For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎలుకలు మరియు సాలెపురుగులను తరిమికొట్టడానికి పాటించవలసిన చిట్కాలు

|

చాలామంది మహిళలకు ఎలుకలన్నా, సాలెపురుగులన్నా చచ్చేంత భయం. ఇంట్లో వాటి ఉనికిని కూడా ద్వేషిస్తారు. వారి భయానికి మూలం మరియు కారణం గురించి నిజంగా ఆలోచించవలసినదే! ఇంట్లో ఎలుకలు మరియు సాలెపురుగులు ఉంటే, ఎటువంటి వారికైనా వాటితో కలిసి కాపురం చేయడం సాధ్యం కాదు.

ఈ జీవులు ఇంటిని ఇబ్బందికరంగా మార్చేయటమే కాక, మన ఇల్లు మరియు చుట్టుపక్కల అనేక రకాల వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఫలితంగా, ఎలుకలు మరియు సాలెపురుగులు ఉన్న ఇళ్ళలోని సభ్యులు చాలా తరచుగా అనారోగ్యం బారిన పడుతున్నారు.

మన ఇంట్లో ఎలుకలు మరియు సాలెపురుగులు ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్న తరువాత, వాటిని ఎలా వదిలించుకోవాలి అనేదే మన ముందున్న సమస్య. ఎలుకలను వదిలించుకోవటం చాలా కష్టమైన పని. వెలుపల ప్రపంచంలోని కఠినమైన వాతావరణంలో మనుగడ సాగించడానికన్నా, ఇవి ఒకసారి ఒక ఇంటిలోని సౌకర్యం మరియు వెచ్చదనానికి అలవాటు పడ్డాక, ఆ సుఖమే మేలని వదిలిపెట్టి వెళ్లవు.

ఇవి మీ ఇంటి నలుమూలల్లో కాపురాలు పెట్టి, వాటి సంతానాన్ని దినదిన ప్రవర్ధమానం చేసుకుంటాయి. ఈ వ్యాసం ద్వారా, మీ ఇంట్లో ఎలుకలు మరియు సాలెపురుగులను వదిలించుకోవాలంటే, పాటించవలసిన చిట్కాలను గురించి తెలియజేస్తున్నాం.

ఎలుకలు మరియు సాలెపురుగులను ఎలా వదిలించుకోవాలో అర్ధం చేసుకోండి.

ఇక్కడ మనస్సులో ఉంచుకోవలసిన మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఈ జీవుల కంటి చూపు చాలా మందగించి ఉంటుంది కానీ వాటి ఆఘ్రాణ శక్తి అమోఘం. కనుక, మీరు దీర్ఘకాలికంగా ఎలుకలు మరియు సాలెపురుగులను తరిమికొట్టాలి అని కోరుకుంటే, మీరు ఈ లక్షణంపై గురిపెట్టండి.

ఒక రకమైన ఘాటు లేదా బలమైన వాసన కలిగి ఉన్న పదార్ధాన్ని అవి సంచరించే ప్రదేశాల్లో ఉంచడం ద్వారా, వారు మీ ఇల్లు వదిలిపెట్టి పారిపోవడమే కాక తిరిగి అడుగు పెట్టనివ్వకుండా చేయవచ్చు.

ఎలుకలు మరియు సాలెపురుగులను తరిమికొట్టడానికి పాటించవలసిన చిట్కాలు:

1. టీ సంచులు:

1. టీ సంచులు:

మీరు చేయాల్సిందల్లా ఒక గిన్నెలో వేడినీరు తీసుకుని, అందులో మూడు నుండి నాలుగు టీబ్యాగ్లను వేసి మరిగించాలి. ఈ వాసనకు సాలీడులు మరియు ఎలుకలు దూరంగా పారిపోతాయి కనుక, ఎంత ఘాటైన వాసన కలిగిన రుచి టీ సంచులు వేస్తే అంత మంచిది. అస్సాం టీ, నీలగిరి తేయాకు లేదా పిప్పరమింట్ టీ ఈ పనికి బాగా ఉపయోగపడతాయి.

టీ సరిగ్గా మరిగిన తరువాత, మీరు నీటిని వడకట్టండి. ఇప్పుడు టీ సంచులను తీసుకొని ఇల్లంతటా పెట్టండి. కనీసం 6 నుండి 7 గంటల పాటు వీటిని కదపకుండా ఉండేట్టు చూడండి. ఎలుకలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో మాత్రం, టీ సంచులను అదనంగా ఉంచండి.

