తండ్రి చంపేశాడు.. అయినా ఆమె బతికింది

Written By:
Subscribe to Boldsky

ప్రపంచం ఇంతగా మారినా పరువు హత్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కుటుంబ పరువు, గౌరవం, మర్యాద వంటి పేర్లతో ఇలాంటి హత్యలు ఎక్కువగా చేస్తున్నారు. ఇస్లామిక్ దేశాల్లో ఎక్కువగా ఈ సంప్రదాయం ఉంది. మిగతా దేశాల్లోనూ దీని ప్రభావం లేదు అనడానికి లేదు. చాలా ముస్లిం దేశాల్లో పరువు హత్యలకి కొద్దిగా చట్టబద్దత కూడా ఉంది. పాకిస్తాన్, టర్కీలాంటి దేశాల్లో ఈ హత్యలకి చట్టపరమైన అనుమతి లేకపోయినా అక్కడి పెద్దల ఆదేశాల ప్రకారం ఈ హత్యలు నిత్యం జరుగుతూనే ఉంటాయి.

ఎ గర్ల్ ఇన్ ది రివర్ కు ఆస్కార్

ఎ గర్ల్ ఇన్ ది రివర్ కు ఆస్కార్

పరువు హత్యల కథా నేపథ్యంగా పాకిస్థాన్ లో ఏ గర్ల్ ఇన్ ది రివర్ (ది ప్రైస్ ఆఫ్ ఫర్గివెన్‌నెస్) అనే చిత్రం రూపొందింది. పాకిస్థానీ దర్శకురాలు షార్మీన్ ఒబేయిద్ షినాయ్ రూపొందించిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డు వచ్చింది. తన ఇష్ట ప్రకారం ఓ అబ్బాయిని పెళ్లాడిన యువతిని.. స్వయంగా తల్లిదండ్రులే చంపి నదిలో విసిరివేస్తారు.

image courtesy

పాకిస్థానీయులు బుద్ధి తెచ్చుకోవాలి

పాకిస్థానీయులు బుద్ధి తెచ్చుకోవాలి

అయితే ఆమె మృత్యువు నుంచి తప్పించుకొని.. తల్లిదండ్రులను క్షమించడమనే కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ అందరినీ కదిలిస్తుంది. అందరిలో ఆలోచన రేపుతుంది. ఇంట్లో వాళ్ల అంగీకారం లేకుండా పెళ్లి చేసుకుంటే వెంటాడి వేటాడి చంపేసే పాకిస్తానీయులంతా ఈ మూవీ చూసైనా బుద్ది తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ కథ అక్కడున్న వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపడంతో ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ వచ్చింది.

image courtesy

పరువు తీసిందని..

పరువు తీసిందని..

ఈ మూవీలో కూతురిగా నటించిన ఆమె పేరు సబా. ఆమె ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. కుటుంబ పరువు తీసిన ఆమె బతకూడదనుకుంటారు. వెంటనే వాళ్లు ఆమెపై దాడి చేస్తారు. ఆమె ముఖంపై కాల్చుతారు. తర్వాత ఆమెను నదిలోకి పడేస్తారు.

image courtesy

తాము చేసింది తప్పని ఒప్పుకోరు

తాము చేసింది తప్పని ఒప్పుకోరు

పోలీసుల సహాయంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తర్వాత కోలుకుంటుంది. ఆమె భర్తతో కలిసి హ్యాపీగా ఉంటుంది. చేసిన నేరానికి ఆమె కుటుంబసభ్యులు జైలు పాలవుతారు. కానీ ఆమె చేసింది మాత్రం తప్పే అని అక్కడ కూడా చెబుతారు. ఎంతకు తాము చేసింది తప్పని ఒప్పుకోరు. కానీ సబ మాత్రం తన తల్లిదండ్రులను క్షమిస్తుంది. వాళ్లు తనను చంపాలనుకున్న తను మాత్రం వాళ్లు బాగుండాలని కోరుకుంటుంది.

