తనను 43,200 సార్లు అత్యాచారం చేశారని చెబుతున్న మానవ అక్రమ రవాణా బాధితురాలు

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఒక వ్యక్తిని లైంగికంగా వేధించినా లేదా అత్యాచారం చేసినా వారు మానసికంగా ఎంతగానో కృంగిపోతారు. ఒకవేళ ఇలాంటి విషయాలు గనుక ఆయా వ్యక్తులు యుక్త వయస్సులో గనుక జరిగితే, అస్సలు చుట్టూ ఏమి జరుగుతోంది అనే విషయం కూడా తెలుసుకునే పరిస్థితిలో లేనప్పుడు ఇటువంటివి చోటు చేసుకుంటే అది వారిని జీవితాంతం వెంటాడుతుంది. అంతేకాకుండా, జీవితంలో ఎప్పుడూ వాళ్ళు భయపడుతూనే ఉండేలా చేస్తుంది.

ఒక అమ్మాయి నాలుగు సంవత్సరాలలో 43200 సార్లు అత్యాచారానికి గురైంది అనే విషయం మీకు తెలుసా ? అసలు ఇలా జరిగి ఉంటుందని మీరు ఎప్పుడైనా ఊహించారా ? కానీ ఇది నిజం. కార్ల జేసీన్తో జీవితంలో చోటు చేసుకున్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చాణక్య నీతి : మీ జీవితంలో సరైన వ్యక్తులను ఎంపిక చేసుకోవడం ఎలా?

అత్యాచారం ? అది అయిపోయిన తర్వాతనే అసలు బాధ మొదలవుతుంది :

అత్యాచారం ? అది అయిపోయిన తర్వాతనే అసలు బాధ మొదలవుతుంది :

ఈమె ఒక మానవ అక్రమ రవాణా బాధితురాలు. ప్రస్తుతం ఈ మహిళ అత్యాచారానికి గురైన బాధితులను ఆదుకోవడానికి తన జీవితాన్ని అంకితం చేసింది.

అసలు ఆమె జీవితంలో ఏ ఏ విషయాలు చోటుచేసుకున్నాయి. ఎందుకు ఆమె అంత దుర్భర స్థితిని అనుభవించింది. ఇప్పుడు ఎందుకు ఇలా వేరే వారికి అండగా నిలుస్తోంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు ఈ మహిళ అక్రమ రవాణా వలలో ఎలా చిక్కిందంటే :

అసలు ఈ మహిళ అక్రమ రవాణా వలలో ఎలా చిక్కిందంటే :

ఈమె మెక్సికో లోని ఒక చిన్న ప్రాంతంలో నివసించేది. ఆమె వయస్సు అప్పుడు పన్నెడు సంవత్సరాలు. ఈమెను చూసుకునే వాళ్ళు ఎవరు పెద్దగా వాళ్ళ కుటుంబంలో ఉండే వారు కాదు. అందుకు కారణం పేదరికం. అటువంటి సమయంలో ఎన్నో ఆశలు చూపడంతో ఈమె ఆ వయస్సులోనే ఇంటి నుండి వెళ్ళిపోయింది. అబద్దపు వాగ్దానాలు, ఖరీదైన బహుమతులు మరియు మంచి మాటలు ఇవన్నీ చెప్పి ఆమెను అత్యంత భయంకరమైన మానవ రవాణా వలలోకి లాగారు. వీటి కోసం వెళ్లి అక్కడ ఆమె బందీ అయిపొయింది.

ఆమె ఒక వృత్తి సంబంధమైన వేశ్య సరఫరాదారుడి కోరల్లో చిక్కుకొని విలవిలలాడింది :

ఆమె ఒక వృత్తి సంబంధమైన వేశ్య సరఫరాదారుడి కోరల్లో చిక్కుకొని విలవిలలాడింది :

అప్పటికి ఆ మహిళ చాలా చిన్న అమ్మాయి. అటువంటి సమయంలో ఆమె ఒక వృత్తి సంబంధమైన వేశ్య సరఫరాదారుడి కోరల్లో చిక్కుంది. ఆ చిన్న అమ్మాయిని తన అధీనంలోకి తెచ్చుకోవడానికి ఆ వ్యక్తికి మూడు నెలల సమయం పట్టింది. ఈ సమయంలో ఆమెను ఒక యువరాణిలా చూసుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమెను ఎక్కడో ఒక్క మూల కూర్చోబెట్టేవారు మరియు అతడి లాభం కోసం వీధుల్లో కష్టపడాలని ఆమె పై ఒత్తిడి తెచ్చేవాడు.

