జనవరి 6 వరకు కొన్ని రాశుల వారిని అదృష్టం వెంటాడుతుంది

Written By:
Subscribe to Boldsky

జనవరి 6, 2018 వరకు కొన్ని రాశులపైన బుధుడు ప్రభావం చూపనున్నారు. కొన్ని రాశుల వారికి అనుకూలంగా, మరికొన్ని రాశుల వారికి ప్రతికూలంగా బుధుడు ప్రభావం చూపనున్నాడు. కొన్ని రాశులకు అనుకూలంగా గ్రహాలుంటాయి. దీంతో వారు ఏం చేసినా అంతా మంచే జరుగుతుంది. వారు లాభాల బాటలో పయనిస్తారు. అయితే కొన్ని రాశుల వారు మాత్రం కాస్త ఇబ్బందులుపడాల్సి వస్తుంది. మరి మీ రాశిపై గ్రహాల ప్రభావం ఎలా ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి.

మేషం: మార్చి 21-ఏప్రిల్ 19 *

మేషం: మార్చి 21-ఏప్రిల్ 19 *

మేషరాశి వారికి అనుకూలంగా బుధుడు ఉంటాడు. అందువల్ల వీరికి ఎలాంటి ఇబ్బందులు రావు. జనవరి 6,2018 వరకు వీరికి తిరిగి ఉండదు. ఆర్థికంగా వీరు ఈ కొద్ది రోజుల్లో చాలా లాభాలు చూస్తారు. ఎన్నో రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న పనులు మొత్తం కూడా పూర్తి చేస్తారు. అందువల్ల మేషరాశి వారికి జనవరి 6, 2018 వరకు అసలు తిరుగుండదు.

వృషభం: ఏప్రిల్ 20-మే 20 *

వృషభం: ఏప్రిల్ 20-మే 20 *

ఈ రాశి వారికి కూడా అనుకూలంగా గ్రహాలుంటాయి. అందువల్ల మీరు చేపట్టబోయే పనులకు ఎలాంటి ఆటంకం ఉండదు. మిమ్మల్ని జనవరి 6, 2018 వరకు అదృష్టం వెంటాడుతుంది. మీర ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందుతారు. మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి లేదా మీ దగ్గరి బంధువు త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఇది కూడా మీకు ఎంతో సంతోషాన్ని కలిగించే వార్తనే. అయితే మీరు అనవసరమై ఖర్చులను తగ్గించుకోవాలి. దీని వల్ల మీరు కాస్త ఇబ్బందులుపడాల్సి వస్తుంది.

మిథున రాశి : మే 21- జూన్ 20 *

మిథున రాశి : మే 21- జూన్ 20 *

బుధుడి అనుగ్రహం ఈ రాశి వారిపై ఉంటుంది. అందువల్ల వీరు చేపట్టబోయే ప్రతి పని విజయవంతం అవుతుంది. అయితే మీకు సంబంధం లేని విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఇక మీరు జనవరి 6, 2018 వరకు ఎలాంటి పని చేపట్టిన విజయవంతమే. మీకు అనుకూలంగా గ్రహాలున్నాయి కాబట్టి మీరు ఏ రంగంలోనైనా సరే ధైర్యంగా ముందడుగు వేయండి.

కర్కాటకం : జూన్ 21- జూలై 22 *

కర్కాటకం : జూన్ 21- జూలై 22 *

ఈ రాశి వారు కూడా అనుకున్న పనులను సాధిస్తారు. జనవరి 6, 2018 వరకు వీరికి అనుకూలంగా గ్రహాలుంటాయి. మీరు మీ కెరీర్ పరంగా, మీ వ్యాపారం పరంగా, మీరు ఉండే రంగంలో మంచి లాభాలు సాధిస్తారు. మీరు ప్రస్తుతం ప్రతి క్షణం ఆనందంగా గడపవచ్చు. మీకు ఈ కొన్ని రోజులు ఏ విషయంలో కూడా తిరుగుండదు. మీరు మీ జీవిత భాగస్వామి విషయంలో చాలా ఆనందంగా ఉంటారు. అయితే కొన్ని రకాల గొడవలు వచ్చే అవకాశం ఉంది. వాటి విశయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి.

