For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీచర్స్ డే 2019: ఉపాధ్యాయ వృత్తికి గౌరవాన్ని తెచ్చిపెట్టిన సర్వేపల్లితో పాటు మరికొందరు ప్రముఖులు

By Gandiva Prasad Naraparaju
|

విద్య అనేది ప్రతి వ్యక్తికీ ఒక గొప్ప ఆస్తి లాంటిది, జ్ఞాన౦ అనే వెలుగుని పంచడం అనేది చివరికి కీర్తికి, స్వేచ్చకు దారితీస్తుంది. మనకు తెలిసినా తెలియకపోయినా ఒక మనిషి జీవితంలో ఉపాధ్యాయుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు.

గురు:బ్రహ్మా, గురు:విష్ణు: గురుదేవో మహేశ్వర:గురు:బ్రహ్మా, గురు:విష్ణు: గురుదేవో మహేశ్వర:

చాలామంది ఉపాధ్యాయులు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నేటి యువతకు విద్యను అందించడంలో పూర్తిగా వారి జీవితాన్ని అంకితం చేస్తున్నారు, కాబట్టి దానివల్ల విద్యార్ధులు మంచి పౌరులుగా, గొప్ప వ్యక్తులుగా తయారవుతున్నారు. ఇలాంటి ఉపాధ్యాయులను మనం ఎప్పటికీ మర్చిపోలేము, పరీక్షా సమయంలో సమాజంలో వారి సహకారం ఎల్లప్పుడూ నిలబడుతుంది.

ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రాముఖ్య ఉపాధ్యాయుల గురించి తెలుసుకుందాము.

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ

ఈయన పేరుతో భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవ౦ నిర్వహించబడుతుంది. దాన్నిబట్టి మనం ఆయన ఇంతకుముందు ఎంత గొప్ప గురువో ఊహించుకోవచ్చు.

భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా, మొదటి ఉప రాష్ట్రపతిగా పనిచేసిన రాధ క్రిష్ణ 1888వ సంవత్సరం తమిళనాడులోని తిరుత్తనణిలో జన్మించారు. ఆయన తన 21వ ఏట ఫిలాసఫీ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసారు.

ఆయన ఆధ్యాత్మిక విద్యకు ప్రాముఖ్యతను ఇచ్చేవారు, తత్వశాస్త్రంలో క్లిష్టమైన భావనలను పంచుకోవడంలో ఆయన దిట్ట. ఆయన మైసూర్ విశ్వవిద్యాలయం మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ విద్యార్ధులను మెరుగుపరిచి, ఆంద్ర విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సెలర్ గా కూడా చేసారు.

ఈయన UK, US లోని ఇంటర్నేషనల్ కాంగ్రెస్ లో కలకత్తా యూనివర్సిటీ కి ప్రాతినిధ్యం వహించి, ఆక్స్ఫార్డ్ వద్ద సమకాలీన మతంపై ఉపన్యాసం ఇచ్చారు. ఆయన విద్యార్ధులతో ఎంతో ఆత్మీయంగా ఉండేవారు, ఇంట్లోకూడా తరగతులు బోధించేవారు. అలంటి ఒక గొప్ప అధ్యాపకుడు, 1975వ సంవత్సరం అతని జీవితం ముగిసే వరకూ జ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నారు.

సావిత్రిబాయి పూలె

సావిత్రిబాయి పూలె

సావిత్రిబాయి పూలె భారతదేశంలోని మొట్టమొదటి మహిళా అధ్యాపకురాలిగా చెప్తారు. 1848వ సంవత్సరంలో పూణే లో తన భర్తతో కలిసి అంటారని అమ్మాయిల కోసం ఒక పాఠశాల ప్రారంభించి, భారతదేశంలో ఒక విప్లవాన్ని సృష్టించింది. అందువల్ల ఆమెని చాలామంది వ్యతిరేకించారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఆమె అదే సంవత్సరం మరో ఐదు పాఠశాలలను ప్రారంభించింది.

