మరణించిన బాయ్ ఫ్రెండ్ తో స్నాప్ చాట్ లో ఫోటోలు తీసుకున్న అమ్మాయి

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ప్రేమలో ఉండటం అనే విషయం ఎవ్వరికైనా ఒక మధురానుభూతిని కలిగిస్తుంది. ఆలా ప్రేమలో ఉన్నప్పుడు అన్ని విషయాలు ఖచ్చితత్వంతో ఎప్పుడు ఎలా కావాలంటే అలా , ఎప్పుడు ఏది జరగాలంటే అది జరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ మీ భాగస్వామి అకస్మాతుగా మరణించారు అనే విషయం తెలియగానే ఏమవుతుంది ?

మీరు ఒక ఉదయం ఎప్పటిలాగానే నిద్ర లేస్తారు. కానీ ఈ ప్రపంచంలో మీరు ప్రేమించే వ్యక్తి లేరు, ఇంకెప్పటికీ తిరిగి రారు అనే విషయాన్ని గుర్తించినప్పుడు గుండె ఖచ్చితంగా బరువెక్కుతుంది.

బ్యాగ్రౌండ్ ఫెయిల్ అయిన కొన్ని ఫన్నీ ఫోటోలు..

ఒక అమ్మాయి ప్రియుడు అకస్మాత్తుగా మరణించాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి విషయంలో ఏమి జరిగిందంటే, తాను ఎంతో ప్రేమించే బాయ్ ఫ్రెండ్ తో అన్నింటి కంటే ఒక ప్రియమైన పని చేసింది. అదే మిటంటే వాళ్లిద్దరూ కలిసున్న చిత్రాలను స్నాప్ చాట్ లో అప్ లోడ్ చేసింది. గుండెల్ని పిండేసే కథ మీకోసం...

ఈ జంట పిచ్చిగా ప్రేమలో ఉన్నారు ఎంతగానంటే చెప్పలేనంతగా:

ఈ జంట పిచ్చిగా ప్రేమలో ఉన్నారు ఎంతగానంటే చెప్పలేనంతగా:

విలీరీ డెలోస్ సాంటోస్ మరియు జాన్ రేయ్ సాక్ అకైన్ అనే వీరిద్దరూ ఒక యువ జంట, పిచ్చిగా ప్రేమలో ఉన్నారు, విడదీయలేనంతగా దగ్గర అయ్యారు. ఒక ఉదయం విలీరీ డెలోస్ సాంటోస్ కి రేయ్ కుటుంబం నుండి ఫోన్ వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఏమని చెప్పారంటే అతడు మరణించాడు అనే వార్తను ఆమెకు చెప్పారు.

ఆమె నిజం అని నమ్మలేదు:

ఆమె నిజం అని నమ్మలేదు:

నిజంగానే ఆమె నిజం అని నమ్మలేదు. ఆమె ఇదేదో ఊరికే చెబుతున్నారని, ఆమెతో పరాచకాలాడుతున్నారని అనుకుంది. ఆమె ఏది విన్నదో అది నమ్మే స్థితిలో లేదు. ఆ అమ్మాయి తన ప్రియుడి ఇంటికి వెళ్ళింది. అక్కడికి వెళ్లిన తరువాత అతను మరణించి ఉండటం చూసి ఆ విషయాన్ని నమ్మింది. ఇక తాను ప్రేమించిన వ్యక్తి ఎప్పటికీ తన దగ్గరకు రాడని, అతనిని జీవితాంతం కోల్పోయాను అని గుర్తించింది. అసలు నాకు చివరిసారిగా వెళ్ళిపోతున్నాను అనే విషయాన్ని కూడా చెప్పకుండా ఎలా అతడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని ఆ అమ్మాయి ఆశ్చర్యంగా ఆలోచించడం ప్రారంభించింది.

ఈజిప్షియన్ ఆలయంలో నగ్నంగా ఫొటోస్ తీసుకుంటూ అడ్డంగా కెమెరాకి చిక్కిన మోడల్ & ఫోటోగ్రాఫర్!

ఆమె ఏమి చేసిందంటే :

ఆమె ఏమి చేసిందంటే :

అతని శవ పేటిక వద్ద కూర్చొని గుండెలు అలిసేలా విపరీతంగా ఏడ్చింది. వాళ్ళు ఇద్దరు ఎంత ఘాడంగా ప్రేమించుకున్నారు అనే విషయాలను మరియు స్నాప్ చాట్ ద్వారా చిత్రాలను తీసుకోవడాన్ని ఇద్దరు ఎంతగా ఇష్టపడేవారు అని గుర్తుతెచ్చుకోవడం మొదలుపెట్టింది. చివరి జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవడం కోసం మరణించిన తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫోటోలను తీసుకోవడం మొదలు పెట్టింది. దీనిని చూసిన చుట్టుప్రక్కల అందరూ కన్నీటి పర్యంతమయ్యారు.

ఆమె చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది :

ఆమె చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది :

ఆమె ఇలా తీసుకున్న చిత్రాలను సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది అంతేకాకుండా చాలా విషయాలను అక్కడ రాయడం మొదలుపెట్టింది. వాళ్ళు ఇద్దరూ ఎంతగా ప్రేమించుకునే వాళ్ళు, తాను అతడిని ఎంతగా ప్రేమించేది ఇలా ఎన్నో విషయాలను రాసుకొచ్చింది. తన ప్రియుడికి ఫోటోలు తీసుకోవడం అంటే ఎంతో ఇష్టమని, అందుకే చివరి క్షణాల్లో అతడు మరణించిన తరువాత తాను ఎంతో ఇష్టపడే విధంగా ఫోటోలను తన పక్కన ఉండి తీశానని, అతనికి నచ్చిన పని చేసానని చెప్పుకొచ్చింది.

అతడు మరణించడానికి కారణం ఏమిటంటే :

ఆమె ఇలా చాలా విషయాలను రాసుకొచ్చింది కానీ, అతడు ఎందుకు మరణించాడు అనే విషయం ఇప్పటికీ ఎవ్వరికి తెలియదు. కానీ ఆ పోస్ట్ ప్రకారం తెలుస్తున్న విషయం ఏమిటంటే, అతడు ఆకస్మికంగా మరణించాడు అని అర్థం అవుతుంది.

ఇది చూసిన చాలా మంది వాళ్లిద్దరూ మరి కొద్దీ రోజులు కలిసి ఉంటే బాగుణ్ణు అని అనుకున్నారు.

English summary

Girl Took Snapchat Pics With Her Dead Boyfriend

This is what happened in this girl's case and she did the most dearest thing that her boyfriend loved doing and that was nothing but updating Snapchat pictures of them together... Here is their heart-wrenching story...
Story first published: Monday, October 16, 2017, 12:00 [IST]