Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
మెదడే లేకుండా పుట్టి, అలా ఎలా బ్రతికాడండీ బాబూ ..!
ఇప్పుడు చెప్పబోయే కథ, నోవా అనే బాలునికి చెందినది. మామూలుగా ఏదైనా అవయవ లోపంతో జన్మిస్తే, కళ్ళు, కాళ్ళు, చేతులు మొదలైన అవయవాలకు సంబంధించిన కేసులుగా తరచు వింటూ ఉంటాం. లేదా మెదడు పరంగా చూసినప్పుడు, ఎదుగు
ప్రజలు జీవన్మరణ సమస్యలతో పోరాడుతూ జీవన ప్రయాణాన్ని కొనసాగించాలనే పట్టుదలతో కష్టపడుతున్న అనేక వైద్య పరిస్థితులు ఈ ప్రపంచమంతటా ఉన్నాయి. కొందరు అదృష్టవశాత్తు బ్రతికి బట్టకట్టగలిగితే, కొందరు మరణంతో పోరాడలేక జీవితానికి స్వస్థి పలుకుతున్నారు. ఇప్పుడు చెప్పబోయే ఈ సంఘటన మీరు ఇంతకు ముందెన్నడూ కనీవినీ ఎరుగని అద్భుతమే అని చెప్పవచ్చు.
అత్యంత అరుదుగా ఉండే ఈ వైద్య పరిస్థితికి గురైన వారు, బ్రతకడం అనేది దాదాపు జరగని పని. అటువంటిది, ఒకరు గెలిచి, వైద్య శాస్త్రానికే పెను సవాలుగా నిలిచాడు.
ఇప్పుడు చెప్పబోయే కథ, నోవా అనే బాలునికి చెందినది. మామూలుగా ఏదైనా అవయవ లోపంతో జన్మిస్తే, కళ్ళు, కాళ్ళు, చేతులు మొదలైన అవయవాలకు సంబంధించిన కేసులుగా తరచు వింటూ ఉంటాం. లేదా మెదడు పరంగా చూసినప్పుడు, ఎదుగుదల లోపాలు వంటివి వింటూ ఉంటాం. కానీ ఇతను ఏకంగా మెదడే లేకుండా జన్మించాడు. క్రమంగా అతని జీవన ప్రయాణం కూడా నమోదు చేయాల్సిన పరిస్థితి వైద్యులకు నెలకొంది. ఆ బాలుడి వివరాలు మరియు అతని మనుగడ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం.

నోవా పరిస్థితిని గురించి అతని తల్లిదండ్రుల ప్రకారం ..
ఇంగ్లాండ్లోని కంబ్రియాలో నివసించే, నోవా తల్లిదండ్రులు షెల్లీ వాల్ మరియు రాబ్, గర్భధారణ 20 వారాల సమయంలో జరిగే రెగ్యులర్ స్కాన్ కోసం వెళ్ళినప్పుడు, వారు ఒక దుర్వార్తను వినవలసి వచ్చింది. వారి శిశువు ప్రాణాంతక వైద్య సమస్యలను కలిగి ఉందని వైద్యులు తేల్చారు.

నోవా వైద్య పరిస్థితి గురించి….
వా 'స్పినా బిఫిడ,' వైద్య పరిస్థితిని మాత్రమే కాకుండా హైడ్రోసెఫాలస్ అనే మరో వింత వైద్య పరిస్థితిని కలిగి ఉన్నాడని వైద్యులు తేల్చారు. ఈ సమస్యలో, పుర్రెలో ఫ్లూయిడ్స్ నిండి, తలంతా విస్తరించే ఒక సంక్లిష్ట పరిస్థితిగా ఉంటుంది. క్రమంగా మెదడు ఎదుగుదలకు ఆస్కారం లేని విధంగా తయారవుతుంది. అందుచేత, ఈ శిశువు ఈ పరిస్థితిని నుండి బయటపడగలడు అని వైద్యులు కూడా ద్రువీకరించలేకపోయారు.

