అసలు రహస్యం : ముస్లిం పురుషులు బహుభార్యత్వాన్ని కలిగి ఉండటాన్ని ఖురాన్ ఎందుకు అనుమతిస్తుంది ?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఇస్లాం లో బహుభార్యత్వాన్ని అనుమతించారు కానీ తప్పనిసరి చేయలేదు:

ఈ మధ్య కాలంలోనే గుజరాత్ ప్రధాన న్యాయస్థానం భారత దేశంలోని ముస్లిం సమాజంలో ఉన్న బహుభార్యత్వం అనే ఆచారాన్ని పూర్తిగా నిర్ములించాల్సిన అవసరం చాలా ఉందని ఎంతో గట్టిగా చెప్పింది.

120 మంది భార్యలు, 203 పిల్లలకు తండ్రి, నాటు వైద్యుడి రాసలీలలు వింటే దిమ్మతిరిగి!

' అతిక్రూరమైన పితృస్వామ్య ' విధానంగా దీనిని పేర్కొనింది. ఇలా ఏ సందర్భంలో చెప్పిందంటే, ఒక వ్యక్తి తన పై నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ ను తొలగించాల్సిందిగా ప్రధాన న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇతను తన మొదటి భార్య అనుమతిలేకుండా రెండవ పెళ్లి చేసుకోవడం జరిగింది. దీంతో మొదటి భార్య భర్త పై కేసు పెట్టింది.

1. ఇస్లాం లో బహుళ వివాహాలు :

1. ఇస్లాం లో బహుళ వివాహాలు :

కొన్ని సంవత్సరాలుగా ఖురాన్ లో చెప్పబడిన కొన్ని వ్యాఖ్యలను కొంతమంది స్వార్ధపూరితమైన వ్యక్తులు వాళ్లకు నచ్చినట్లు అన్వయించుకొని ఇస్లాం ప్రపంచంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే నిజంగా ఇస్లాం ని పాటిస్తున్నారో వారిని తప్పుదోవపట్టిస్తున్నారు. అంతే కాకుండా వారిని వెర్రి వాళ్ళను చేస్తూ చాలామందికి నొప్పి మరియు హానికలిగించడానికి ఇవి ఎంతగానో పరోక్షంగా దోహదపడుతున్నాయి. ఇప్పుడు మనం ఇంత సేపు మాట్లాడుకున్నది ఏ ఉగ్రవాదం గురించో జిహాద్ గురించో కాదు. బహుభార్యాత్వంలో ఉన్న నియమ నిబంధనల గురించి.

2. లింగభేదం చూపించడం :

2. లింగభేదం చూపించడం :

కొన్ని సంవత్సరాలుగా ముస్లిం పురుషులు వారి యొక్క భార్యలు పడే మానసిక వేదనను అర్ధం చేసుకోవడంలో విఫలమై పెడచెవిన పెట్టారు. వారి యొక్క స్వార్ధపూరితమైన ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటూ బహుళ వివాహాలు చేసుకుంటున్నారు. ఇలా చేసుకోవడం వారికి పుట్టుకుతో వచ్చిన ఒక హక్కుగా భావిస్తారు. నిజమే ఖురాన్ ముస్లిం పురుషులను బహుభార్యత్వాన్ని కలిగి ఉండటాన్ని అనుమతించింది. కానీ, ఖచ్చితంగా చేయాల్సిందే అని ఎక్కడ కూడా ఆదేశించలేదు. అది కూడా నాలుగు సార్లు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పింది. కానీ, చాలా విభిన్న చేయిదాటిపోయిన సందర్భాల్లో మాత్రమే ఇలా చేసుకోవచ్చని చాలా స్పష్టంగా పేర్కొనబడింది.

3. ఇలా చేయడం తప్పా లేక ఒప్పా ?

3. ఇలా చేయడం తప్పా లేక ఒప్పా ?

నిరంతరం జాగ్రత్త వహించు ప్రోఫెట్ ను అల్లా ఇలా ఒకరి కంటే మించి స్త్రీలను పెళ్లి చేసుకోవడాన్ని అనుమతించడం వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అంతేకాకుండా ఒకవేళ తాను గనుక పెళ్లి చేసుకున్న భార్యలందిరినీ సంరక్షించలేకపోయినా, బాగా చూసుకోలేకపోయినా మరియు అందరికీ సమానంగా ప్రేమని పంచలేకపోయినా ఒకరికి మించిన భార్య ఉండకూడదని అల్లా సూచించారు. ఇప్పుడు మనం ఏ ఏ సందర్భాల్లో ముస్లిం పురుషులు ఒక్కసారి కంటే ఎక్కువగా పెళ్లిచేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగిందో తెలుసుకుందాం.

4. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి :

4. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి :

ఏ స్త్రీ యొక్క భర్త అయితే యుద్ధ రంగంలో మరణిస్తాడో లేదా ఎవరైతే చాలా దుర్భర పరిస్థితుల్లో జీవిస్తుంటారో అటువంటి వారికీ సహాయం చేసి సంరక్షించే ఉద్దేశ్యంతో, వారిని ఆపద నుండి కాపాడటానికి ముస్లిం పురుషులు ఆ స్త్రీ ని పెళ్లి చేసుకోవచ్చు.

రావణుడి భార్య మండోదరి జీవితం గురించి భయంకర వాస్తవాలు..!

5. వారసుడు లేకపోతే :

5. వారసుడు లేకపోతే :

కుటుంబానికి కావాల్సిన వారసుడికి జన్మ నివ్వడంలో ఒకవేళ మొదటి భార్య గనుక విఫలమైతే, అటువంటి సమయంలో తన భార్యని కాకుండా వేరొక స్త్రీ ని పెళ్లిచేసుకోవచ్చు. కానీ, పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు స్త్రీలను సమానంగా చూసుకోవాలి, వారికి సమన్యాయం చేయాలి.

6. వ్యభిచారాన్ని నివారించేందుకు :

6. వ్యభిచారాన్ని నివారించేందుకు :

ఖురాన్ ప్రకారం " మీకు గనుక అనాధ బాలికలతో వ్యవహరించలేరు అనే భయం గనుక మీలో ఉంటే, మిమ్మల్ని ఏ మహిళలు అయితే సంతోషపెట్టగలరో అటువంటి వారిని ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురుని పెళ్లిచేసుకోవాలి. కానీ మీరు న్యాయం చేయలేరు అని భయపడుతుంటే మాత్రం వారిలో ఎవరో ఒకర్ని మాత్రమే పెళ్లిచేసుకోండి. ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీకు ఎవరైతే నప్పుతారని మీరు భావిస్తారో వారిని పెళ్లిచేసుకోండి, కానీ చేసుకున్న వాళ్లకు మాత్రం అన్యాయం చేయకండి."

English summary

Real reasons why Quran permits Polygamy to Muslim men

Here are some real reasons why Quran permits Polygamy to Muslim men. Take a look...
Please Wait while comments are loading...
Subscribe Newsletter