For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాస్తు ప్రకారం ఇంట్లో అద్దాల అమరికలో పాటించాల్సిన...పాటించకూడని అంశాలు!!

ఒక ఇంటిని గాని, ప్రాంతాన్ని గాన్ని అందంగా తీర్చిదిద్దడంలో మిర్రర్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మీరు సంతోషంగా విలసిల్లడానికి మిర్రర్స్ ని సరైన విధంగా అమర్చే విధానం వల్ల ఫెంగ్ షుయ్ 'చి' ఆహ్వానింపబడుతుంది.

By Lekhaka
|

ఫెంగ్ షుయ్ లో 'చి' ప్రవాహాన్ని శాసించే గొప్పదనం మిర్రర్స్ కి ఉందని అర్థం చేసుకోవాలి. మిర్రర్స్ ని అమర్చే విధానం ఫెంగ్ షుయ్ శక్తిని ఆకర్షించగలవు అలాగే శక్తిని నశింపచేయగలవు కూడా. సాధారణ మిర్రర్ లేదా అద్దంని ఫెంగ్ షుయ్ యాక్టివేటర్ గా భావించవచ్చు. ఒక ఇంటిని గాని, ప్రాంతాన్ని గాన్ని అందంగా తీర్చిదిద్దడంలో మిర్రర్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మీరు సంతోషంగా విలసిల్లడానికి మిర్రర్స్ ని సరైన విధంగా అమర్చే విధానం వల్ల ఫెంగ్ షుయ్ 'చి' ఆహ్వానింపబడుతుంది.

 Reflections on Feng Shui – 10 Mirror Do’s and Don’ts

అయినప్పటికీ, ఫెంగ్ షుయ్ లో మిర్రర్స్ యొక్క వాడకం గురించి ఇంకా కొన్ని అపోహలు ఉన్నాయి. ప్రభావవంతమైన ప్రయోజనాలు పొందేందుకు అద్దాలను ఎలా ఉపయోగించవచ్చు? మిర్రర్స్ వాడకం గురించి ఫెంగ్ షుయ్ లో ఏవైనా విధి విధానాలు ఉన్నాయా? ఇటువంటి ప్రశ్నలతో పాటు, మిర్రర్స్ ని ఎక్కడ అమర్చాలి, ఎక్కడ అమర్చకూడదు వంటి ప్రశ్నలున్నట్లయితే ఈ వ్యాసం మీకు ఆ సందేహాలన్నీ నివృత్తి చేయడానికి తోడ్పడుతుంది.


పాటించవలసినవి

పాటించవలసినవి

అందమైన వీక్షణలని ప్రతిబింబించాలి. మీ లివింగ్ రూమ్ లో గాని, డైనింగ్ రూమ్ లో గాని అందమైన చెట్లను, నీలాకాశాన్ని, చక్కటి పూదోటని లేదా ఏదైనా అందమైన దృశ్యాలని వీక్షించే అవకాశం గలదా? అయితే, ఆ రూమ్లో లో మిర్రర్ అనేది ఖచ్చితంగా ఉంది తీరాల్సిన వస్తువు. అందమైన వీక్షణలను మిర్రర్స్ ప్రతిబింబించడం ద్వారా అందాన్ని రెట్టింపు చేసినట్టవుతుంది.

పాటించవలసినవి

పాటించవలసినవి

డైనింగ్ అలాగే లివింగ్ యారియాస్ ను ప్రతిబింబించాలి. మిర్రర్స్ అనేవి డైనింగ్ రూమ్స్ లో ఉండి తీరాలి. ఎందుకంటే, డైనింగ్ రూమ్ అనేది ఒక కుటుంబం యొక్క సంపదకు ప్రాతినిథ్యం వహిస్తుంది. అందుకే, ఎనర్జీ ని పెంపొందించే శక్తి డైనింగ్ రూమ్ లో ఉంది. అలాగే, తరచూ పార్టీలు అలాగే గెట్ టు గెదర్ లు జరిగే లివింగ్ రూమ్ లో మిర్రర్ ను అమర్చడం వల్ల సందడి చేసే వారు రెట్టింపైనట్టు కనపడి పండగ వాతావరణంతో ఇల్లు కళకళలాడుతుంది.

 స్క్వేర్ పిల్లర్స్ వంటి సమస్యలను మిర్రర్స్ తో హైడ్ చేయవచ్చు.

స్క్వేర్ పిల్లర్స్ వంటి సమస్యలను మిర్రర్స్ తో హైడ్ చేయవచ్చు.

