For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు మెచ్చే, మీకెంతగానో పనికొచ్చే ఏడు వంటింటి చిట్కాలు!

|

ప్రతి ఇంటిలో, వంటగది చాలా ప్రాధాన్యత కలిగి ఉన్న ప్రదేశం. మనలో చాలామంది వంటగది యొక్క ప్రాముఖ్యతను సరిగా అర్థం చేసుకోలేరు. ఈ ప్రదేశంలోనే మన ఇంటిల్లిపాదికి మరియు అతిథులకు ఆహారం తయారు చేస్తాము. ఎందుకంటే ఆహార పదార్థాలను తయారు చేయడం చాలా పవిత్రమైన పనిగా మన పురాతన గ్రంధములు తెలియజేస్తున్నందున,ఈ ప్రదేశం పవిత్రమైనదిగా భావించబడుతుంది. కొన్ని సులువైన చిట్కాలతో, మీరు వంటగదిలో చేసే పనిని ఆనందించవచ్చు.

వంటగదిని ఒక ఆహార తయారీ యూనిట్ తో పోల్చవచ్చు, ఎందుకంటే, ఇక్కడే ప్రపంచంలోని అన్ని రకాల నోరూరించే వంటకాలను తయారు చేయడానికి అవసరమైన అన్ని రకాల క్లిష్టమైన పరికరాలని ఉపయోగిస్తాము. ఇది నాలుకను రుచితో, కడుపును ఆకలి తీర్చడంతో సంతృప్తి పరుస్తుంది. వంటగదిలో చాలా పని ఉంటుంది మరియు వాటిలో ఆ పనిని ఒక పద్ధతిలో, ఒకదాని తరువాత ఒక అడుగు క్రమంలో పూర్తి చేసుకుంటూ, ఖచ్చితమైన నియమాలు పాటించి చేయాలి. అందువల్ల, ఈ పనిని సులభతరం చేయడానికి ఎన్నో చిట్కాలు ఉన్నాయి. వీటిని పాటించి, మీ పనిని సులభంగా మార్చుకోవడమే కాక, మీ సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ వ్యాసం ద్వారా మీకు ఏడు వంటగది చిట్కాలను తెలియజేస్తున్నాం. వీటిని పాటించి మీ శ్రమ మరియు సమయాన్ని పొదుపుగా వాడుకోండి.

Kitchen Tips : 7 Handy Tips in Kitchen That You Will Certainly Love!
1. మీరు వండబోయే గుడ్లు తాజాగా ఉన్నాయా లేదా కుళ్ళిపోయాయా తెలుసుకోవాలనుకుంటున్నారా!:

1. మీరు వండబోయే గుడ్లు తాజాగా ఉన్నాయా లేదా కుళ్ళిపోయాయా తెలుసుకోవాలనుకుంటున్నారా!:

మీరు గుడ్లను ఇష్టపడతారా? ఖచ్చితంగా అవును అయినా, అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఆహారం కానందున, మొత్తం స్టాక్ నుండి కుళ్ళిన గుడ్లు గుర్తించడం చాలా కష్టమైన పని. ఏవి కుళ్లినవో తెలుసుకోవడానికి, వాసన చూడడమో లేదా పగులగొట్టడమో చేయలేరు. అయితే కుళ్ళిన కోడిగుడ్డును గుర్తించడానికి ఒక సులువైన ఉపాయం మా వద్ద ఉంది. ప్రతి గుడ్డును ఒక గ్లాసుడు నీటిలో వేయండి. పైకి పూర్తిగా తేలుతున్న గుడ్డు కుళ్ళిపోయినదిగా పరిగణించాలి. వీటిని పారేయండి. సగం మునిగిన గుడ్లను వెంటనే వినియోగించాలి మరియు పూర్తిగా మునిగిన గుడ్లను తాజావిగా మరియు తినడానికి సురక్షితమైనవిగా పరిగణించవచ్చు.

2. కూరగాయలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచాలనుకుంటున్నారా?

2. కూరగాయలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచాలనుకుంటున్నారా?

కూరగాయలను ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి మన వద్ద రిఫ్రిజిరేటర్ల వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉంది. అయినప్పటికీ, విద్యుత్ కోతల మూలంగా ఫ్రిజ్ లోపల పెట్టిన వస్తువులకు అవసరమైన తేమ మరియు చల్లదనం దొరక్కపోవడం వల్ల పాడైపోతాయి. ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కా వలన మీ కూరగాయలు పాడవకుండా నిల్వ ఉంటాయి. కనుక, మీ డబ్బులు ఆదా అవుతాయి.ఫ్రిజ్ లో సహజంగా కూరగాయాలను తాజాగా ఉంచడానికి తేమ స్థాయి అధికంగా ఉంటుంది. తేమ మరీ అధికం అయినా కూడ కూరగాయలు కుళ్ళిపోవచ్చు. కూరగాయల ట్రే కింది భాగంలో న్యూస్ పేపర్ లేదా టిష్యూ పేపర్ పరచడం వలన అదనపు తేమను పీల్చేస్తాయి. పేపర్ ను కొన్నాళ్ళకు ఒకసారి మార్చవలసి ఉంటుంది.

3. ఉప్పు తడిచిపోవడాన్ని అడ్డుకోవడం ఎలా?

3. ఉప్పు తడిచిపోవడాన్ని అడ్డుకోవడం ఎలా?

ఇది ప్రతి ఇంటిలోనూ కనిపించే అత్యంత సాధారణ సమస్య - ఉప్పు తడిచిపోవడం! వాతావరణంలో ఎక్కువగా తేమ ఉన్నప్పుడు, ఉప్పు సముద్రం లేదా నీటి వనరుల సమీపంలో ఉన్నప్పుడు లేదా వర్షకాల సమయంలో, ఈ సమస్యను ఎక్కువగా గమనించవచ్చు.

