For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళికి ఇంటిని శుభ్రపరచడానికి సులభమైన చిట్కాలు..

|

దేశంలో అత్యంత ఇష్టంగా పిల్లలు పెద్దలు ఇంటిళ్లిపాది సంబరాలు జరుపుకొనే పండుగ దీపాలి. ఇక కొద్దిరోజుల్లో ఇంట్లో దీపాలతో కళకళలాడుతుంటుంది. ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి కొన్ని వారాల ముందు నుండే ఇంట్లో పనులు మొదలెడుతారు. దీపావళి పండుగకు లక్ష్మీ పూజ ప్రధానమైనది లక్ష్మీ దేవి చల్లని చూపు తమపై ప్రసరించాలని కోరుతూ, ప్రతి ఇంట్లోను పండుగనాడు స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ అట్టహాసంగా ఆ మాత కు పూజలు చేసి ఆశీర్వాదాలు కోరతారు. అలాగే గణేష పూజ కూడా ప్రధానమే. ఇలా లక్ష్మీ దేవిని ప్రసన్న చేసుకోవాలంటే ఆమెకు నచ్చినవిధంగా ఇంటిని శుచిగా.. శుభ్రతతో పెట్టుకోవాలి.

Tips To Ease Diwali House Cleaning

హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రజలు లక్ష్మీదేవిని వారి వారి ఇళ్ళ ఆహ్వానించడానికి వారి స్తోమతను బట్టి ఇంటిఅలంకరణలు, దీపాలంకరణలు చేసుకొంటారు. దేవున్ని నిష్టతో ప్రార్థిస్తారు. ఎక్కడ శుచి, శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ప్రసన్నమౌతుందని అంటారు. కాబట్టి దీపావళికి ముందుగానే ఇంటి శుభ్రం చేయడం మొదలెట్టండి. చాలా మంది ఈ పండగకు ఇంటి శుభ్రతత పోటు ఇంటికి కొత్తగా వాల్ పెయింటింగ్ చేయించడం, ఫర్నీచర్ కు పాలిష్ వంటి పనులను కూడా చేస్తారు.

ఒకేసారి ఇంటిని శుభ్రపరచాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకు చాలా శక్తి, మనస్సుకు ఉత్సాహం కలిగి ఉండాలి. కాబట్టి ఈ దీపావళికి శరీరం శ్రమ చెందకుండా ఇంటి చక్కబెట్టడంలో కొన్ని సులభమైన క్లీనింగ్ చిట్కాలు మీకోసం...

వార్డ్ రోబ్ తో శుభ్రత మొదలు పెట్టండి: చిన్న ఫర్నీచర్లు మరియు చిన్న చిన్న వస్తువులను శుభ్రం చేయడం చాలా సులభం. కాబట్టి వార్డ్ రోబ్స్ క్లీన్ చేయడానికి రెండు గంట సమయం పట్టవచ్చు. వార్డ్ రోబ్ లో ఉన్న పాత బట్టలు, చిరిగిన బట్టలను తీసి పడేయాలి. అలాగే మీరు తరచూ వాడని బట్టలను విడిగా సర్దుకోవాలి. అలాగే వార్డ్ రోబ్ లో దుస్తులను సర్దేటప్పుడు చిన్న చిన్న దుస్తులను, హ్యాడ్ కర్ఛీఫ్ లను, సాక్స్ లు వంటివి సపరేట్ గా కనబడే విధంగా అమర్చుకోవాలి. డైలీ వేర్ ను సపరేట్ గా సర్దుకోవాలి.

బెడ్ బాక్స్ ల శుభ్రత: దీపాలి వచ్చిదంటే అన్ని వస్తువులను క్లీన్ చేయాలని అప్పుడే గుర్తుస్తుంటాయి. బెడ్ కనుకు క్రింద బాక్స్ అమర్చి అందులో దుస్తులు, ఇతర వస్తువులు కుప్పలుగా పడేసి ఉంటారు. బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, ఉపయోగించని కర్టెన్లు ఇలాంటి వాటినన్నింటిని బయటకు తీసి శుభ్రం చేసి అవసరం అయిన వాటిని మాత్రమే తిరిగి అందులో సర్దుకోవాలి. చెక్క బెడ్ ను పొడి వస్త్రాన్ని తీసుకొని శుభ్రం చేయాలి.

ఫ్యాన్ మరియు లైట్స్ క్లీనింగ్: ప్రతి మూడు నెలలకొక సారి ఫ్యాన్స్, లైట్స్ ను శుభ్రం చేయడం వల్ల ఫ్యాన్స్ పాడవకుండా ఉంటాయి. లైట్స్ బ్రైట్ గా వెలుగుతాయి. అలాగే ఇంటి కిటికీలు, తలుపులను కూడా శుభ్రం చేసుకోవాలి. ఫ్యాన్స్, లైట్స్ క్లీన్ చేసేటప్పుడు పొడి వస్త్రాన్ని ఉపయోగించాలి. దాంతో కరెంట్ షాక్ కు గురికాకుండా ఉంటారు.

వంట గది: ఇంటి మొత్తంలో అత్యంత ప్రధానమైన ప్రదేశం వంటగది. ఎందుకంటే వంట చేయడం, తినడం వంటివి ఈ ప్రదేశంలో ఎక్కువ కాబట్టి ఎక్కువ అశుభ్రంగా మారేది కూడా ఈ గదిలోనే. కాబట్టి వంటగది శుభ్రత మరింత ముఖ్యం. అందులో ఉన్న చిన్న చిన్న పోపు డబ్బాలు, గ్యాస్ స్టౌ, స్లాబ్స్, ఎక్సాస్ట్ ఫ్యాన్, స్టీల్ సామాన్లు అన్నింటినీ శుభ్రం చేసుకోవడం ముఖ్యం. ఈ పనులన్నీ ఒక్కరోజులో శుభ్రం చేసుకోవడానికి వీలుకాకపోతే రెండు మూడు రోజలు డివైడ్ చేసుకొని శుభ్రం చేసుకోవాలి.

కిటికీలు మరియు గ్రిల్స్: సాధారణంగా చాలా మంది ఫ్యాన్స్, విండోస్ పట్ల అంత శ్రద్ద తీసుకోరు. కిటీకీలు, గ్రిల్స్ మీదు దుమ్ము, ధూలి అతి సులభంగా వచ్చి చేరిపోతుంది. కాబట్టి సోప్ వాటర్ తో గ్రిల్స్ ను శుభ్రం చేసిన తర్వాత పొడి వస్త్రంతో తుడివాలి.

కర్టెన్స్ మరియు సోఫా కవర్స్: చివరగా సోఫా కవర్స్, కర్టెన్స్ వంటివి శుభ్రం చేసుకోవాలి. అవే ఇంటికి ప్రధాన ఆకర్షణ కాబట్టి ఎంత క్లీన్ గా ఉంటే అంత అందంగా ఉంటుంది. కాబట్టి ఈ సులభమైన క్లీనింగ్ చిట్కాలను ఈ దీపావళికి మీరు ప్లాన్ చేసి శుభ్రం చేసుకోండి. శుచి, శుభ్రత పాటించి లక్ష్మీ దేవి ఆశీస్సులను పొందండి...

English summary

Tips To Ease Diwali House Cleaning | దీపావళికి సులభమైన హౌస్ క్లీనింగ్ చిట్కాలు...

Diwali is around the corner. The festival of lights brings in joy and lots of colours in our lives. This Hindu festival is grand and the preparations start weeks before. Diwali is the festival of Goddess Lakshmi and Lord Ganesha.
Desktop Bottom Promotion