధాల నుంచి, కూరగాయల నుంచి ప్రమాదకరమైన వైరస్ లు, సూక్ష్మ క్రిములు అంటుకునే అవకాశం వుంది. కిచెన్ స్పా౦జ్ లను నిత్యం శుభ్రం చేయకపోతే ఆహార పదార్ధాల వల్ల వచ్చే సాల్మొనెల్లా, హెపటైటిస్ ఎ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం వుంది. కాలుష్యం నివారించడానికి, వంట గది లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంచుకోవడానికి స్పాంజ్ లను వారానికి ఒకసారి శుభ్రం చేయాలి.

సూచనలు:
1. స్పా౦జ్ ను చల్లటి నీటి క్రింద కడిగి అంటుకున్న ఆహార వ్యర్ధాలు, మురికి పోయేలా చేయండి. స్పా౦జ్ లో వున్న అదనపు నీటిని పిండి వేయండి.

2. మైక్రోవేవ్ సేఫ్ బౌల్ లో అర కప్పు చల్లటి నీటిని తీసుకోండి. దాంట్లో స్పాంజ్ ను వుంచండి.

3. ఈ బౌల్ ను మైక్రోవేవ్ లో వుంచండి. రెండు నిమిషాల పాటు మైక్రోవేవ్ ను అత్యధిక ఉష్ణోగ్రతలో వుంచండి. మైక్రోవేవ్ ను తయారీదారు సూచనల ప్రకారం వాడండి.

4. బౌల్ పూర్తిగా చల్లగా అయ్యేదాకా వుండి మైక్రోవేవ్ లోంచి తీయండి.

How to Sterilize Kitchen Sponges

5. నీళ్ళు పూర్తిగా చల్లబడే దాకా ఆగి స్పాంజ్ ను బయటకు తీయండి.

చిట్కాలు & హెచ్చరికలు:

మైక్రోవేవ్ లో రెండు నిమిషాల పాటు ఉంచే బదులు డిష్ వాషర్ డ్రైయింగ్ సైకిల్ ను కూడా వాడవచ్చు. చేతులు కాలకుండా బౌల్ ను జాగ్రత్తగా తీయండి.

English summary

How to Sterilize Kitchen Sponges | కిచెన్ స్పా౦జ్ లను స్టేరిలైజ్ చేయడం ఎలా?

Kitchen sponges are versatile cleaning supplies commonly used for washing dishes, cleaning kitchen appliances and wiping up food spills. They consist of squishy polyurethane foam to absorb liquid and retain their shape. Sponges can harbor harmful pathogens, viruses and microbes from raw eggs, meats and vegetables.
Story first published: Tuesday, January 15, 2013, 18:23 [IST]
Desktop Bottom Promotion