image courtesy

అక్కడి పరిస్థితులు ప్రతిబింబిస్తాయి

అక్కడి పరిస్థితులు ప్రతిబింబిస్తాయి

పాకిస్థాన్లో పరువు హత్యల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. ఏటా ఐదువేలమంది మహిళలు పరువు హత్యలు, వేధింపుల బారిన పడుతున్నారని పాక్ సామాజికవేత్త సర్వర్ బారీ స్వయంగా తెలిపారు. ఇలాంటి పరిస్థితిని ఎ గర్ల్ ఇన్ ది రివర్ మూవీ మనకు కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. చివరికి పెద్దలందరూ అంగీకరించడంతో రెండు ఫ్యామీలీలు కలిసిపోతాయి ఈ మూవీలో. ఈ మూవీ తీయడానికి పాకిస్థాన్ లో గతంలో జరిగిన అనేక సంఘటనలు కారణమయ్యాయి. అందులోకి కొన్నింటిని మీరూ తెలుసుకోండి.

image courtesy

కుటుంబ పరువు మంటగలుస్తోందని

కుటుంబ పరువు మంటగలుస్తోందని

మహిళల వల్ల కుటుంబ పరువు మంటగలుస్తోందని భావిస్తున్న కొందరు పాకిస్థాన్ పురుషులు పాశవికంగా హత్యలకు పాల్పడుతునే ఉన్నారు. ఇందుకు కొన్ని వందల ఉదాహరణలున్నాయి. పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ జిల్లాలోని ఒకే ఇంట్లో జహర, ఫర్జానా, నస్రీన్ అనే ముగ్గురు మహిళలు గతంలో దారుణ హత్యకు గురయ్యారు. ఇవన్నీ కూడా పరువు హత్యలే.

image courtesy

తల్లిదండ్రులు నరికి చంపారు

తల్లిదండ్రులు నరికి చంపారు

పంజాబ్ ప్రావిన్స్ లోని ఓ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన నస్రీన్ షహజాదీ తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అనంతరం ఆమె ఇస్లాం స్వీకరించడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. తల్లిదండ్రులు భర్తతో కలిసి ఇంటికి రమ్మని ఆమెకు ఫోన్ చేశారు. ఆమె భర్తతో పుట్టింటికి వెళ్లింది. అతని కళ్ల ఎదురుగానే ఆమెను తల్లిదండ్రులు కత్తితో పొడిచిచంపారు.

image courtesy

నిండు గర్భిణీని కూడా చంపారు

నిండు గర్భిణీని కూడా చంపారు

ముహమ్మద్ షకీల్, అక్సాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే వీరి పెళ్లికి అక్సా పేరెంట్స్ ఒప్పుకోలేదు. అప్పటినుంచి వీరి కుటుంబాల మధ్య గొడవలు జరిగేవి. వీరు పాక్ లోని పంజాబ్ లోని థిక్రివాలాలో నివాసం ఉండేవారు. అక్సా నిండు గర్భిణిగా ఉండేది. అప్పుడు సౌదీ అరేబియాలో ఉంటున్న అక్సా సోదరుడు పాకిస్థాన్ వచ్చాడు.

అక్సా తల్లి, ఆమె సోదరుడు, సోదరుడి తరఫు బంధువులు ఈ దంపతులను కిడ్నాప్ చేశారు. వారిని చితకబాదడంతో పాటు తుపాకీతో కాల్పులు జరిపి హత్యచేశారు. ఆ తర్వాత తమకేం తెలియదన్నట్లుగా శవాలను గుజ్రా-జంగ్ బ్రాంచ్ కాలువలో పడేశారు. నిండు గర్భిణి అయిన అక్సా(26)ను కాల్చి చంపారు. నాలుగేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి వీరు పెళ్లి చేసుకున్నారు. దీనిని సహించలేని అక్సా సోదరుడు వారిని హత్య చేశాడు.

image courtesy

ఒంటిపై కిరోసిన్ పోసి చంపారు

ఒంటిపై కిరోసిన్ పోసి చంపారు

లాహోర్ లో ప్రవీణ్ రఫిక్ అనే మహిళకు 18 ఏళ్ల కూతురు జీనత్ ఉండేది . జీనత్ హాసన్ ఖాన్ అనే మెకానిక్ ను ప్రేమించింది. జీనత్ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పినా గత నెలలో కోర్టు మేజిస్ట్రేట్ ముందు వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత జీనత్ నాలుగు రోజులు భర్త ఇంట్లో ఉంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు వెళ్లి జీనత్ కు ఎలాంటి హానీ తలపెట్టమని, విందు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఆమెను ఇంటికి తీసుకువచ్చారు.