ఇక అప్పటి నుండి ఆమెకు అగ్ని పరీక్ష మొదలైంది :

ఇక అప్పటి నుండి ఆమెకు అగ్ని పరీక్ష మొదలైంది :

ఈ నాలుగు సంవత్సరాల వ్యవధిలో 40 వేలకు పైగా ఖాతాదారులకు సేవ చేయాల్సి వచ్చింది. లేదు లేదు అలా చేయమని విపరీతమైన ఒత్తిడి తీసుకువచ్చారు. వాళ్ళు ఏ పని చెబితే ఆ పని చేయాల్సి వచ్చేది. ఈ విషయమై ఆమె ఏమని చెప్పిందంటే " ప్రతి రోజు నా పని ఉదయం పది గంటలకు మొదలై అర్ధరాత్రి వరకు కొనసాగేది. కొంతమంది పురుషులు నన్ను చూసి విపరీతంగా నవ్వే వారు, అందుకు కారణం ఆ సమయంలో నేను విపరీతంగా ఏడుస్తూ ఉండే దానిని. "

ఆమె ఖాతాదారులుగా ఎవరెవరు ఉండేవారంటే :

ఆమె ఖాతాదారులుగా ఎవరెవరు ఉండేవారంటే :

జడ్జిలు, పురోహితులు, పాస్టర్లు, పోలీసులు మరియు ఎంతో ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తులు అందరూ ఆమె ఖాతాదారులుగా ఉండేవారు. ఆమె అక్కడ నుండి బయటపడి ఎవరికైనా పై అధికారులకు తన బాధను విన్నవించుకున్నా లాభం లేదనే విషయం గుర్తించింది. ఎందుకంటే వీళ్ళందరూ ఒకరికొకరు బాగా తెలుసు కాబట్టి తనకి న్యాయం జరగదు అని గ్రహించింది. ఎక్కడెక్కడి నుండో విదేశీయులు తాను ఉంటున్న ప్రాంతానికి శృంగార కార్యకలాపాల్లో పాల్గొనడానికి వచ్చేవారు. అందుకు కారణం వారందరికీ చిన్నపిల్లలతో శృంగారం చేయాలనే ఆలోచన ఉండేది.

ఆమె ఎంతో అదృష్టవంతురాలు ఎందుచేతనంటే :

ఆమె ఎంతో అదృష్టవంతురాలు ఎందుచేతనంటే :

ఆమె వయస్సు అప్పటికి పదహారు సంవత్సరాలు. ఒక పురుష ఖాతాదారుడు ఎప్పుడూ తన దగ్గరకు వచ్చేవాడు. అతడు ఆమె బాధను అర్ధం చేసుకున్నాడు. ఆ నరక కూపం నుండి ఆమెను ఎలా అయినా బయటపడేయాలని భావించాడు. ఆమె ఎలాగోలా అతని సహాయంతో అక్కడి నుండి తప్పించుకొని ఒక ప్రదేశానికి చేరుకుంది. అక్కడ ఆమెకు ఎంతో సహాయం, సంరక్షణ, ప్రేమ మరియు దృష్టి ఆమె పై కేంద్రీకరించి ఎంతో బాగా చూసుకున్నారు. వీటన్నింటి వల్ల ఆమె పగిలిపోయిన మనస్సు ఒక్కొక్కటి మళ్ళీ అతుక్కొని సాధారణ స్థితికి చేరుకోవడానికి దోహదపడింది.

ప్రస్తుతం ఆమె ఏమి చేస్తుందంటే :

ఈ మహిళ ప్రస్తుత వయస్సు 24 సంవత్సరాలు. అత్యాచారం మరియు మానవుల అక్రమ రవాణా వల్ల బాధితులుగా మారిన ఎంతో మందికి సహాయం చేయాలని నడుం బిగించింది. అందుకోసం ఆ దిశగా ఎంతగానో కృషిచేస్తోంది. ఆ యుక్త వయస్సులో ఈ మహిళ అనుభవించిన ఒత్తిడి మరియు మానసిక వేదన నుండి బయటపడి ఇతరులకు సాయం చేయడానికి ఇంతలా పరితపిస్తోందంటే ఆమెలో ఎంతో ధైర్యం ఉండి ఉండాలి. ఆమెకు ధైర్యంతో పాటు అంతకు మించిన శక్తి కూడా ఉంది అనే విషయం వీటన్నింటిని విన్న తర్వాత మనకు అర్ధం అవుతుంది.

ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో ని క్లిక్ చేయండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Human Trafficking Victim Revealed She Was Raped For 43,200 Times!!

    Getting molested or raped can cause so much of a trauma for any individual; and if this happens while you are young and are unaware of what is happening around you, it leaves you scarred for life! Can you imagine a young girl who was raped for 43,200 times in a span of 4 years alone? Well, this is a true story that happened to a girl named Karla Jacinto.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more