Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
యోగా సాధనతో ఏడు చక్రాలు జాగృతం చేస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మీకు తెలుసా..?
పూర్వ కాలంలో ఇప్పటిలాగే అన్ని వృత్తులనూ చేసుకునే వారున్నారు వారితోపాటు కొందరు యోగులు ఋషులు మునులు వుండే వారు. సాధన మానవులకు దూరంగా వారు జీవించే వారు. ఒక వైపు తపస్సు చేసుకుంటూనే ఆయుర్వేదం, శాస్త్ర చికిత్స, యోగ లాంటి ఎన్నో విజ్ఞానాలని ప్రజలకి అందిస్తూ సేవలు చేసేవారు. వీరంతా ఎలాంటి లాభా పేక్ష లేకుండా పని చేశారు. వీరందించిన జ్ఞానం ఇప్పుడు కూడా మనకు ఉపయోగ పడుతుంది.
ఈ విజ్ఞానాన్ని కనుక్కున్న వారికి అనంతమైన శక్తి వుంది. వారు అనుకుంది అనుకున్నట్టు జరిగింది. వీరిలో కుండలినీ శక్తి జాగ్రతమై వుంది. సరైన సాధన చేస్తే ఈ కుండలినీ శక్తి జాగ్రతమవుతుంది. ఒక కంప్యూటర్ పని చేయాలంటే దానికి ఒక ప్రోగ్రాం ఇవ్వాలి, ఆల్గొరితం ఇవ్వాలి అప్పుడు మాత్రమే ప్రోగ్రాం రన్ అవుతుంది. ఇలాగే కుండలినీ శక్తి కూడా జాగ్రుతమవుతుంది.
మనిషిలో కుండలినీ శక్తి జాగ్రుతం చేయడానికి కొన్ని పద్ధతులు వున్నాయ్. ఈ కుండలినీ శక్తిని జాగ్రుతం చేసుకున్న వ్యక్తి అందరికంటే భిన్నంగా ప్రత్యేకంగా శక్తివంతంగా ఉంటాడు. యోగ శాస్త్రం ప్రకారం మనిషి వెన్నులో మొత్తం ఏడు చక్రాలు ఉంటాయి. వెన్ను కింది నుంచి పై వరకు మూలాధారం నుంచి తలపైన సహస్ర చక్రం వరకు మొత్తం ఏడు ఉంటాయ్.

మూలాధార చక్రం, ఇది నాభి కింద ఉంటుంది. ప్రపంచంలో వున్న 99 శాతం మందిలో శక్తి ఈ మూలాధారం వద్దే ఆగిపోతుంది. దీనికి మించి పైకి ప్రవహించదు. ఈ చక్రం దగ్గరే ఆగిపోయిన వారికి భోజనం విశ్రాంతి ఉంటే చాలు అని అనుకుంటారు.
భోగం, భోజనం, నిద్ర పట్ల సంయమనం పాటించాలి. ఇందుకు సంకల్పం, ధైర్యం వుండాలి. అప్పుడు మాత్రమే సిద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. సాధనమీదే శ్రద్ధ పెట్టగలిగే ధైర్యం కావాలి. చుట్టూ వంద రకాల ఆకర్షనలు వున్నా వ్యామోహానికి లోను కాకుండా వుండాలి. మూలాధానం చైతన్యం కావడమే సాధనలో తొలిగెలుపుగా భావించాలి. జననేంద్రియాలకు పైన స్వాధీనాష్టచక్రం వుంటుంది. ఈ చక్రం వద్ద శక్తి ఎక్కువగా వుంటే విందు, వినోదం, భోగంలో మునిగిపోతారు. ఈ చక్రాన్ని జయించిన వ్యక్తి తనలోని క్రూల స్వభావాన్ని వదులుకుంటాడు.
జీవిత సత్యాల పట్ల నమ్మకాన్ని కలిగి వుంటాడు.
ఇక మనిపుర చక్రం విషయానికి వస్తే ఈ చక్రం మనిషి నాభి వద్ద వుంటుంది. ఈ చక్రం వద్ద శరీరంలో వున్న నాడులన్నీ కలుసుకుంటాయ్. ఈ చక్రం ఏదో చేయాలన్ని తపనను ఆవేశాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ చక్రాన్ని జయించిన వ్యక్తికి బిడియం, మోహం వుండవని పండితులు చెబుతున్నారు.
అనాహత చక్రం విషయానికి వస్తే. ఈ చక్రం హృదయ స్థానంలో వుంటుంది. ఈ చక్రం వద్ద శక్తి వున్నవారు సృజనాత్మకత కలిగి వుంటారు. ఈ చక్రాన్ని జయించిన వ్యక్తి వినలేని అద్భుతాలను కలిగి వుంటాడు. ఇక విషుద్ధ చక్రం. ఈ చక్రం గొంతు స్థానంలో వుంటుంది. ఈ చక్రాన్ని జయించిన వ్యక్తి ఏది అన్నా సత్యమవుతుంది. అంతటి శక్తిని కలిగి వుంటారు.
ఆరవది ఆగ్నా చక్రం. ఇది రెండు కనుబొమ్మల మధ్య వుంటుంది. మానవుడి శక్తి అక్కడికి చేరితే ఇక భౌతికంగా సిద్ధిని పొందినట్లేనని అంటారు. ఈ భౌతిక ప్రపంచం తాత్కాలికమని, సుఖదుఖాలు వచ్చి పోతుంటాయని, ఏదీ శాశ్వతం కాదని, చేసే ఏ పనితోనూ అటాచ్మెంట్ పెంచుకోవద్దని అంటారు. ఈ శక్తి జాగృతం అయిన వారు తామరాకు మీద నీటిబొట్టు లాగా తమ జీవితాన్ని గడుపుతూ సంతోషంగా వుంటారు.
ఈ అన్ని చక్రాలను దాటి సహస్రాచక్రాన్ని దాటిన వ్యక్తికి మోక్ష సిద్ధి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. ఈ శక్తని అందుకోవడం చాలా మందికి సాధ్యం కాదు. ఈ ఏడు చక్రాలను జయించిన వ్యక్తి ప్రపంచంలో చాలా శక్తివంతుడని పండితులు, యోగా శాస్త్రం చెబుతోంది.



Click it and Unblock the Notifications