ఏ ఆహారపదార్ధాన్ని తయారు చేయాలన్నా, ఉప్పు అందులో మనం వేసే అతి ముఖ్యమైన పదార్ధం. సమయం గడిచే కొద్దీ, ఏ డబ్బాలో వేసినా కూడా ఉప్పు ముద్ద అయిపోతుంది. దీనికి కారణం ఉప్పు యొక్క రసాయన ధర్మాలు. మీరు ఉప్పు డబ్బాలో కొంచెం బియ్యం వేస్తే, అది అదనపు తేమను గ్రహించి, ముద్ద కాకుండా నిరోధిస్తుంద

4. మాడిపోయిన కూరను ఎలా సరిచేయాలి?

4. మాడిపోయిన కూరను ఎలా సరిచేయాలి?

మీరు మంటను తక్కువ చేయడం మర్చిపోయారా? అందువలన కూర మాడిపోయిందా? ఇది సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో జరిగే విషయమే! మాడిన వాసన కారణంగా మీకు చికాకు కలుగవచ్చు. కోపంతో దానిని పారేయాల్సిన అవసరం లేదు! మాడిన గ్రేవీలో ఒక టీ స్పూన్ పీనట్ బటర్ వేస్తే సరి! మాడిన వాసన చిటికెలో మాయం అయిపోతుంది. మీ ప్రియమైన వారికి వడ్డించడానికి దీనినే ఉపయోగించవచ్చు పైగా,వారికి కూర మాడినట్టు తెలిసే అవకాశమే లేదు.

5. ఆహారపదార్థాలను నిలువ చేసే డబ్బాలలో వాసనను వదిలించుకోవటం ఎలా?

5. ఆహారపదార్థాలను నిలువ చేసే డబ్బాలలో వాసనను వదిలించుకోవటం ఎలా?

ఇతర పదార్థాలను నిల్వ ఉంచడానికి ఉపయోగించైనా డబ్బాలను మనం అప్పుడప్పుడు ఆహారాన్ని లేదా ధాన్యాన్ని నిల్వ చేయడానికి కొన్నికొన్నిసార్లు మరలా ఉపయోగిస్తాము. ఇలా ఉపయోగించిన డబ్బాలను ఉపయోగించడం వలన డబ్బులు ఆదా చేయవచ్చు. అయితే కొన్నిసార్లు ఈ డబ్బాలు మునుపు నిల్వ చేసిన ఆహారపు వాసనను కలిగి ఉంటాయి. ఎంత కడిగినప్పటికి, దాని వాసన మాత్రం పోదు. అటువంటప్పుడు, ఆ డబ్బా లోపల ఒక వార్తాపత్రిక ఉంచి మూత పెట్టండి. మళ్ళా.ఆ డబ్బాలను ఉపయోగించే ముందు, నీటితో శుభ్రం చేస్తే వాసన లేకుండాపోతుంది.

6. స్టీల్ సామాన్లను మెరిపించడం ఎలా?

6. స్టీల్ సామాన్లను మెరిపించడం ఎలా?

వంట చేయడానికి స్టీల్ గిన్నెలు లేదా సామాన్లను మనం ఎక్కువగా ఉపయోగిస్తాము. వాడుతున్న కొద్దీ అవి వాటి మెరుపును కోల్పోతాయి. గిన్నెలపై ఆహారం అంటుకుని, కొన్నిసార్లు మరకలు పడతాయి. చూడటానికి ఇవి అసహ్యంగా ఉంటాయి. వీటిని శుభ్రం చేయడానికి ఆల్కహాల్ లో ముంచిన దూదితో మరకలపై రుద్దితే సరిపోతుంది. వాటి మెరుపు మీ చిరునవ్వును తలపించేలా ఉంటుంది!

7. వంటగదిలో ఉన్న పురుగులు మరియు కీటకాలు వదిలించుకోవటం ఎలా?

7. వంటగదిలో ఉన్న పురుగులు మరియు కీటకాలు వదిలించుకోవటం ఎలా?

పురుగులు మరియు కీటకాలు ప్రతిచోటా ఉంటాయి. వంటగదిలో ఇవి ఒక పెద్ద సమస్య సృష్టించడానికి ఎప్పుడూ తయారుగా ఉంటాయి. ఆహారపదార్థాలను పాడు చేయడమే కాక అనారోగ్యాన్ని కూడా కలిగిస్తాయి. వంటగదిలోని కీటకాలను చంపడానికి పురుగుమందులము ఉపయోగిస్తే మన ఆరోగ్యానికి అత్యంత హాని కలుగజేయవచ్చు. అయితే రసాయన పద్ధతి ద్వారా కాక సేంద్రీయ పద్ధతులను ఉపయోగించి కొంత మేరకు వీటి నుండి ఉపశమనం పొందవచ్చు. ఆహార పదార్థాలను ఉంచిన డబ్బాలలో కొన్ని బిర్యానీ ఆకులని పెట్టండి. బిర్యానీ ఆకుల్లోని ఉండే సహజ గుణాలు బీటిని పారద్రోలుతాయి.

English summary

Kitchen Tips : 7 Handy Tips in Kitchen That You Will Certainly Love!

Kitchen is the most happening place in every household. Most of us often misjudge the importance of the kitchen at home. This is the place where we cook the food to feed our family and guests. This place is considered sacred since cook is considered as a holy activity in scriptures. With some handy kitchen tips, you can enjoy doing this activity.
Story first published: Friday, July 20, 2018, 12:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more