For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

50లోనూ వన్నె తరగని అందంతో వెలిగిపోతున్న శ్రీదేవి!

|

సిరిమల్లె పూవా.. సిరిమల్లెపూవా.. చిన్నారి చిలకమ్మా అంటూ పదహారేళ్ల వయసులో అలరించినా, అబ్బనీ తియ్యనీ దెబ్బ.. అని ప్రౌఢ వయసులోనూ హొయలు ఒలికించినా అన్నీ శ్రీదేవికే సొంతం. 50 ఏళ్ల వయసొచ్చినా ఏమాత్రం తగ్గకుండా ఇటీవలే వోక్ పత్రికకు కూడా పోజులిచ్చి, దేశవ్యాప్తంగా అభిమానుల మనసు కొల్లగొట్టింది.

అవును.. ఈరోజే అందాల తార శ్రీదేవి పుట్టినరోజు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం తమిళనాట పుట్టిన శ్రీదేవి.. తెలుగు, తమిళం, మళయాళం, హిందీ భాషల్లో లెక్కలేనన్ని చిత్రాల్లో నటించింది. అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్ఆర్)తో కలిసి అనేక సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఆమె, ఆ తర్వతా ఆయన కుమారుడు నాగార్జున పక్కన కూడా హీరోయిన్గా నటించి మెప్పించడం విశేషం. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తుంటుంది. సినిమా రంగం ఒక పక్క మరో ప్రక్క ప్రస్తుత ట్రెండ్ ను అలరిస్తూ ఈ వయస్సులో కూడా లేటెస్ట్ ట్రెండ్స్ తో ఫ్యాషన్ సెన్స్ ను ఫాలో అవుతోంది. ఆ ఫ్యాషన్ ఇండియాన్ లేదా వెస్ట్రన్ స్టైల్ కావచ్చు. ఈ వయస్సులో కూడా శ్రీదేవి ఎటువంటి దుస్తులు ధరించినా కూడా చాలా గ్లామరస్ గా కనబడుతుంది.

50ఏళ్ళ శ్రీదేవి గడిచే ప్రతి రోజూ ఒక అద్భుతమైన గ్లామరస్ ను మెయింటైన్ చేస్తూ, అందంగా స్టైల్ గా కనిపిస్తూ అందరి ప్రశంలు అందుకుంటూ, ఆశ్చర్య పరుస్తున్నది. వోగో ఫోటో షూట్ చూసిన తర్వాత, ఆమెలో ఒక్క మూలనా వ్రుద్యాప్య లక్షణాలు కనబడలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీదేవి ఒక బెస్ట్ డ్రెస్డ్ సెలబ్రెటీ. ఆమె ఏది ధరించే గొప్పగా ప్రాచుర్యం పొందుతున్నది.

అవార్డ్ షో రెడ్ కార్పెట్ విషయంలో అదే జరిగింది. అవార్డ్ షోకు గెస్ట్ గా వచ్చిన శ్రీదేవి ఇటు శారీ, అటు జీన్స్ లో అద్భుతంగా కనిపించింది. ఈ మద్యనే నిర్వహించిన ఐఐఎఫ్ఎ 2013 లో బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీగా శ్రీదేవి నిలిచింది. స్ట్రాప్ లెస్ గౌన్ ధరించి ఐఐఎఫ్ఎ 2013 గ్రీన్ కార్పెట్ మీద ప్రదర్శన ఇచ్చింది. అటువంటి డ్రెస్ లో ఉన్న శ్రీదేవిని చూడాలంటే ఈ క్రింద స్లైడ్ ను క్లిక్ చేయాల్సిందే. ఇది నిజంగా చాలా డిఫికల్ట్ గా కనిపిస్తుంది. మరి మీరు చూడలనుకుంటున్నారా?

కౌఫ్మాన్ ఫ్రాన్స్కో గౌన్:

కౌఫ్మాన్ ఫ్రాన్స్కో గౌన్:

స్ట్రాప్ లెస్ కౌఫ్మాన్ ఫ్రాన్స్కో గౌన్ లో శ్రీదేవి ఐఐఎఫ్ఎ 2013 గ్రీన్ కార్పెట్ మీద ఇలా ప్రదర్శన ఇచ్చింది రీసెంట్ గా..

గుస్సీ:

గుస్సీ:

ఆగష్ట్ నెల, వోక్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద ఇలాంటి ఫోజ్ ఇచ్చి కుర్రకారు మతులు పోగుడుతోంది. గ్రీన్ కలర్ గుస్సీ ఆఫ్ షోల్డర్ డ్రెస్ లో, ఈ వయస్సులో కూడా సెక్సీగా కనబడుతోంది.

అల్బెర్టా Ferritti లో:

అల్బెర్టా Ferritti లో:

శ్రీదేవి ఆరెంజ్ కలర్ హాఫ్ షోల్డర్ అల్బెర్టా ఫెర్రిట్టి గౌను ధరించి 2013 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ కు హాజరయ్యారు. శ్రీదేవి ధరించిన ఈ గ్రౌన్ ఫిల్మ్ ఫుర్ అవార్డ్ ఫంక్షన్ లో ఉత్తమ దుస్తుల్లో ఇది ఒకటి.

