Just In
Don't Miss
- Movies
టార్గెట్ హైపర్ ఆది: అతడిపై రష్మీ సంచలన ఆరోపణలు.. అతడి ప్రవర్తన బయట పెట్టడంతో!
- Technology
Infinix Smart 6 HD సేల్స్ లోని ఆఫర్లపై ఓ లుక్ వేయండి....
- Finance
Railway News: రైల్వేలకు చుక్కలు చూపించిన వ్యక్తి.. 22 ఏళ్లు కోర్టులో పోరాటం.. అసలు ఏం జరిగిందంటే..
- News
ఇండియా టూడే సర్వే : ఏపీ - తెలంగాణలో ఎవరికెన్ని సీట్లు : మోదీ మ్యాజిక్ ఉంటుందా..!!
- Sports
Canadian Open: తొలి రౌండ్లోనే సెరెనా ఓటమి.. సానియా జోడీ సంచలనం!
- Automobiles
కొత్త క్యూ3 బుకింగ్స్ ప్రారంభించిన ఆడి.. డెలివరీలు ఎప్పుడంటే?
- Travel
మరో ప్రపంచపు అంచులకు చేర్చే.. కుద్రేముఖ్ పర్వత శిఖరాలు!
మీ వంటింట్లో అనవసర వస్తువులను తొలగించటానికి 10 సింపుల్ పరిష్కారాలు
ప్రతి ఇంట్లో ఎక్కువగా వాడుకోబడి వదిలేసే ప్రదేశం వంటిల్లు. ప్రతిరోజూ వంట మరియు గిన్నెలు కడగటం వంటి పనులతో వంటిట్లో అనవసర చెత్త ఎక్కువగా పెరిగిపోతుంది; ఎంత పెరుగుతుందంటే మీరు పట్టించుకోకుండా ఉండలేరు. మీ పెనం ఎక్కడో ప్రెజర్ కుక్కర్ మరియు ఫ్రై చేసే పెనం మధ్యలో ఇరుక్కుని ఉంటుంది. సగం అలమరలు వాడని వంట వస్తువులతో నిండిపోయి ఉంటుంది.
మీకు మీ వంటిల్లు ఇంతలా ఎలా నిండిపోయిందో కూడా అర్థం కాదు. మీకో శాంతినిచ్చే ఆలోచన ఇదిగోండి, మీదే కాదు ప్రతి ఒక్కరి వంటిల్లు కథ కూడా ఇదే. మీకు తెలియాల్సినదేంటంటే మీ వంటిల్లోంచి అనవసర వస్తువులను ఎలా తీసెయ్యాలని, దాని ద్వారా మీ ఇంటి పనులు మరింత చక్కగా చేసుకోవచ్చు .
మీరు మీ వంటింటిని సరిగ్గా సర్దబడి చూడాలనుకుంటే, ఇది మీరు పనిచేసే స్థలం అని గుర్తుంచుకోండి, అలా మీరు బాగా సర్దగలిగి ఎప్పుడూ కూడా చక్కగా ఉంచుకోగలరు.
మీ వంటింటిని సరిగ్గా సర్దుకోటానికి మేము ఇక్కడ కొన్ని సింపుల్ పద్ధతులు వివరించాం. తెలివైన స్టోరేజ్ ఆలోచనలతో మీ కిచెన్ ప్రదేశాన్ని చక్కగా వాడుకోండి. అక్కర్లేని, అవసరంలేని, ఉపయోగపడని వస్తువులను తొలగించి శుభ్రమైన మరియు అందమైన వంటిల్లులాగా మార్చుకోండి. ఇంకా చదవండి.

వంట సామాను ఉంచే అలమరలు, గట్టుపై అనవసర వస్తువులు తొలగించటం
మొదటగా మీరు ఏ వస్తువుల అమరికలనైనా మార్చేముందు రోజూ వాడుకునే వంట సామాను ఉంచే ప్రదేశాలని సర్దండి. అణువణూవూ ఏ మాత్రం వదలకుండా శుభ్రం చేయండి. మీకు అవసరంలేని వస్తువులను తొలగించి వేయండి లేదా ఎవరికైనా ఇచ్చేయండి. ఈ విధంగా మీరు కేవలం ఎక్కువగా వాడుకునే మరియు ముఖ్యమైన వంట సామానునే ఉంచుకుని సర్దుకుంటారు. వంట చేసే గట్టు మరియు కింద అలమరలను సర్దటానికి ఇది మంచి పద్ధతి.

వంట గిన్నెలను వేరు చేయండి
ఎక్కువగా వాడే మరియు తక్కువగా వాడే వస్తువులను వేరుచేయండి. వీటిని ఎంత తరచుగా వాడతారనే దానిబట్టి సర్దండి. అస్సలు వాడని, లేదా ఎప్పుడో ఒకసారి వాడే వంట సామానును పై అలమరల్లో పెట్టండి. మీకు ఇవి ప్రత్యేక సందర్భాలలో, త్వరగా సులభంగా తీసుకోడానికి పై అరలో పెట్టడం బాగుంటుంది. రోజూ వాడే వంట సామానును కింద అలమరల్లో పెట్టండి. మీ వంటిల్లును సర్దటంలో ఇదో ముఖ్యమైన చిట్కా.

