Latest Updates
-
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.!
కేజీ మటన్ కొనాలంటే..ఆస్తులు అమ్మాల్సిందే!..హైదరాబాద్ లో ఎంతో తెలుసా
బర్డ్ ఫ్లూ భయంతో గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ తినాలంటేనే చాలామంది భయపడుతున్నారు. ఈ క్రమంలో మటన్ వైపు ఎక్కువమంది మెగ్గుచూపుతున్నారు. ఏపీలోని గోదావరి జిల్లాల్లో,ఎన్టీఆర్ జిల్లాలో ఇటీవల బర్డ్ ఫ్లూ వ్యాధితో లక్షల సంఖ్యలో కోళ్లు మరణించిన విషయం తెలిసిందే. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి, గుడ్లు కూడా తినడం మానేస్తున్నారు. అయితే ఇదే సమయంలో మటన్ ధరలు భారీగా పెరిగాయి. సామాన్యుడు కిలో మటన్ కొనాలంటే రెండు రోజుల కూలీ డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
బర్డ్ ఫ్లూ కారణంగా కొన్ని ప్రాంతాల్లో చికెన్ ధరలు కేజీ రూ.150కి పడిపోయినప్పటకీ దానిని తినేందుకు నాన్ వెజ్ ప్రియులు మొఖం చాటేస్తన్నారు. ఇదే సమయంలో మటన్ ధరలు కొండెక్కాయి. హైదరాబాదులో కేజీ మటర్ ధర రూ.1000 వరకు ఉంది. మొన్నటిదాకా 800- 900 రూపాయల వరకు కలిపిన మటన్ ధర ప్రస్తుతం 1100 రూపాయలకు చేరింది.

రేటు పెరిగినప్పటికీ మటన్ షాపుల ముందు రద్దీగా బాగానే ఉంటుంది. అయితే డిమాండ్ అంతకంతకు పెరుగుతువడటంతో ధర మరింత పెరిగే అవకాశం ఉందని మాంసం వ్యాపారులు చెబుతున్నారు.
హైదరాబాదుకు ప్రతిరోజు దాదాపు 15 వేల గొర్రెలు లేదా మేకలు మటన్ కోసం సరఫరా చేస్తుంటారు. అయితే ప్రస్తుతం పెరిగిన డిమాండ్ నేపథ్యంలో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, మాంసం వ్యాపారులు తెలుపుతున్నారు. హైదరాబాదులో అతిపెద్ద మార్కెట్ అయిన చెంగిచెర్లలో ప్రస్తుతం మటన్ కు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడిందని, పెద్ద ఎత్తున గొర్రెలను కర్ణాటక, మహారాష్ట్ర, రాయలసీమ నుంచి దిగుమతి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు.
పెళ్లిళ్ల సీజన్ కూడా అవడంతో మటన్ ధరలు మరింత పెరిగితే కొనాలంటే ఆస్తులు అమ్మాలేమో అని నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో సీ ఫుడ్ అంటే చేపలు, రొయ్యల వైపు కూడా జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చేపల మార్కెట్లలో కూడా కొద్ది రోజులుగా రద్దీ ఎక్కువగా ఉంటోంది. చేపల ధరలు కూడా పెరిగాయి.



Click it and Unblock the Notifications