ఒక ఉపాధ్యాయురాలిగా ఆమె ప్రయాణం అంత సులభతరం కాలేదు, ఎగువ కులాలు ఆమెను ఖండించాయి. విద్యపట్ల ఆమెకున్న శ్రద్ధను బ్రిటీషు ప్రభుత్వం గుర్తించింది. ఆమె ఆధునికి మరాఠీ పద్య రచయితకు సృష్టికర్తగా కూడా పేరుగాంచింది.

అన్నే సుల్లివన్

అన్నే సుల్లివన్

ఈ అమెరికన్ ఉపాధ్యాయురాలు హెలెన్ కెల్లర్ కి సలహాదారుగా ఉండేది. హెలెన్ చెవిటివాడు, గుడ్డివాడు కూడా. 6 సంవత్సరాల హెలెన్ కి విద్యనూ బోధించడం ప్రారంభించినపుడు సుల్లివన్ కి 20 సంవత్సరాలు. వారిద్దరూ సుల్లివన్ చనిపోయే వరకు 49 సంవత్సరాలు కలిసి పనిచేసారు. అరచేతిలో రాయడం మొదలుపెట్టి, ఆమె హెలెన్ కి బోధించడానికి ఒక ప్రత్యేకమైన సంకేత భాషనూ ఉపయోగించి ఆమె చరిత్ర సృష్టించింది.

హెలెన్ కళల్లోమాస్టర్స్ డిగ్రీ పొందిన మొట్టమొదటి చెవిటి, గుడ్డి వ్యక్తీ అయ్యాడు. వికలాంగుల పిల్లల్లో విద్య యొక్క ప్రాధాన్యతను అర్ధం చేసుకునేట్టు విద్యనూ తయారుచేయడంలో సుల్లివన్ ఒక మంచి పేరు గడించారు.

మదన్ మోహన్ మాల్వియా

మదన్ మోహన్ మాల్వియా

మదన్ మోహన్ మాల్వియా 1861వ సవత్సరం వారణాసిలో జన్మించారు. ఈయన విద్యావేత్త, స్వాతంత్ర్య కార్యకర్త. అతను ఆసియాలోని అతిపెద్ద నివాస విశ్వవిద్యాలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్ధాపించారు. ఆయన అక్కడే దాదాపు రెండు దశాబ్దాలపాటు వైస్ చాన్సెలర్ గా పనిచేసారు.

విశ్వవిద్యాలయం వైజ్ఞానిక, ఔషధం, ఇంజనీరింగ్, టెక్నాలజీ, లా, వ్యవసాయం, కళలు, ప్రదర్శక కళలు వంటి వివిధ రంగాలను 35,000 మంది విద్యార్థులకు అందించింది. "సత్యమేవ జయతే" అనే భారతదేశ నినాదాన్ని ప్రముఖంగా ప్రచారం చేసిన వ్యక్తి ఈయనే.

డాక్టర్. ఏ.పి.జే.అబ్దుల్ కలాం

డాక్టర్. ఏ.పి.జే.అబ్దుల్ కలాం

కలాం ఒక గొప్ప శాస్త్రవేత్తగా పెరుగంచినప్పటికీ, ఆయన జ్ఞానానికి వెలుగును ప్రసరి౦పచేయడానికి ఎక్కువ ఇష్టపడేవారు. ఆయన యువతరంతో చాలా శులభంగా కలిసిపోయేవారు. ఈయన భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు, అంతేకాక భారతదేశం యొక్క అణు, అంతరిక్ష ఇంజనీరింగ్ రంగాలకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈయనను మిస్సైల్ మాన్ అని కూడా పిలుస్తారు.

ఈయన విద్యార్ధులు తమకుతాము ఆలోచించే వీలు కల్పించి, విస్తృతమైన వారి పరిశోధనాత్మక స్వభావాన్ని ప్రోత్సహించే ఒక రకమైన గురువు. అతను చివరి శ్వాస వరకు బోధించారు. ఆయన చివరిసారిగా ఐఐఎం షిల్లాంగ్ విద్యార్ధులను ప్రొఫెసర్ గా సందర్శించారు.

English summary

Who are the famous teachers from history | List of famous teachers from history | Names of famous teachers from history

Let us take a look at some of the famous teachers who left their marks on the minds of people.
Desktop Bottom Promotion