వంట సామానును విభాగాల్లో వేరుచేయండి
వంట సామానును వాటి ఉపయోగాలను బట్టి వేరుచేయండి. ఉదాహరణకి, పెనాలు, పెద్దగిన్నెలు ఒక అలమరలో ఉంచండి, బేకింగ్ చేసే వస్తువులు మరో దాంట్లో, పెద్ద యంత్రాలు, వస్తువులు ఒక విడిదాంట్లో ఉంచండి. ఇంకా, గాజు వస్తువులను పూర్తిగా ఇంకో అలమరలో ఉంచండి. ఈ రకంగా చేయటం వల్ల మీకు అవసరమైనప్పుడు వెతుక్కోనక్కరలేకుండా అన్నీ వేటికవి దొరుకుతాయి. ఇది మీరు ఎప్పుడూ మీ కిచెన్ ను నీటుగా ఉంచుకోటానికి చేయవలసిన చిట్కా.

డ్రాలో చెంచాలు మరియు చిన్న బౌల్స్
ఇతర వంట గిన్నెలు ఉన్న అలమరలకి దగ్గరగానే చెంచాలు, బౌల్స్ ఉండేలా చూసుకోండి. వాటి సైజులు మరియు వాటి వాడకాన్ని బట్టి సర్దండి. ఇది కూడా వంటకి వాడుకునే వస్తువులను సర్దటంలో ఉపయోగపడే మరో ప్రభావవంతమైన చిట్కా.

వంట చేసే గట్టుపై వస్తువులు తీసెయ్యండి
కిచెన్ కౌంటర్ లేదా ప్లాట్ ఫార్మ్ ను సర్దండి. అనవసర వస్తువులన్నిటినీ తీసేసి సరైన స్థలాల్లో పెట్టండి. చాలా తక్కువ వస్తువులు అంటే స్టవ్, మిక్సీ లేదా టోస్టర్ లాంటి వస్తువులను మాత్రమే ఉంచండి. వంట ప్రశాంతంగా చేసుకోటానికి దీనిని ఖాళీగా ఉంచుకోటం అవసరం.

ప్లాస్టిక్ బ్యాగులు, కాగితాలు మరియు పేపర్ టవల్స్
ప్లాస్టిక్ కవర్లు, అల్యూమినియం ఫాయిల్స్ మరియు పేపర్ టవల్స్ ను నీటుగా ఫ్రిజ్ కి దగ్గరలోని అలమరలో సర్దండి. దీనివలన మిగిలిపోయిన పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టేముందు వీటిని వాడటంలో సమయం వృథా కాదు. ఇది కూడా వంటింటిని సమర్థవంతంగా నిర్వహించుకోటంలో ఉపయోగపడే ముఖ్య చిట్కా.

మసాలా దినుసులను సర్దటం
అన్ని దినుసులను గ్రూపులుగా చేయండి. ఇది పోపుల పెట్టెను, మసాలా డబ్బాలను సర్దే మంచి పద్ధతి. తీపి, ఘాటు మసాలాలను ఒక సెక్షన్ లో పెట్టండి, పైన చల్లుకునే వాటిని మరో సెక్షన్లో, గరం మసాలా విడిగా పెట్టండి. ఈ పద్దతిని అన్ని అలమరలు సర్దటంలో వాడవచ్చు. ప్రత్యామ్నాయంగా ఒక మంచి పోపుల పెట్టె కొనుక్కోండి. అందులో రోజూ ఎక్కువగా వాడే దినుసులను నింపుకోండి. ఇది రోజూ వంటలో ఉపయోగపడుతుంది.

వివిధ పప్పులు మరియు బేకింగ్ ఉత్పత్తులు
పప్పులు మరియు బేకింగ్ పదార్థాలను వాటి వాడకాన్ని బట్టి బాక్సుల వారీగా అలమరల్లో సర్దుకోండి. ఎక్కువగా ఇరికించవద్దు. మీరు చాలాకాలం నుండి వాడకపోయినా, ఇకముందు కూడా వాడము అన్పించేవాటిని, సింపుల్ గా బయట పారేయండి.

సింపుల్ వంట పరికరాలనే వాడటంపై దృష్టి పెట్టండి
వంటింటికి సంబంధించిన వస్తువులను కొనేముందు రెండుసార్లు ఆలోచించండి. ఎప్పుడూ పెద్ద మరియు కష్టమైన వాటికంటే సింపుల్ వస్తువులనే కొనండి. ఎక్కువ వైపులు తరగగలిగే తురుము పీటను కొనండి- ఇది సన్నగా నుంచి పెద్ద ముక్కల వరకు తరుగుతుంది- పెద్దదాన్ని కొనటం కన్న ఈ చిన్న వస్తువు ఎంతో కలిసొస్తుంది. ఇలా మీ వంటింటి నుంచి అనవసర వస్తువులకు గుడ్ బై చెప్పవచ్చు.

వారం లేదా రోజువారీ అనవసరమైన వాటిని తొలగించే అలవాటు
మీకున్న సమయాన్ని బట్టి, రోజూ లేదా వారానికోసారి వంటింట్లో అనవసర వస్తువులను తొలగించండి. అన్ని వస్తువులను వాటి వాటి స్థలాల్లో ఉంచండి.
బోల్డ్ స్కై - బ్రేకింగ్ న్యూస్ అలర్ట్'స్ ను పొందండి. బోల్డ్ స్కై కు సబ్ స్క్రైబ్ అవ్వండి.