For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మేజోళ్ళ నిర్వహణలో మెళుకువలు!

By B N Sharma
|

Easy Tips To Wash & Maintain Socks
వార్డ్ రోబ్ లో వుండే ప్రధాన అవసరాలలో కాళ్ళకు ధరించే సాక్స్ ఒకటి. సాక్స్ సరిగా వాష్ చేయకపోతే, వాటి ఎలాస్టిసిటీ కొల్పోయి చిరిగిపోయే ప్రమాదం కూడా వుంది. కనుక సాక్స్ దీర్ఘకాలం మనన్నేట్లు నిర్వహించాలంటే ఏం చేయాలో చూడండి.

1. సాక్స్ ఎల్లపుడూ రెండూ కలిపే వాష్ చేయండి. ఉతికేటపుడు రెంటికి కలిపి క్లిప్ పెట్టటం లేదా చి్న బ్యాగులో పెట్టి వుంచటం చేయండి.
2. సాక్స్ ఉతికేటపుడు వాటిని నులివెచ్చని నీటిలో ఉతకటం మంచిది. ఉతికేముందు వాటిపై గల లేబుల్ చదవండి.
3. ఎలాస్టిసిటీ పోకుండా వుండాలంటే మెల్లగా వాష్ చేయండి. డిటర్జెంట్ కలిపిన నీటిలో పది నిమిషాలు నానపెట్టండి లేదా వాషింగ్ మెషీన్ లో వేయండి.
4. కొద్దిపాటి డిటర్జెంట్ ఉపయోగిస్తే వదిలించటం తేలికవుతుంది.
5. సాక్స్ క్లీనింగ్ కు గాను బ్రష్ వాడకండి. గుడ్డ నాణ్యత, ఎలాస్టిసిటీ పోతుంది.
6. వీలైనంత వరకు చేతితోనే వాష్ చేయండి.
7. సాక్స్ బ్లీచ్ చేయవద్దు. చివరి వాష్ లో కొద్దిపాటి వినేగార్ కలిపిన నీటిలో ముంచితే మంచి వాసన వచ్చి గుడ్డ మెత్తగా వుంటుంది.
8. డ్రయ్యర్ తో కాకుండా గాలిలో ఆరబెట్టండి. ఐరన్ చేయవద్దు. ఆరిన తర్వాత మడచి వార్డ్ రోబ్ లో వుంచండి.
9. ప్రతి ఉపయోగం తర్వాత సాక్స్ శుభ్ర పరచుకుంటే వాసన రాకుండా ఆరోగ్యంగా వుంటుంది.

English summary

Easy Tips To Wash & Maintain Socks | మేజోళ్ళ నిర్వహణలో మెళుకువలు!

Socks are basic essentials of a wardrobe and washing them is really easy. The only problem with socks is the elasticity. Often the socks lose their elasticity, get snags or holes, after few washes and you can't keep buying new pair of socks every other week.
Story first published:Tuesday, November 29, 2011, 15:58 [IST]
Desktop Bottom Promotion