కొన్ని సమస్యలను హైడ్ చేయడానికి మిర్రర్స్ ను ఉపయోగించాలి. స్క్వేర్ పిల్లర్స్ వంటి సమస్యలను మిర్రర్స్ తో హైడ్ చేయవచ్చు. చాలా ఇళ్లల్లో పిల్లర్స్ ఉంటాయి. బేసెమెంట్స్ లో అలాగే ఆఫీస్ లలో గది మధ్యన గనక పిల్లర్ ఉన్నట్లయితే నాలుగు వైపులా మిర్రర్ ని అమర్చి ఆ పిల్లర్ ని అందంగా కవర్ చేయవచ్చు.

ధనాన్ని రెట్టింపు చేసేందుకు

ధనాన్ని రెట్టింపు చేసేందుకు

మీ ధనాన్ని రెట్టింపు చేసేందుకు మిర్రర్స్ ని ఉపయోగించవచ్చు. మీ నగలు అలాగే క్యాష్ రిజిస్టర్ ని ప్రతిబింబించే విధంగా, అలాగే మీ షాప్ యొక్క ప్రధాన ద్వారం వద్ద మిర్రర్ ని అమర్చినట్లయితే డబ్బుని ఆకర్షించే 'చి' త్వరగా ఆకర్షింపబడుతుంది. తద్వారా బోలెడు మంది కస్టమర్లు ఏర్పాటై మీరు సంపన్నులవుతారు.

స్పేస్ ఎక్కువగా ఉండేలా కనిపించేందుకు

స్పేస్ ఎక్కువగా ఉండేలా కనిపించేందుకు

స్పేస్ ఎక్కువగా ఉండేలా కనిపించేందుకు మిర్రర్స్ ని అమర్చవచ్చు. మీ గది చిన్నదయితే లేదా పొడవాటి హాల్ వే ఉన్నట్టయితే అద్దాన్ని అమర్చేందుకు అవే సరైన స్థలాలు. గోడకు ఎదురుగా మీరు ఒక మిర్రర్ ని ఏర్పటు చేసినట్టయితే స్పేస్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. హాల్ వే లోని ఓ మిర్రర్ ని అమర్చడం వల్ల 'చి' వేగాన్ని అదుపులో పెట్టవచ్చు అలాగే హాల్ వే లో ఆసక్తిని జతచేసినట్టు కూడా ఉంటుంది.

స్పేస్ ఎక్కువగా ఉండేలా కనిపించేందుకు

స్పేస్ ఎక్కువగా ఉండేలా కనిపించేందుకు

ఫెంగ్ షుయ్ ప్రకారం బెడ్ రూమ్ లో మిర్రర్స్ ని నివారించండి.

ఫెంగ్ షుయ్ లో మిర్రర్ అమరిక పట్ల జాగ్రత్తపడాల్సిన అంశాలు

ఫెంగ్ షుయ్ లో మిర్రర్ అమరిక పట్ల జాగ్రత్తపడాల్సిన అంశాలు

ఫ్రంట్ డోర్ ఎదురుగా మిర్రర్ ని అమర్చకండి. దీని వల్ల ఎనర్జీ ద్వారం నుంచి తరలి వెళ్ళిపోతుంది. చాలా వ్యాపారాలు ఈ చిట్కాని పాటించకపోవడం ద్వారా ఎంతో నష్టాలను చవిచూసాయి. హాలును ఓపెన్ చేయడానికి మిర్రర్ ని ఉపయోగించడం అద్భుతమైన ఆలోచన. అంతే కాని, ఫ్రంట్ డోర్ కి ఎదురుగా మాత్రం మిర్రర్ ని ఉంచకండి.

ఫెంగ్ షుయ్ లో మిర్రర్ అమరిక పట్ల జాగ్రత్తపడాల్సిన అంశాలు

ఫెంగ్ షుయ్ లో మిర్రర్ అమరిక పట్ల జాగ్రత్తపడాల్సిన అంశాలు

ప్రతికూల వీక్షణలు ప్రతిబింబించకూడదు. ఉదాహరణకు, టాయిలెట్ డోర్ ని, ఫైర్ ప్లేస్ ని (ఫైర్ ప్లేస్ పైన మిర్రర్ ఉన్నా పరవాలేదు), స్టవ్ టాప్ ని, గందరగోళంగా ఉండే ప్రాంతాలను రిఫ్లెక్ట్ చేసే విధంగా అద్దాన్ని అమర్చకూడదు. మిర్రర్ లోంచి అసహ్యకరమైన వీక్షణను మీరు చూసినట్లయితే దాని తాలూకు ప్రతికూల ఎనర్జీ అధికమవుతుంది. ప్రత్యేకించి అగ్నికి ఇది వర్తిస్తుంది. కొంచెం ఫైర్ మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది. అయితే, ఎక్కువ ఫైర్ వల్ల ఎనర్జీ అధికమవుతుంది. కాబట్టి, ఇవన్నీ గమనించి మిర్రర్ ని అమర్చాలి.

