దేవతాసంబంధమైన సంఖ్యల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

దివ్య సంఖ్యలంటే మీకు తెలుసా ? అవి ఏమని సూచిస్తాయంటే. దేవతాసంబంధమైన సంఖ్యల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..

మీరు గనుక తరచూ లేదా ఎక్కువగా ఏవైనా సంఖ్యలు మీకు ఎదురుపడుతూ ఉంటే లేదా చూస్తూ ఉంటే, వాటి వెనుక ఉన్న ఎదో రహస్య అంతరంగాన్ని అది సూచిస్తూ అయినా ఉండాలి లేదా వాటి వెనుక ఏదైనా బలమైన కారణం ఉండి ఏదైనా ఉండాలి.

మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 2017 మీకు ఎలా ఉండబోతోంది ?

మీ చుట్టుప్రక్కల ఉన్న సంఖ్యలను ఒక్కసారి కంటే ఎక్కువగా గనుక చూస్తూ ఉంటే, అది ఏమైనా దేవతా సంబంధమైన సంజ్ఞ ను లేదా సూచనను ఇస్తున్నాయని అర్ధం లేదా మీ జీవితంలో త్వరలో ఎదుర్కోబోయే సంఘటనలను లేదా చోటు చేసుకోబోయే అనూహ్యమార్పులను గురించి సూచన లేదా సంకేతం ఇవ్వడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నట్లు అర్ధం. ఇక ఇప్పుడు మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు ? మీ మదిని ఎక్కువ పరీక్షపెట్టకుండా తరచూ మీరు చూసే లేదా పునరావృతమయ్యే సంఖ్యలు ఏమి తెలియజేస్తాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు 111 సంఖ్యను చూసారా ?

మీరు 111 సంఖ్యను చూసారా ?

ఈ 111 సంఖ్యను మీరు గనుక ఒకసారి కంటే ఎక్కువగా గనుక చూస్తే దేవదూతలు మీతో మాట్లాడటానికి లేదా సంభాషించడానికి ప్రయత్నిస్తున్నాయి అని అర్ధం. మీరు సానుకూల దృక్పధంతో వ్యవహరించాలని ఉన్నతమైన శక్తి నుండి సమాచారం వచ్చి ఉంటుంది మరియు మీ మనస్సు ఏమి కోరుకుంటోందో మీరు గట్టిగా అడగండి, ఎందుకంటే దేవదూతలు మీ కోరికలు వినడానికి మీ చుట్టూనే ఉంటాయి, అవి వింటుంటాయి కూడా. అంతేకాకుండా 11:11 అనే ఈ సంజ్ఞ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుందని చాలామంది నమ్మకం.

మీరు 222 అనే సంఖ్యను చూసారా ?

మీరు 222 అనే సంఖ్యను చూసారా ?

మీరు గనుక ఈ సంఖ్యను గనుక చూసినట్లయితే, గమ్యస్థానం చేరే దారిలో మీరు ఉన్నట్లు అర్ధం చేసుకోవాలి. మీ పై మీకు ఎప్పుడైతే అనుమానం లేదా అపనమ్మకం ఏర్పడుతుందో అటువంటి సమయంలో ఈ సంఖ్య ఎక్కువగా కనపడుతుందట. ఏ వ్యక్తులైతే కొద్దిగా అయోమయంలో ఉంటారో మరియు సరైన దారిలో ఉన్నామా లేదా అని విపరీతంగా ఆలోచిస్తుంటారో అటువంటి వ్యక్తులు కూడా ఈ సంఖ్యని తరచూ చూస్తుంటారు. అత్యున్నత శక్తి నుండి మీకు లభిస్తున్న హామీ ఇచ్చే సంజ్ఞ గా దీనిని స్వీకరించవల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. మీరు చేయవలసిందల్లా ఏమిటంటే, మీరు ఎదురుకోబోయే సమయంపై నమ్మకం ఉంచండి మరియు ఎప్పుడూ విశ్వాసంతో వ్యవహరించండి. ఏదైతే జరగాలో అదే జరుగుతుంది, ప్రతిది అలానే జరుగుతోంది అనే విషయాన్ని ఈ గుర్తు తెలియజేస్తుంది.

మీరు 333 అనే సంఖ్యను చూసారా ?

మీరు 333 అనే సంఖ్యను చూసారా ?

మీరు గనుక 333 అనే సంఖ్యను చూసినట్లయితే, మీ చుట్టూ ఉన్న శక్తి ఆ క్షణంలో ఎంతో అత్యున్నత స్థాయిలో ఉందని అర్ధం. మీ చుట్టూ ఉన్న దేవదూతలు మరియు శక్తులు మీ కోసం, మీరు కోరుకున్నట్లుగా, మీకు అనుకూలంగా విపరీతంగా పనిచేస్తున్నాయి మరియు మీ కలలు నిజమవ్వడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి అని ఇది తెలియజేస్తుంది.

మీరు 444 అనే సంఖ్యను చూసారా ?

మీరు 444 అనే సంఖ్యను చూసారా ?

ఈమూడు నాలుగులు మీ లోపల ఉన్న జ్ఞానాన్ని తెలియజేస్తాయి. ఏ వ్యక్తి అయినా ఈ సంఖ్యను తరచుగా ఒకానొక సందర్భంలో చూసినట్లయితే, మీరు మీ యొక్క అభిరుచిని మనస్ఫూర్తిగా అనుసరించాలని మరియు ఎట్టిపరిస్థితుల్లోనూ పట్టువిడవకూడదని సూచిస్తుంది. కష్టపడి పనిచేయడం మరియు మీరు నమ్మిందాని కోసం, కట్టుబడి అందుకు అనుగుణంగా విపరీతంగా కృషి చేయడం వల్ల, మీ కలలకు చేరువవ్వడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

మీరు 555 అనే సంఖ్యను చూసారా ?

