ఆ దేశాల్లో గంజాయి చట్టాలు గురించి తెలిస్తే ఓరి దేవుడో అంటారు

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఈ ప్రపంచం మొత్తంలో కలుపు మొక్కలను పెంచడం మరియు వాటిని వినియోగించడాన్ని చట్టబద్దం చేసిన మొట్టమొదటి దేశం యురుగ్వే. అంటే దీనర్ధం గంజాయి సేవించడాన్ని ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశం అనుమతించినట్లు కాదు.

గంజాయి యొక్క ప్రభావాలు మరియు దుష్ప్రభావాలు గురించి చర్చించవలసి వచ్చినప్పుడు ఒక విధమైన గందరగోళానికి లోనవుతారు. వాషింగ్టన్ వంటి ప్రదేశాల్లో ఒక్కో వ్యక్తి దగ్గర ఒక ఔన్స్ గంజాయి ఉండవచ్చు అనేలా చట్టాలను రూపొందించి అనుమతించారు. కానీ కొన్ని దేశాల్లో ఆ పదార్ధాలు వ్యక్తుల దగ్గర ఉంటే వారిని జైల్లో పెడతారు.

భారతదేశంలో ఒక వ్యక్తి ని చంపడం చట్టరీత్యా ఆమోదయోగ్యం..!

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 125 మిలియన్ ప్రజలు ఈ గంజాయిని సేవిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అంతర్జాలంలో కూడా ఈ గంజాయి మీద విపరీతమైన చర్చ నడిచింది. ప్రపంచ వ్యపథంగా వివిధ దేశాలలో ఈ గంజాయి పై ఉన్న విభిన్న చట్టాల గురించి తెలిస్తే ఎవరైనా సరే అవాక్కవుతారు.ఎవరైతే గంజాయి ప్రేమికులు లేదా ఈ మత్తుపదార్ధాల కలుపు మొక్కను వినియోగించే ప్రేమికులు ఉన్నారో వారందరూ ఈ క్రింది దేశాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. ఆ దేశాల్లో ఉన్న చట్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. యు.ఏ.ఈ :

1. యు.ఏ.ఈ :

ఈ దేశంలో మీరు ఉన్నప్పుడు ఏ కొద్దిగా గంజాయి అయినా మీ దగ్గర గనుక లభిస్తే నాలుగు సంవత్సరాల పాటు జైల్లో గడపవలసి ఉంటుంది. యు.ఏ. ఈ దేశంలో ఎంత తక్కువ మోతాదులో గంజాయి లభించినా తప్పనిసరిగా నాలుగు సంవత్సరాల కారాగార శిక్షను అనుభవించాలి. మీ దగ్గర మరీ ఎక్కువ మోతాదులో గనుక లభిస్తే మీకు విధించే శిక్ష రెట్టింపు లేదా అంతకు మించి ఉండొచ్చు. మీరు ఎంత మత్తుపదార్ధాన్ని సేవించారు అనే విషయాన్ని మీ మూత్రం మరియు రక్తాన్ని పరీక్షించి నిర్ధారిస్తారు.

2. ఇండోనేషియా :

2. ఇండోనేషియా :

ఇండోనేషియా దేశంలో గంజాయి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఎవరైనా గంజాయి సేవిస్తున్నట్లు ఆ దేశంలో కనపడితే మరు మాట్లాడకుండా నాలుగు సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాలి. ఒకవేళ ఆ కలుపు మొక్కలను దిగుమతి చేసుకుంటున్నవాళ్ళు పట్టుబడితే 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడపవలసి ఉంటుంది.

3. చైనా :

3. చైనా :

ప్రపంచంలో అత్యంత కఠినమైన గంజాయి చట్టాలు కలిగిన దేశాల్లో చైనా ఒకటి. మీ దగ్గర గనుక ఈ మత్తు పదార్ధం ఉన్నట్లు గుర్తించినట్లయితే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. అంతేకాకుండా మీ మరణాన్ని వాళ్ళు వేడుకగా జరుపుకుంటారు. కొన్ని వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం, ఈ కలుపు మొక్కలను వినియోగిస్తున్న వాళ్ళను శిక్షించడానికై, ఏటా 500 మందికి మరణ శిక్షను విధిస్తోందట అక్కడి ప్రభుత్వం. కానీ, చైనా ప్రభుత్వం ఈ విషయాన్ని ఎప్పుడూ బహిర్గత పరచలేదు మరియు ప్రపంచానికి తెలియజేయలేదు.