ఫెంగ్ షుయ్ లో మిర్రర్ అమరిక పట్ల జాగ్రత్తపడాల్సిన అంశాలు

ఫెంగ్ షుయ్ లో మిర్రర్ అమరిక పట్ల జాగ్రత్తపడాల్సిన అంశాలు

హానికరమైన లేదా కటింగ్ ఎనర్జీ ని పంపించేటటువంటి చోట్ల మిర్రర్ ని అమర్చవద్దు. అందుకే, హాల్ వే చివర మీరు మిర్రర్ ని అమర్చకూడదు. ఎందుకంటే, మీరు అలా అమర్చడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఆకర్షింపబడుతుంది. అలాగే, మెట్లు కింద మిర్రర్ ని అమర్చడం వల్ల మీరు మెట్లు దిగే ప్రతిసారి మీ ప్రతిబింబం ముక్కలుగా కనిపిస్తుంది. మీ ప్రతిబింబంలో తల లేదా కాళ్ళు కట్ అయి అద్దంలో కనిపిస్తుంది. అందుకే, మెట్ల కింద కూడా అద్దం అమర్చడం శ్రేయస్కరం కాదు.

ఫెంగ్ షుయ్ లో మిర్రర్ అమరిక పట్ల జాగ్రత్తపడాల్సిన అంశాలు

ఫెంగ్ షుయ్ లో మిర్రర్ అమరిక పట్ల జాగ్రత్తపడాల్సిన అంశాలు

బెడ్ రూమ్ లో మిర్రర్ ని అమర్చడం మంచిది కాదు. ప్రత్యేకించి, ఆ మిర్రర్ గనక మీ బెడ్ ను ప్రతింబింబించే విధంగా ఉంటే అస్సలు మంచిది కాదు. దాని వల్ల, నిద్ర లేమి వంటి సమస్యలతో సతమతమవుతారు. అంతే కాదు, మీ వైవాహిక జీవితం కూడా చిక్కుల్లో పడే ఆస్కారం కలదు. మూడో వ్యక్తి జ్యోక్యంతో వైవాహిక జీవితం అస్తవ్యస్తంగా మారవచ్చు. కాబట్టి, మిర్రర్ కు మీ బెడ్ రూమ్ లో స్థానం కలిగించకండి.

ఫెంగ్ షుయ్ లో మిర్రర్ అమరిక పట్ల జాగ్రత్తపడాల్సిన అంశాలు

ఫెంగ్ షుయ్ లో మిర్రర్ అమరిక పట్ల జాగ్రత్తపడాల్సిన అంశాలు

అలాగే, విరిగిపోయిన లేదా పకువా మిర్రర్స్ ను వాడకండి. పకువా మిర్రర్ ను ఎంతో జాగ్రత్తతో మీరు అమరుస్తారు. అయితే, ఇవి ప్రతిబింబించే శక్తిని తిరిగి అంతే వేగంగా బలంగా వెనక్కి పంపుతాయి. దీని వల్ల మీరు మీ పొరుగువారికి నెగటివ్ ఎనర్జీని పంపినవారవుతారు. తద్వారా పొరుగువారితో సత్సంబంధాలుండవు. దానికి తోడు , ఇటువంటి మిర్రర్స్ లో ట్రైగ్రామ్స్ ఉంటాయి. ఇవి ఈ మిర్రర్స్ ని వాడే వారికి హానికరం. కాబట్టి వీటి వాడకాన్ని నివారించండి. అలాగే, పగిలిపోయిన అద్దాలు ఇంట్లో ఉండటం కూడా మంచివి కాదు. ఒక చిత్రాన్ని ముక్కలుగా చూపించే పగిలిపోయిన అద్దాలను ఇంట్లోనుంచి తొలగించడం మంచిది.

English summary

Reflections on Feng Shui – 10 Mirror Do’s and Don’ts

Yet, using mirrors in feng shui is often misunderstood. How does one use mirrors effectively? Are there rules for using mirrors in feng shui? If you have had questions about using mirrors correctly, the following should help you understand when, where and where not to use them.
Desktop Bottom Promotion