అతను నీటిలో మునగడానికి వెళితే, శరీరం వాచింది.

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ప్రతిరోజూ అదృష్టమైనదిగా ఉండదు. తన రోజువారిలానే నీటిలో మునగడానికి వెళ్లిన జాలరి విషయంలో సరిగ్గా అదే జరిగింది. ఏదేమైనప్పటికీ, అతనికి తెలియదు - అతను ఏదో ఒక కొత్త విషయాన్ని మోసుకొని భూమ్మీదకి చేరుకుంటాడని.

అలెజాండ్రో రామోస్ మార్టినెజ్ అనే వ్యక్తి యొక్క ఛాతీ, చేతులు బాగా పెరిగినట్లుగా ఉన్న ఒక వింత రోగంతో చాలా బాధపడుతున్నాడు.

వామ్మో ! అగరబత్తులు నిజంగా హానికరమా ? అది తెలుసుకోవాలంటే ఇది చదవండి

అతని శరీరంలోని చేతులు మరియు ఛాతీతో నత్రజనితో నిండినందు వల్ల అతని బరువు దాదాపు 4 రెట్లు వరకు పెరిగింది. అలెజాండ్రో యొక్క ఈ విచిత్ర కేసును చూడండి.

ఆ రోజు కూడా సాధారణమైన రోజులానే :

ఆ రోజు కూడా సాధారణమైన రోజులానే :

పెరూ నుంచి వచ్చిన అలెజాండ్రో అనే జాలరి సముద్రలో చేపలను పట్టుకోవడానికి నీటిలో మునిగి, త్వరగా బయటకు వచ్చిన తర్వాత భయంకరమైన నొప్పులతో బాధపడ్డాడు. సముద్రపు అడుగుభాగం నుండి సముద్ర జీవుల సేకరించటానికి నీటిలో మునిగిన తర్వాత అతని చేతులు మరియు ఛాతీ ఒక్కసారిగా 31.7 కిలోల బరువు పొందిన వెంటనే అతను చాలా బలహీనంగా పడ్డాడు.

ప్రాణాంతకమైన పరిస్థితులు :

ప్రాణాంతకమైన పరిస్థితులు :

తన శరీరంలోకి ప్రవేశించిన నత్రజని, ద్రవ రూపంలో ఉన్న ఒక సంచిలా మారడం వల్ల, అతను ఊపిరి తీసుకోలేని చివరి దశకు చేరి, చావుకి దగ్గర అవుతున్నాడు. ఈ పరిస్థితిని "బెండ్స్" (bends) అని పిలుస్తారు. అతని రక్తంలో నత్రజని కారణముగా చాలా ఎక్కువ సంఖ్యలో, వింతైన బుడగలు ఏర్పడింది.

ఈ పరిస్థితి యొక్క లక్షణాలు ...

ఈ పరిస్థితి యొక్క లక్షణాలు ...

ఈ అనారోగ్యం యొక్క లక్షణాలుగా కీళ్ళ వాపు, మైకము, చర్మానికి దురద పెట్టడం, వికారం, మెదడుకి నష్టం వాటిల్లడం, పక్షవాతం, తలనొప్పి మరియు దగ్గు మొదలైనవాటిని కలిగి ఉంటాయి. స్కూబా డైవింగ్ చేసే వారిలో ఈ పరిస్థితి సాధారణం కన్నా చాలా వేగంగా పెరుగుతుందని పరిశోధకులు వాదించారు.

ఇండియన్స్ పాటిస్తున్న భయంకరమైన ఆచారాలు

అతనికి చికిత్స :

అతనికి చికిత్స :

స్పష్టంగా చెప్పాలంటే, అతన్ని ఇప్పుడు ఒత్తిడిని కలిగించే పీడన గదిలో ఉంచి ఆక్సిజన్ చికిత్స ఇవ్వబడుతుంది. ఈ కేసు చాలా సంక్లిష్టంగా ఉన్నందున వారు అతని శరీరం నుండి కేవలం 30% నత్రజనిని బయటకు తీయగలుగుతున్నారని వైద్యులు పేర్కొన్నారు.

అతని ప్రస్తుత పరిస్థితి :

అతని ప్రస్తుత పరిస్థితి :

అతను ఈ ప్రమాదం కారణంగా ప్రస్తుతం తీవ్ర భాదని ఎదుర్కొంటున్నాడు మరియు నడవటం అతనికి చాలా కష్టంగా మారింది. అతను తీవ్రమైన రక్తపోటును కూడా ఎదుర్కొంటున్నాడు.

Images Source

English summary

His Body Swelled Up With This Bizarre Condition

He went diving for a fish but suffered from a horrible case of the bends.
Story first published: Monday, September 11, 2017, 20:00 [IST]
Subscribe Newsletter