4. జపాన్ :

4. జపాన్ :

జపాన్ దేశంలో గనుక మీరు ఈ మత్తు పదార్ధాన్ని సేవిస్తూ గనుక పట్టుబడితే, అక్కడ ప్రభుత్వ చట్టాల ప్రకారం ఐదు సంవత్సరాల పాటు జైలులో గడపవలసి ఉంటుంది. ఎవరైతే ఈ మత్తుపదార్ధాన్ని సేవించడం వల్ల జైల్లో శిక్ష అనుభవించడానికి వెళ్తారో వారు అక్కడ చాలా కఠినమైన పనులు చేయాల్సి ఉంటుంది. ఎవరైనా విదేశీ వ్యక్తి ఈ పనిచేస్తూ గనుక పట్టుబడితే వాళ్ళను తక్షణమే దేశం నుండి పంపివేస్తారు మరియు వాళ్ళను జీవితాంతం ఎప్పుడూ జపాన్ లోకి అడుగుపెట్టనివ్వరు.

5. సింగపూర్ :

5. సింగపూర్ :

సింగపూర్ లో గనుక పట్టుబడితే మాములుగా అయితే మిమ్మల్ని చంపరు. కానీ, ఇంకోరకంగా హింసించి చంపినంత పని చేస్తారు. మీరు ఈ మత్తుపదార్ధాన్ని సేవిస్తూ గనుక పట్టుబడితే అక్కడి ప్రభుత్వానికి 8.25 లక్షల రూపాయల జరిమానాను కట్టవల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గనుక జరిమానాను కట్టకూడదు అని నిర్ణయించుకున్నట్లైతే, 10 సంవత్సరాల పాటు జైల్లో గడపవలసి ఉంటుంది.

6. థాయిలాండ్ :

6. థాయిలాండ్ :

ఎతైన పర్వతాలు, అతి సుందరమైన సముద్ర తీరాలు ఇలా ఎన్నో ప్రకృతి అందాలతో అత్యంత అందమైన ప్రదేశాల్లో థాయిలాండ్ దేశం కూడా ఒకటి. కానీ, గంజాయి చట్టాలు దగ్గరకు వచ్చేసరికి మాత్రం వాళ్ళు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారు. ఆ చట్టాల గురించి తెలిస్తే రాత్రి అస్సలు నిద్రకూడా రాదు. ఒకవేళ నిద్రపోయినా అవే గుర్తుకు వస్తాయి. గంజాయి ని సేవించడం అనేది ఆ దేశంలో చట్టబద్దం కాదు. ఒకవేళ ఏ వ్యక్తయినా దానిని సేవిస్తూ పట్టుబడినట్లైతే వారికి సమర్ధించుకొనే అవకాశం గాని లేదా కోర్ట్ లో హాజరు పరచి వారి వాదనను వినిపించే అవకాశం గాని ఏది ఇవ్వరు. ఇలా ఏ అవకాశం ఇవ్వకుండానే వారిని చంపేస్తారు. పొరపాటున ఏ యాత్రికుడైనా థాయిలాండ్ లో మత్తుపదార్ధాలు సేవిస్తూ గనుక పట్టుబడితే వారి పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది, కఠినమైన శిక్షలను అమలుపరుస్తారు.

7. ఫిలిప్పీన్స్ :

7. ఫిలిప్పీన్స్ :

ఆ దేశంలో ఉండే పాత చైనా టౌన్ మరియు సైనిక కారాగారానికి, ఫిలిప్పీన్స్ ఎంతో ప్రసిద్ధి చెందింది. కఠినమైన మరియు దిగ్భ్రాంతికి గురిచేసే గంజాయి చట్టాలు కలిగిన దేశాల్లో ఫిలిప్పీన్స్ కూడా ఒకటి. మొదటిసారి ఎవరైనా గనుక గంజాయిని సేవిస్తూ పట్టుబడితే మళ్ళీ మాములు మనిషి అవడానికి 6 నెలలు పునరావాస కేంద్రానికి పంపిస్తారు. రెండవసారి గనుక ఏ వ్యక్తులైనా దొరికితే మాత్రం వాళ్ళు 12 సంవత్సరాలు పాటు కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

8. మలేసియా :

8. మలేసియా :

ఐదు గ్రాముల కంటే ఎక్కువ గంజాయి గనుక ఒక వ్యక్తి దగ్గర ఉంటే వాళ్ళు 4 లక్షల రూపాయల జరిమానాను కట్టవల్సి ఉంటుంది మరియు కనీసం ఆరు సంవత్సరాల పాటు జైలులో జీవితాన్ని గడపాలి. మలేసియా లో నివసిస్తున్న వారు ఎవరైనా ఈ గంజాయి పెంచుతూ పట్టుబడితే, వాళ్ళు జీవిత ఖైదు శిక్షను అనుభవించవలసి ఉంటుంది. ఇవే కాకుండా మీ దగ్గర 200 గ్రాములకు మించి గంజాయి గనుక ఉన్నట్లయితే ఉరిశిక్షను అమలుపరుస్తారు.

Read more about: insync, life, లైఫ్
English summary

Marijuana Laws That Can Make You Say 'WTF'

With roughly 125 million people smoking joint across the world, weed has always become a hot topic on the internet. Today, we would be talking about some strange, dubious and WTF marijuana laws around the world. Weed lovers; think before you roll a joint at these places.
Subscribe Newsletter