Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
ఆ దేశం లో మానభంగం చేసిన వాళ్ళను ఏమి చేస్తారో తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుంది
మనం ఉంటున్న సమాజంలో మానవ మృగాలు ఎంతో మంది ఉన్నారు . మహిళలను , అమ్మాయిలను , ఆడపిల్లలను ఎవరినైనా సరే , వావి వరస లేకుండా , మానవత్వం మరచి ,విలువలను గాలికి వదిలి ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్న ఎంతో మంది మన సమాజంలో ఉన్నారు . వాళ్లకు భయం లేదు , దానికి కారణం తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని వెన్నులో వణుకు పుట్టించే చట్టాలను మన ప్రభుత్వాలు ఇంకా రూపొందించలేదు .
అందు వల్లనే మన సమాజం లో , దేశం లో మానభంగం అనేది నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది . ప్రతి రోజు అలాంటి వార్తలను మన మీడియా లో చూస్తూనే ఉన్నాం. నిర్భయ ఘటన తరువాత నిర్భయ చట్టాలను మన ప్రభుత్వాలు తెచ్చినా వ్యవస్థలో మార్పు లేదు,రావటం లేదు .

మన సమాజంలో కూడా అమ్మాయిలను లైంగికంగా వేదించాలన్నా , వారిని మానభంగం చేయాలన్నా భయపడేలా ప్రస్తుతం మన దేశం లో చట్టాలు లేవని , మానభంగం చేయటం అనే విషయాన్ని చాలా తేలికగా తీసుకునే మన దేశం లో , ఇండోనేషియా లాంటి చిన్న దేశం లో అవలంభిస్తున్న కఠిన చట్టాలను మన దేశం లో కూడా రూపొందించాలని సూచిస్తున్నారు చాలా మంది కడుపు మండిన ప్రజలు.

ఇండోనేషియా లో ఏమి జరిగిందంటే....
మన దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన నిర్భయ లాంటి వ్యవహారం ఒకటి ఇండోనేషియా దేశం లో చోటుచేసుకుంది.14 సంవత్సరాల వయసున్న అమ్మాయిని 12 మంది దారుణంగా మానభంగం చేసారు . ఆ తరువాత ఆ అమ్మాయిని అతి కిరాతకంగా హత్య చేసారు . ఈ హృదయ విధారక సంఘటన జరిగిన తరువాత అక్కడి ప్రజలు, ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ దేశ అధ్యక్షుడిని కోరారు . ప్రజల కోరిక మేరకు కఠినమైన చట్టాలను రూపొందిస్తామని హామీ ఇచ్చారు ఆ దేశాధ్యక్షుడు.

ఆ దేశం లో రూపొందించిన కొత్త చట్టాలు మరియు వాటి నియమ నిబంధనలు....
ఎవరైతే మానభంగానికి పాల్పడతారో , అలాంటి వాళ్ళ లో మగతనం దెబ్బతినేలా ఆడవాళ్ళ హార్మోన్లను ఆయా వ్యక్తుల శరీరంలోకి ఎక్కిస్తారు , చేసిన నేరం , దాని తీవ్రతను బట్టి మరణ శిక్ష కూడా విధిస్తారు . ఒక వేళ ఆ వ్యక్తికి మరణ శిక్ష పడక పొతే ,ఆ నేరం చేసిన వాళ్ళ పేర్లను ప్రజలందరి ముందు బహిర్గత పరుస్తారట.అంతే కాకుండా నిరంతరం అతని కదలికలను తెలుసుకునేందుకు వీలుగా వాళ్ళ శరీరంలోకి ఒక ఎలక్ట్రానిక్ చిప్ ని అమరుస్తారట.

మన దేశం లో ఎప్పుడు..?
మహిళల పై జరిగే అకృత్యాలను అరికట్టడానికి ప్రపంచం లో ని చాలా దేశాల్లో ఎన్నో కఠినమైన చట్టాలు ఉన్నాయి . కానీ , స్త్రీలను దేవతలు గా భావించే మన దేశం లో , నిరంతరం మహిళల పై ఎన్నో దాడులు జరుగుతున్నా , కఠినమైన చట్టాలు లేకపోవటం గమనార్హం.

ఇండోనేషియా లాంటి చిన్న దేశాలలోనే
ఇండోనేషియా లాంటి చిన్న దేశాలలోనే నేరాలను అరికట్టడానికి అంత కఠినమైన చట్టాలు అవలంభిస్తున్నప్పుడు , మన దేశం లో కూడా తప్పు చేయాలంటే భయపడేలా చట్టాలు తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు.మరి మన దేశం లో ని ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు ఎప్పుడు వేస్తాయో చూడాలి.



Click it and Unblock the Notifications