మీ ఇంట్లోని ఎలుకలు మరియు సాలెపురుగులను సంపూర్ణంగా బయటకు వెళ్లగొట్టడానికి, ఇదే పనిని వరుసగా 2 నుండి 3 రోజుల పాటు పునరావృతం చేయండి.

2. బిర్యానీ ఆకులు:

2. బిర్యానీ ఆకులు:

భారతీయ మసాలా వంటకాలలో విరివిగా వాడే బిర్యానీ ఆకులు వాసన, రుచి తెలియనివారు చాలా అరుదుగా ఉంటారు. అయితే, ఇదే వాసన ఎలుకలు మరియు సాలెపురుగులు పని పట్టడంలో అద్భుతంగా పనిచేస్తుందని చాలా మందికి తెలియదు.

ఎలుకలు మరియు సాలెపురుగులను తరిమేయడానికి వీటిని ఉపయోగించడంలో, మీరు పెద్దగా శ్రమ పడవలసిన అవసరం లేదు. కేవలం, బిర్యానీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ అవాంఛిత జీవుల నివశించే ప్రాంతాల్లో ఉంచండి. బిర్యానీ ఆకుల యొక్క బలమైన వాసన వీటిని బయటకు పరుగులు పెట్టిస్తుంది.

3. మింట్ టూత్ పేస్ట్:

3. మింట్ టూత్ పేస్ట్:

ఎలుకలు మీ ఇంటిలోనికి ప్రవేశిస్తున్న మార్గాన్ని మీరు గుర్తించగలిగితే, ఈ పద్ధతి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీరు చేయాల్సినదల్లా, ఎలుకలు ఇంట్లోకి ప్రవేశించే ద్వారం వద్ద ఎక్కువ పరిమాణంలో టూత్ పేస్టును అద్దండి. అంతేకాకుండా, మీ ఇంట్లోని బీరువాలు మరియు అల్మరాలు దిగువన కొంచెం టూత్ పేస్టు రుద్దండి. ఇది మీ ఇంట్లో ఉన్న ఎలుకలన్నింటి పని పడుతుంది.

సాలెపురుగుల సాధారణంగా ఇంటి మూలల్లో , తలుపులు మరియు కిటికీల వద్ద గూడు కడతాయి. పదేపదే అదే స్థలంలో గూళ్ళు కడతాయి. కనుక, మీరు ఆ ప్రాంతాలన్ని గుర్తించి కొద్దిపాటి టూత్ పేస్టుని రాయండి.

4. వంట సోడా:

4. వంట సోడా:

ఎలుకలు మరియు సాలెపురుగులు వదిలించుకోవటానికి వాడే సురక్షితమైన మార్గాలలో ఇది ఒకటి. పిలవని పేరంటానికి వచ్చిన ఈ అతిధులు, ఇంటిని విడిచిపెట్టిన తర్వాత, శుభ్రం చేయడం చాలా సులభం (పొడిగుడ్డతో లేదా వాక్యూమ్ క్లీనర్ తో శుభ్రం చేయాలి). ఇలా శుభ్రం చేసేటప్పుడు, సాలె గూళ్ళు ఇదివరకు ఉన్న ప్రాంతాల్లో లేదా సాలెగూళ్ళు ఏర్పడే అవకాశం ఉన్న ప్రదేశాల్లో కొద్ది మొత్తంలో బేకింగ్ సోడాను చల్లాలి.

ఇది పద్ధతిని ఎలుకల విషయంలో కూడా పాటించండి. కానీ ఎలుకల కలుగుల్లో, బేకింగ్ సోడాను అధిక మొత్తంలో చల్లండి. ఇలా ఒక రెండు మూడు సార్లు చేసాక, మీ ఇంటి వైపు సాలెపురుగులు మరియు ఎలుకలు కన్నెత్తి కూడా చూడటంలేదే! అని మీరు ఆశ్చర్యపోతారు.

English summary

Home Remedies To Get Rid Of Mice And Spiders

Mice and spider are the creatures that make the house dirtier and also result in spreading of a number of disease-causing germs in and around the house. Assam tea, Nilgiri tea or peppermint tea are most suited to get rid of mice and spider. Other things that can help to get rid of them are peanut butter, mint toothpaste, bay leaves, etc.
Story first published: Monday, July 23, 2018, 15:00 [IST]