Latest Updates
-
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.!
Chhatrapati Shivaji Real Face: ఛత్రపతి శివాజీ రియల్ ఫొటో దొరికేసింది..చూస్తే గూస్ బంప్స్ అంతే
ఛత్రపతి శివాజీ..ఈ పేరు వింటేనే కొందరిలో గూస్ బంప్స్ వస్తాయి. 1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్ర రాష్ట్రంలోని శివనేరి కోటలో జన్మించిన శివాజీ మహారాజ్ నేటికీ కోట్లాది భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నాడు. ముఖ్యంగా ఇప్పటి భారత యువతలో ఛత్రపతి శివాజీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఛత్రపతి శివాజీ..17వ శతాబ్దంలో బలమైన మొఘల్ సామ్రాజ్య విస్తరణకు ఎదురొడ్డి నిలిచి స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని స్థాపించిన ధీరుడు. శివాజీ కారణంగా మరాఠా ప్రజలకు ఒక ప్రత్యేక గుర్తింపు, రాజకీయ శక్తి వచ్చింది. ఒక స్వతంత్ర రాజ్యం కోసం ఆయన చేసిన పోరాటం ఆయనను గొప్ప యోధుడిగా నిలబెట్టింది..ఛత్రపతిగా మార్చేసింది.
1674లో రాయగఢ్ లో శివాజీని ఛత్రపతిగా పట్టాభిషేకం చేశారు. ఇది మరాఠా సామ్రాజ్య స్థాపనకు ఒక ముఖ్యమైన ఘట్టం. శివాజీ మహారాజ్ తన హయాంలో మొఘలుల దాడుల నుండి అనేక దేవాలయాలను, ఇతర మతపరమైన స్థలాలను రక్షించారు. శివాజీ బలవంతపు మత మార్పిడులను తీవ్రంగా వ్యతిరేకించారు. అలా జరిగిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఆయన చేసిన పోరాటం, స్థాపించిన స్వరాజ్యం హిందూ ధర్మం, సంస్కృతిని నిలబెట్టడానికి ఎంతో దోహదపడ్డాయి. ఆయన పరిపాలనలో మత సామరస్యానికి పెద్దపీట వేశారు. హిందువులతో పాటు ముస్లింలు కూడా ఆయన సైన్యంలో, పరిపాలనలో ముఖ్యమైన స్థానాల్లో ఉండేవారు.

శివాజీ ఒరిజినల్ ఫొటో దొరికిందిలా
అయితే ఛత్రపతి శివాజీ రియల్ ఫేస్ ని చూడాలని చాలామంది తపిస్తుంటారు. ఆయన గురించిన ఊహా చిత్రాలు, ఫొటోలు చూస్తేనే ఒళ్లు పులకరించిపోతుంది. ఇక ఆయన అసలు ఫొటో చూస్తే ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. శతాబ్దాలుగా ఛత్రపతి శివాజీ రియల్ ఫొటో ఒక రహస్యంగానే ఉండిపోయంది. 1919లో వాసుదేవ్ బింద్రే అనే చరిత్రకారుడు.. బ్రిటీష్ మ్యూజియంలో 300 ఏళ్ల నాటి డచ్ గవర్నర్ పుస్తకాన్ని కనుగొన్నారు. ఆ పుస్తకం ఛత్రపతి శివాజీ రిమల్ ఫేస్ ని బయటపెట్టింది. వేదిక్ సైన్స్ అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో శివాజీ రియల్ ఫేస్ ఫొటోని అప్ లోడ్ చేయగా అది వైరల్ గా మారింది.
శివాజీ మరణంపై భిన్నాభిప్రాయాలు
ఛత్రపతి శివాజీ మహారాజ్ 1680 ఏప్రిల్ 3న రాయగఢ్ కోటలో మరణించారు. అయితే ఆయన మరణంకి గల కారణాలపై భిన్నాభిప్రాయలు ఉన్నాయి. కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం కొన్ని వారాల పాటు తీవ్రమైన జ్వరంతో భాదపడి ఆయన మరణించారు. అయితే ఆయన మరణం వెనుక కుట్ర ఉందని మరికొన్ని చారిత్రక కథనాలు తెలుపుతున్నాయి. ఆయన రెండో భార్య సోయరాబాయి తన కొడుకుని వారసుడిగా చేయాలనే ఉద్దేశ్యంతో విషం ఇచ్చి ఉండొచ్చని కొందరు అనుమానిస్తున్నారు. అయితే చాలామంది చరిత్రకారులు శివాఝీ మహారాజ్ సహజ కారణాల వల్లనే చనిపోయాడని నమ్ముతున్నారు.



Click it and Unblock the Notifications