వైద్యులు సైతం అబార్షన్ (గర్భ విచ్చిత్తి) దృష్ట్యా 5 సార్లు సూచించడం జరిగింది….
అనేక వైద్య సమస్యలతో కూడిన ఈ శిశువు జన్మించడం జరగదు అని ధృవీకరించుకున్న వైద్యులు, తల్లి ప్రాణానికి ప్రమాదం ఉండకూడదన్న ఉద్దేశంతో 5 సార్లు అబార్షన్ చేయించుకోవలసినదిగా ఈ జంటకు సూచనలివ్వడం జరిగింది. కానీ ఆ జంట వైద్యుల సూచనలను ససేమిరా అంది. క్రమంగా ఆ పిల్లవానికి జన్మనివ్వాలని నిర్ణయించుకున్నారు.

నోవా పుట్టిన సమయంలో …
నవజాత శిశువు నోవా జన్మించిన క్షణం, మెదడు నరాల మీద ఒత్తిడిని పెంచే, అదనపు ద్రవాన్ని తొలగించే క్రమంలో భాగంగా నోవా పుర్రెలో షంట్ వేయడానికి వైద్యులు నిర్ణయించుకున్నారు. క్రమంగా వైద్యులు నోవాకు శస్త్రచికిత్స చేసి షంట్ అమర్చారు. అంతేకాకుండా నోవా పుర్రెలో కేవలం 2% మాత్రమే మెదడు భాగం ఉన్నట్లు ఆ కుటుంబానికి వివరించడం జరిగింది.

నోవా ఆహార పానీయాలను తీసుకోగలిగేవాడు కూడా ..
నోవా మెదడు కాండం చెక్కుచెదరకుండా ఉన్న కారణాన, ఆహార పానీయాల విషయంలో ఎటువంటి ఆటంకం ఉండేది కాదు. అంతేకాకుండా, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నందువలన, అతని పెరుగుదల గురించిన అధ్యయనానికి వీలుపడింది.

ఒకరోజు వైద్యులు సైతం ఆశ్చర్యపడేలా నోవాలో మార్పులు కనిపించాయి...
నోవా మూడు సంవత్సరాల బిడ్డగా ఉన్నప్పుడు, జరిపిన పరీక్షలలో అసాధారణంగా నోవా మెదడు 80 శాతం పునరుద్ధరించబడిందని కనుగొన్నారు. ఈ పరిణామం, వైద్యులనే ఆశ్చర్యచకితుల్ని చేసింది. మెదడులో అదనపు ద్రావణాలను తొలగించడానికి ఏర్పాటు చేసిన షంట్ కారణంగా, కొంత స్థలం ఏర్పడి క్రమంగా మెదడు పెరుగుదలలో పురోగతికి దోహదపడి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. కానీ జీవ సంబంధమైన ప్రక్రియల ప్రకారం, కణాలు ఎలా పెరిగాయో ఇప్పటికీ అంతుబట్టడంలేదు. క్రమంగా ఈ కేసు వైద్య చరిత్రలోనే ఒక అద్భుతంగా పరిగణించబడింది.

చివరికి ఎన్నో కష్టాలను అధిగమించి, తన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు నోవా …
వైద్యులకే సవాల్ విసిరి ప్రాణాలు నిలబెట్టుకున్న నోవా, క్రమంగా ఇప్పుడు అనేక విషయాలు నేర్చుకుంటూ ఉన్నాడు. తన పేరు రాయడం, అందరిలో భయంలేకుండా మాట్లాడడం వంటివి చూస్తుంటే, నోవా మృత్యుంజయుడని అందరూ కొనియాడుతున్నారు.

క్లుప్తంగా చెప్పాలంటే నోవా ఒక అద్భుతం….
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవనశైలి, మాతృత్వ, శిశు సంబంధ, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications