For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రులలో జరుపుకునే ఆయుధ పూజకున్న ప్రాముఖ్యత

By Staff
|

ఆయుధపూజను దక్షిణ భారతదేశంలో జరుపుకునే ప్రత్యేక పండుగలలో ఒకటి. నవరాత్రి ఉత్తర భారతదేశంలో చాలా ఉత్సాహముతో మరియు వైభవముగా జరుపుకుంటే, భారతదేశం యొక్క దక్షిణ ప్రాంతాలలో దీనిని చాలా భిన్నరీతులలో జరుపుకుంటారు. ఆయుధపూజ, నవరాత్రుల సమయంలో జరుగుతుంది; శ్రీ రామ నవమి రోజున లేదా నవరాత్రులలో తొమ్మిదవ రోజున జరుపుకుంటారు. ఈ రోజు ఆయుధాలు మరియు పనిముట్లకు భక్తులు పూజలు చేస్తారు.

ఈ పండుగ వెనుక అనేక వివిధ పురాణములు ఉన్నాయి. మొదటి కథ దుర్గామాతకు సంబందించినది. అష్టమి మరియు నవమి సంధి సమయంలో మాత మహిషాశురుడిని సంహరించిన తరువాత, నవమి నాడు ఆమె ఆయుధ విసర్జన చేసింది. గేదె రూపంలో ఉన్న రాక్షసుడిని సంహరించిన తరువాత ఆమె ఆయుధాలకు పూజలు చేశారు. కాబట్టి, మహిషాశుర సంహారానికి గుర్తుగా ఈ ఆయుధపూజను జరుపుకుంటారు.

Ayudha Puja: Weapon Puja In Navratri

ఆయుధపూజ గురించి మరో పురాణం మహాభారతం సంబంధించినది. 13 సంవత్సరాల వనవాసం కొరకు పాండవులు తమ ఆయుధాలను ఒక శమీ వృక్షం లోపల దాచారు. కురుక్షేత్ర యుద్దానికి బయలుదేరే ముందు, వారు వారి ఆయుధాలకు పూజలు చేశారు. ఈ పూజల వలన పాండవుల విజయం సాధించారు అని నిరూపించడానికి ఇది ఒక సాక్ష్యం.

ఈ రోజుల్లో, మనము రోజువారి జీవితంలో ఆయుధాలను చాలా అరుదుగా ఉపయోగిస్తుంటాము. అయితే, ఆయుధపూజను ఇప్పుడు మన వృత్తితో ముడిపెడుతున్నాము. ఇప్పుడు, కార్లు, గ్యాస్ స్టవ్, కంప్యూటర్లు, ఫోన్లు వంటి వాటికి ఈ రోజున పూజిస్తున్నాము. నిజానికి, కార్యాలయాల్లో జరుపుకునే ఆయుధపూజ వేడుక, దీనిని సజీవముగా ఉంచటానికి ఎన్నుకున్న గొప్ప మార్గం.

English summary

Ayudha Puja: Weapon Puja In Navratri

Ayudha puja is a special festival that is celebrated in South India. While Navratri is being celebrated with much pomp and splendour in North India, the Southern parts of India have a very different flavour of festivities to offer.
Desktop Bottom Promotion