జీనత్ కు ఇష్టం లేకపోయినా భయపడుతూ పుట్టింటికి వచ్చింది. ప్రేమపెళ్లి చేసుకున్నందుకు జీనత్ ను కుటుంబ సభ్యులు వేధించడం మొదలుపెట్టారు. హాసన్ ను మరచిపోవాలని తల్లి బెదిరించగా, జీనత్ అంగీకరించకపోవడంతో ఆమె తల్లి జీనత్ ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టి చంపేసింది. పాకిస్తాన్ లో ఏటా 1000 మందికి పైగా మహిళలు పరువు హత్యలకు బలైపోతున్నారు.

image courtesy

ఒక జర్నలిస్ట్ ను చంపేశారు

ఒక జర్నలిస్ట్ ను చంపేశారు

పెద్దలు వ్యతిరేకించిన ప్రేమ వివాహాన్ని సమర్థించిన జర్నలిస్టును వధువు బంధువులు కాల్చి చంపేశారు. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన యువతి పెద్దల అభిప్రాయాన్ని వ్యతిరేకించి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇదే సమయంలో అజ్మల్ జోయిమాఅనే జర్నలిస్టు ప్రేమ జంటకు అండగా నిలిచాడు. దీంతో బైక్ లో ఇంటికి వెలుతున్న అజ్మల్ ను ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు.

image courtesy

మంచానికి కట్టేసి చంపారు

మంచానికి కట్టేసి చంపారు

పాకిస్థాన్‌లోని కరాచీలోని జిర్గా అనే గిరిజన సంతతికి చెందిన ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. అయితే వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరూ కూడ తమ ఇళ్ళ నుండి గత మాసంలో పారిపోయారు. అయితే రెండు కుటుంబసభ్యులు ప్రేమికులు వారిని తీసుకువచ్చారు.జిర్గా కుల పెద్దలు ప్రేమికులను చంపాలని తీర్మాణం చేసింది.

మంచానికి కట్టేసి విద్యుత్‌షాక్ పెట్టి చంపాలని గ్రామపెద్దలు తీర్మాణం చేశారు. కుల పరువును తీసినందుకు కుల పెద్దలు ఈ మేరకు ఆదేశించారు. మొదటి రోజు అమ్మాయిని, రెండోరోజు అబ్బాయిని చంపేశారు. ప్రేమికుల పెళ్ళికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించినప్పటికీ కూడ కుల పెద్దలు మాత్రం అంగీకారం తెలపకపోవడంతో మంచానికి కట్టేసి విద్యుత్‌షాక్‌తో చంపేశారు.

image courtesy

ఉద్యమాలు

ఉద్యమాలు

పాకిస్థాన్ లో పెరిగిపోతున్న పరువు హత్యల పట్ల అక్కడి సామాజిక ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూనే ఉన్నారు. చంపడం ద్వారా కుటుంబ గౌరవం పెరగదంటూ నినాదాలు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా కొన్ని వేలమంది మహిళలు తమ కుటుంబంలోని పురుషుల చేతిలో దారుణంగా హతమయ్యారని హ్యూమన్ రైట్స్ కమిషన్ వెల్లడించిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమౌతోంది. అక్కడి సంప్రదాయాన్ని మార్చాలంటే ఎ గర్ల్ ఇన్ ది రివర్ వంటి చిత్రాలు వందలాదిగా రావాలి.

English summary

a girl in the river oscar win pakistan end honour killings

a girl in the river oscar win pakistan end honour killings
Subscribe Newsletter