Latest Updates
-
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి!
చాణక్య నీతి: ఈ నాలుగు పనులు చేసిన తర్వాత స్నానం చేయడం తప్పనిసరి.. లేదంటే.!
జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆచార్య చాణక్యుడు తన సూత్రాల్లో వివరించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి ఎలా ఉండాలి, స్త్రీపురుషులు సమాజంలో ఎలా మెలగాలి, కుటుంబ బంధాలు ఎలా కొనసాగాలనే విషయాలను ప్రస్తావించారు. ఈ క్రమంలో పరిశుభ్రత, దైనందిన అలవాట్లకు సంబంధించి కొన్ని కీలక విషయాలను ఆచార్య చాణక్య తెలిపారు. ముఖ్యంగా మనిషి పరిశుభ్రతకి సంబంధించి ప్రతిరోజూ స్నానం అనేది ముఖ్యం. ఇక రోజువారీ స్నానంతో పాటు కొన్ని పనులు పూర్తి చేసిన తప్పనిసరిగా స్నానం చేయాలని చాణక్య పేర్కొన్నారు. అందుకు గల కారణాలను కూడా వివరించారు. ప్రధానంగా చాణక్య చెప్పిన నాలుగు పనుల గురించి తెలుసుకుందాం..

నూనెతో మసాజ్ అనంతరం
చాణక్యుని నీతి శాస్త్రం ప్రకారం శరీరానికి నూనె రాసుకున్న తర్వాత లేదా మర్దన చేసుకున్న తర్వాత స్నానం చేయడం తప్పనిసరి. మర్దన చేసుకున్న తర్వాత శరీరం జిడ్డుగా మారుతుంది. దీని వల్ల చెమట, దుమ్ము అంటుకుపోతుంది. మలినాలు అలాగే ఉండిపోతాయి. అందుకే శరీరానికి నూనె రాసిన కాసేపటికి శుభ్రంగా సబ్బుతో స్నానం చేయాలి. దీంతో బాడీపై మలినాలు తొలగి తాజాగా ఉంటుంది.
శ్మశాన వాటిక నుంచి ఇంటికి వచ్చిన వెంటనే..
హిందూ మత సంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోయాక అంత్యక్రియలు లేదా దహన సంస్కారాలు పూర్తయి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయడం అనేది తప్పనిసరి. ఇది అనాది కాలంగా వస్తున్న సంప్రదాయం. చాణక్య నీతి కూడా ఈ సంప్రదాయం కొనసాగించాల్సిందేనని చెబుతుంది. దీనికి పరిశుభ్రత ప్రధాన కారణం. అంత్యక్రియలు జరిగిన ఇంటి నుంచి తిరిగి వచ్చాక.. ఆ స్థలంలోని పొగ, ఇతర కణాలు బట్టలకు, శరీరానికి అంటుకుపోతాయి. ఇలాగే ఇంటికి వచ్చి పడుకోవడం, ఇతర పనులు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే రాగానే తప్పనిసరిగా స్నానం చేయాలి.

సంభోగం తర్వాత
చాణక్యుని నీతి శాస్త్రం ప్రకారం.. భార్యాభర్తలు సంభోగం తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి. ఈ ఘట్టం తర్వాత స్నానం చేసి వంట పనులు, ఇతర పనులు చేయాలని బోధిస్తుంది. అనాది కాలం నుంచి దీనిని శారీరక, మతపరమైన పవిత్రతతో ముడిపెట్టారు. సంభోగం తర్వాత స్నానం చేయకపోతే శరీరం పవిత్రం కాదని చెబుతోంది.
జుట్టు, గడ్డం కటింగ్ తర్వాత
పురుషులు జుట్టు కత్తిరించుకున్నాక లేదా గడ్డం చేసుకున్న తర్వాత చిన్న చిన్న వెంట్రుకలు శరీరానికి అంటుకుపోతాయి. ఇవి సులభంగా వదిలిపోవు. ఇలాగే వంట, భోజనం వంటి పనుల్లో పాల్గొంటే అవి తినే ఆహారంలోకి వెళ్లిపోతాయి. అందుకు స్నానం చేసినట్లయితే వెంట్రుకలు శుభ్రంగా తొలగిపోతాయి. అందుకే షేవింగ్, హెయిర్ కటింగ్ తర్వాత వెంటనే స్నానం చేయడం తప్పనిసరి అని చాణక్య నీతి బోధిస్తోంది.



Click it and Unblock the Notifications
