120 మంది భార్యలు, 203 పిల్లలకు తండ్రి, నాటు వైద్యుడి రాసలీలలు వింటే దిమ్మతిరిగి!

Posted By:
Subscribe to Boldsky

అల్ప విధ్వాంస్తుడు మహాగర్వం కలవాడు అనే సంస్కృత పదానికి ఓ ఉదాహరణ ఇక్కడ ఉంది. గ్రంధం చదవడం గొప్ప కాదు, అందులోని సారాంశం అర్థం చేసుకోవడం గొప్పతనం అంటారు పెద్దలు. పూర్వం రాజులు యుద్దాలు చేసిన సమయంలో ప్రత్యర్థులను అంతం చేసి వారి భార్యలను ఎత్తు కొచ్చేవారని అక్కడక్కడ విన్నాం. ప్రత్యర్థుల భార్యలను ఎత్తుకు వచ్చిన తరువాత వారితో కాపురం చెయ్యడం, కోరిక తీరిపోయిన తరువాత బానిసలుగా చేశారని చరిత్ర చెబుతోంది.

ఇస్లాం మతంలో మూడు సార్లు తలాఖ్ చెప్పి భార్యకు విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇస్లాం ధర్మం ప్రకారం వారి ఆర్థిక స్థోమతకు అనుగుణంగా నలుగురు మహిళలను వివాహం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే ఇస్లాం మతం చట్టం అడ్డంపెట్టుకుని నైజీరియాలో ఓ వ్యక్తి ఏకంగా 120 మంది మహిళలను వివాహం చేసుకున్నాడు. అక్షరాల 203 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. ఆయన గారిని ఇస్లాం మతం పెద్దలు వారి మతం నుంచి బహిష్కరించి ఫత్వా జారీ చేశారు. అయినా ఆయన గారు ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యలేదు. తనకు ఎంత మంది భార్యలు ఎక్కువ అయితే అంత మంచిది అంటూ ఆయన తన దారిలోనే వెళ్లాడు. ఆయన గారి చరిత్ర మీరే చదవండి.

1. నాటు వైద్యుడు అంటూ చికిత్స కోసం వస్తే

1. నాటు వైద్యుడు అంటూ చికిత్స కోసం వస్తే

నైజీరియాకు చెందిన వ్యక్తి తన దగ్గర నాటు వైద్యం చేయించుకోవడానికి వచ్చే మహిళలతో చనువుగా ఉండేవాడు. వారికి వైద్యం చేసి వ్యాధి నయం చేసేవాడు. అందుకు ప్రతిఫలంగా వారు డబ్బులు ఇస్తే తీసుకునే వాడు కాదు. తనను వివాహం చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చేవాడు.

2. దేవుడు ఆదేశించాడు అంటూ పెళ్లి చేసుకుంటాడు

2. దేవుడు ఆదేశించాడు అంటూ పెళ్లి చేసుకుంటాడు

వైద్యం చేయించుకున్న మహిళలను మిమ్మల్ని వివాహం చేసుకుంటానని వారికి చెప్పేవాడు. ఇంతకు ముందే మీకు పెళ్లి జరిగింది కదా అంటూ మహిళలు ప్రశ్నిస్తే దేవుడు మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకోవాలని ఆదేశించారని, నేను ఆదేశాలను పాటిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుంటున్నాడు. మాకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోవడానికి చాల ఇబ్బంది పడ్డామని ఆయన భార్యలు కొందరు స్థానిక మీడియాకు చెప్పారు.

3. ఫత్వా జారీ చేసిన మతపెద్దలు, అయినా పట్టించుకోలేదు

3. ఫత్వా జారీ చేసిన మతపెద్దలు, అయినా పట్టించుకోలేదు

నలుగురి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకున్నారని తెలుసుకున్న మత పెద్దలు నాటు వైద్యుడిని ఇస్లాం మతం నుంచి బహిష్కరించారు. ఆయనకు ఎలాంటి సహాయ సహకారాలు అందివ్వకూడదని ఫత్వా జారీ చేశారు. అయితే నాటు వైద్యుడు మాత్రం తన పద్దతి మార్చుకోలేదు. చికిత్స కోసం వచ్చే మహిళలను వరుసగా పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కంటూ వచ్చాడు.

4. 120 మందితో పెళ్లి 10 మందికి మాత్రమే విడాకులు

4. 120 మందితో పెళ్లి 10 మందికి మాత్రమే విడాకులు

నాటు వైద్యుడు 120 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. 203 మంది బిడ్డలకు తండ్రి అయ్యాడు. అయితే పెళ్లి చేసుకున్న 10 మంది మహిళకు మాత్రమే ఆయన తలాఖ్ చెప్పి విడాకులు ఇచ్చాడు. మిగిలిన 110 మంది భార్యలను, వారి పిల్లలను తన ఇంటిలోనే పెట్టుకున్నాడు.

5. అవకాశం వస్తే ఇంకా ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటా

5. అవకాశం వస్తే ఇంకా ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటా

తనకు అవకాశం వస్తే ఇంకా ఎంత మందినైనా పెళ్లి చేసుకుంటానని నాటు వైద్యుడు స్థానిక మీడియాకు చెప్పారు. అయితే ఆయన గారి దగ్గరకు వెలితే వైద్యం చేసి పెళ్లి చేసుకుంటారని భయపడిన మహిళలు రానురాను దూరం అయ్యారు.

6. సెంచురీ కోట్టాడు, చివరికి వికెట్ పడింది

6. సెంచురీ కోట్టాడు, చివరికి వికెట్ పడింది

120 మందిని పెళ్లి చేసుకుని సెంచరీ కొట్టిన నాటు వైద్యుడు 203 మంది పిల్లలకు తండ్రి అయ్యి డబుల్ సెంచురీ పూర్తి చేశాడు. చివరికి 93 ఏళ్ల వయస్సులో ఆనారోగ్యంతో ఆయన మరణించాడు. ఆ వయస్సులో కూడా ఆయన పెళ్లి చేసుకోవడానికి తాను సిద్దంగా ఉన్నానని చెప్పి ప్రంపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు.

English summary

Nigerian Muslim Man Who Had 120 Wives & 203 Kids!

This is one of the examples in which a Nigerian man misused the liberty of polygamy and married 120 women and bore 203 kids!
Story first published: Wednesday, June 21, 2017, 16:00 [IST]
Subscribe Newsletter