సబ్యసాచి ముఖర్జీ:

సబ్యసాచి ముఖర్జీ:

స్టార్ గుల్డ్స్ అవారడ్ లో శ్రీదేవి, ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన దుస్తుల్లో రెడ్ కార్పెట్ మీద ప్రదర్శన ఇచ్చారు.

కాంచీవరం శారీలో:

కాంచీవరం శారీలో:

గోల్డ్ మరియు పింక్ కలర్ కాంచీవరం శారీలో శ్రీదేవి చాలా ట్రెడిషినల్ గా కనిపించారు.

ఫ్లవర్ శారీ:

ఫ్లవర్ శారీ:

పసుపు, తెలుపు మిక్స్ తో ఉన్నఈ చీరలో శ్రీదేవి చాలా అద్భుతంగా ఉన్నారు. ఈ దుస్తులను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేశారు.

నియాన్ షర్ట్:

నియాన్ షర్ట్:

బ్లూ డినిమ్ బ్లాక్ పంప్స్ మీదకు నియాన్ లైమ్ గ్రీన్ షర్ట్ చాలా అద్భుతంగా నప్పింది.

లేస్ డ్రెస్ లో శ్రీదేవి: శ్

లేస్ డ్రెస్ లో శ్రీదేవి: శ్

రీదేవి రీసెంట్ గా ఒక బ్రౌట్ ఆరెంజ్ కలర్ లేస్ దుస్తులో చాలా అందంగా కనిపించింది. లేస్ డ్రెస్ మీదకు ఫిట్టింగ్ వైట్ ట్రోషర్ చాలా బాగా నప్పింది.

రెడ్ కలర్ ప్యాంట్:

రెడ్ కలర్ ప్యాంట్:

ఫ్యాషనబుల్ గా ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టు స్టైల్ గా ఉన్నారు. శ్రీదేవి ఒక రెడ్ డెనిమ్ కలర్ ప్యాంట్ మీదకు వైట్ ఫ్రిల్లీ షర్ట్ అద్భుతంగా ఉంది.

ప్రముఖ డిజైనర్ ఎలి సాబ్:

ప్రముఖ డిజైనర్ ఎలి సాబ్:

శ్రీదేవి ధరించిన బెస్ట్ డ్రెస్ ల్లో ఇది ఒకటి . ప్రింట్ చేయబడిని స్ట్రాప్ లెస్ గౌన్ అమేజ్ గా ఉంది. ప్రముఖ డిజైనర్ ఎలిసాబ్ మరోసారి తన సత్తాను చాటుకొన్నారు.

మనీష్ మల్హోత్ర:

మనీష్ మల్హోత్ర:

ముదురు పింక్ మరియు పసుపు వర్ణపు చీరలో‘ఇంగ్లీష్ వింగ్లీష' తెలుగు ప్రొమోషన్ కు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇలా అందరిని ఆకట్టుకొన్నారు.

టేల్ బ్లూ గౌన్:

టేల్ బ్లూ గౌన్:

ఐఐఎఫ్ఎ గ్రీన్ కార్పెట్ 2013లో శ్రీదేవి స్ట్రాప్ లెస్ టేల్ బ్లూ శాటిన్ సిల్క్ గౌనులో చక్కగా ఉందనడానికి నిదర్శనం ఇది.

సబ్యసాచి :

సబ్యసాచి :

శ్రీ సబ్యసాచి డిజైన్ చేసిన లేస్ లహెంగా సారీలో చాలా అద్భుతంగా, మార్వలెస్ గా ఉంది. ఇటువంటి దుస్తులు డిజైన్ చేయడంలో సబ్యసాచి కంటే మరోకరు ఉండరంటే ఆశ్చర్యం కలగక మానదు.

సబ్యసాచి:

సబ్యసాచి:

సబ్యసాచి డిజైన్ చేసిన మరో డ్రెస్ ఇదే మనిష్ మల్హోత్ర కలెక్షన్స్ లో కలగలిసి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వైట్ నెట్ సారిలో పుట్టినరోజు అమ్మాయి చాలా అద్భుతమైన ఉంది!

తరాలు మారినా..

తరాలు మారినా..

జయప్రద, జయసుధ, విజయశాంతి ఇలా తరానికో హీరోయిన్ ఆధిపత్యం చెలాయించినా శ్రీదేవి స్థానం చెక్కుచెదరలేదు.

సెక్సీ భంగిమలతో..

సెక్సీ భంగిమలతో..

ఐదు పదుల వయసుకు చేరువవుతున్నా వన్నెదగ్గని అందంతో వెలిగిపోతూ...‘అతిలోక సుందరి' అనే పేరును సార్ధకం చేసుకుంటోంది హీరోయిన్ శ్రీదేవి.

శ్రీదేవి

శ్రీదేవి

అప్పుడు-ఇప్పుడు తేడా లేకుండా కమర్షియల్‌ సినిమాల హవా కొనసాగుతున్నప్పుడు, కుటుంబ కథా చిత్రాలు వెల్లువగా వస్తున్నప్పుడు, ఫాంటసీ సినిమాలు మొదలైనప్పుడు ఇలా ఎలాంటి ట్రెండ్‌లో అయినా ఇమిడిపోయింది శ్రీదేవి. ఐదు పదుల వయసు దాటినా కూడా వన్నె తరగని అందంతో వెలిగిపోతున్న శ్రీదేవికి 'బోల్డ్ స్కై' అందిస్తోంది.. జన్మదిన శుభాకాంక్షలు.