మీరు 555 అనే సంఖ్యను చూసారా ?

ఈ సంఖ్యను మీరు తరచూ గనుక చూస్తున్నట్లైతే, మీ జీవితంలో త్వరలో చోటుచేసుకోబోయే అతిముఖ్యమైన మార్పుకు సన్నద్ధం అయ్యేవిధంగా దేవదూతలు మిమ్మల్ని తయారు చేస్తున్నాయి. ఈ మార్పు అనేది సానుకూల దృక్పధ శైలిలో ఉంటుంది మరియు మీ జీవితంలో ఉండే పెద్ద విషయాలలో అసలు ప్రయోజనం చేకూరే విధంగా, ఆ వైపుగా మిమ్మల్ని ఒక్క అడుగుకు చేరువ చేస్తుంది. ఇది అత్యున్నత శక్తి నుండి వస్తున్న ధ్రువీకరణ, ఈ మార్పు మీకు ఎంతో మంచి చేస్తుంది, కాబట్టి ఆలింగనం చేసుకోండి.

మీరు 666 అనే సంఖ్యను చూసారా ?

మీరు 666 అనే సంఖ్యను చూసారా ?

సాధారణంగా కంటే కూడా ఎక్కువగా గనుక ఈ సంఖ్యను తరచుగా కంటే కూడా ఎక్కువగా గనుక చూస్తున్నట్లైతే, మీ జీవితంలో సమతుల్యత లోపించిందని, ఆ సమతుల్యతను తిరిగి తెచ్చుకోవాలి అనే విషయాన్ని మీరు అర్ధం చేసుకోవాలి. మీరు చాలా చిన్న విషయాలలో మరియు సందర్భాల్లో కూడా మీ ఆలోచన ధోరణి ఎంతో నిర్లక్ష్యంగా ఉంటోందని ఇది సూచిస్తుంది. చాలా ఎక్కువ సమయం విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ సంఖ్యను గనుక మీరు తరచూ చూస్తున్నట్లైతే, మీ ఆలోచనలలో సమతుల్యతను సాధించడానికి ఏదైనా మార్గాన్ని కనుక్కోవాలని మరియు ఏదైతే అవసరమో వాటిపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇది సూచిస్తుంది.

మీరు 777 అనే సంఖ్యను చూసారా ?

మీరు 777 అనే సంఖ్యను చూసారా ?

మీరు గనుక ఈ సంఖ్యను చూసినట్లయితే, మీరు మీ యొక్క కృషికి గాను తగిన ప్రతిఫలాన్ని ఆ అత్యున్నత శక్తులు ఇస్తున్నాయని అర్ధం. ప్రస్తుతం ఉన్న మీ జీవిత స్థితిగతులను మెరుగుపడతాయని మరియు మీకు మంచి చేకూరుతుందని ఇది చెబుతుంది. ఎదో ఒక తెలియని దైవత్వం మిమ్మల్ని దిశా నిర్దేశం చేస్తుంది అని ఈ సంజ్ఞ సూచిస్తుంది.

మీ జాతకం ప్రకారం మీ పేరులో అదృష్టం తెలుసుకోవడం ఎలా

మీరు 888 అనే సంఖ్యను చూసారా ?

మీరు 888 అనే సంఖ్యను చూసారా ?

ఈ సంఖ్య ఆనందానికి గుర్తుగా నిలుస్తుంది. కొలవలేనంత శక్తి, జ్ఞానం, ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు అభివృద్ధిని ఇది సూచిస్తుంది. మీరు ఈ సంఖ్యను గనుక తరచూ చూస్తున్నట్లైతే మీరు చేయవలసిందల్లా ఏమిటంటే, మీ గుండె తలుపులు తెరిచి, మీ ప్రయాణంలో ఏవైతే మీకు లభిస్తాయో వాటిని ఆనందంగా స్వీకరించండి. అంతేకాకుండా ఎంతో కృతజ్ఞతా భావంతో ఆలింగనం చేసుకోండి.

మీరు 999 అనే సంఖ్యను చూసారా ?

మీరు 999 అనే సంఖ్యను చూసారా ?

అంకెలలో 9 అనే అంకె చివరిది. ఒక పరిపూర్ణ చక్రం పూర్తి అవడాన్ని ఇది సూచిస్తుంది. మీరు గనుక ఈ సంఖ్యను చూసినట్లైతే, మీరు ఏ పనైతే చేస్తున్నారో లేదా మీరు ఏ విషయం కోసం అయితే విపరీతంగా వెతుకుతున్నారో వాటన్నింటికి సరైన దారి దొరుకుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు మీ కోరికలను తీర్చుకొనే దారిలో ఉన్నారనే విషయాన్ని ఇది సూచిస్తుంది. కాబట్టి, మంచిఫలితాల కోసం అవి మీకు సానుకూలంగా ఉండటానికి కొంత సమయం ఎదురుచూడవల్సి ఉంటుంది.

మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఎప్పుడైనా ఈ సంఖ్యలను చూసారా ? ఒకవేళ చూసినట్లయితే మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఉత్తేజపరిచే వార్తలతో అలరిస్తూనే ఉంటుంది మా వెబ్ సైట్.

Read more about: life లైఫ్
English summary

Hidden Meaning Behind Numbers

We bet, you would have seen these numbers couple of times as well…