సింహరాశి : జులై 23-ఆగస్టు 23*

సింహరాశి : జులై 23-ఆగస్టు 23*

ఈ రాశి వారు కూడా వారి రంగాల్లో ఈ కొద్ది రోజుల్లో చాలా లాభాలు చూస్తారు. వీరు జనవరి 6, 2018 వరకు చాలా విషయాల్లో ప్రయోజనాలు పొందుతారు. వీరు ప్రతి విషయంలో ఆనందంగా ఉంటారు. మీకు ఈ కొన్ని రోజులు తిరుగులేదు. అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

కన్య: 24 ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 23

కన్య: 24 ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 23

ఈ రాశివారిపై గ్రహాల ప్రభావం అంతంగా ఉండదు. వీరికి మరీ అంతగా ఆనందించే విషయాలుగానీ, బాధ కలిగించే విషయాలుగానీ ఉండవు. వీరిపై మధ్యస్తంగా ప్రభావం ఉంటుంది. అయితే వీరు ఊహించని విషయాలను చూడాల్సి వస్తుంది.

తుల: సెప్టెంబర్ 24 అక్టోబర్ 23

తుల: సెప్టెంబర్ 24 అక్టోబర్ 23

ఈ రాశి వారిపై బుధ గ్రహం ప్రభావం ఉంటుంది. అందువల్ల వీరు చేపట్టే బోయే పనులు కాస్త విజయవంతం అవుతాయి. వీరు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి. వ్యర్థమైన ఖర్చులు చేయకుండా మంచిది.

వృశ్చికం: అక్టోబర్ 24-నవంబర్ 22

వృశ్చికం: అక్టోబర్ 24-నవంబర్ 22

ఈ రాశివారిపై కూడా బుధుడి ప్రభావం ఉంటుంది. అయితే వీరు కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరు కుటుంబ సభ్యులతోగానీ, బంధువుల వల్లగానీ కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటారు. వీరు ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ధనుస్సు: నవంబర్ 23- డిసెంబర్ 22

ధనుస్సు: నవంబర్ 23- డిసెంబర్ 22

మీరు మీ రంగంలో విజయాలు సాధిస్తారు. మీరు లాభాల బాటలో పయనిస్తారు. మీరు పలువురి నుంచి ప్రశంసలు కూడా కోరుకుంటారు. మీరు కొన్ని రకాల ప్రయాణాలు కూడా సాధిస్తారు.

మకరం: డిసెంబర్ 23- జనవరి 20

మకరం: డిసెంబర్ 23- జనవరి 20

వీరు కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటారు. వీరు చేపట్టేబోయే పనులు కూడా కొన్ని విజయవంతం కావు. అయితే కొన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఈజీగా సమస్యలను అధిగమిస్తారు.

కుంభం : జనవరి 21- ఫిబ్రవరి 18

కుంభం : జనవరి 21- ఫిబ్రవరి 18

మీరు కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు అనారోగ్య సమస్యలకు గురై అవకాశం ఉంది. అలాగే మీ ఇంట్లో పిల్లలు కూడా అనారోగ్య సమస్యల బారిన పడొచ్చు. అలాగే మీ రంగంలో మీరు కొన్ని రకాల ఇబ్బందులకు గురి కావొచ్చు. అందువల్ల మీరు ఈ కొంతకాలం పాటు జాగ్రత్తగా ఉండాలి.

మీనం : ఫిబ్రవరి 19-మార్చి 20

మీనం : ఫిబ్రవరి 19-మార్చి 20

ఈ రాశి వారు కొన్ని రకాల ప్రశంసలు పొందుతారు. మీరు రచనలు చేస్తున్నట్లయితే మీరు చాలా మంది పెద్ద వారి నుంచి త్వరలోనే మెప్పును పొందుతారు. అలాగే విద్యాపరంగా కూడా మీరు రాణిస్తారు.

మీరు త్వరలో ఆర్థికంగా లాభాలు చూస్తారు.

కొన్ని కారణాల వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది. మీరు సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీర మీకు సంబంధించిన వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ అమ్మగారి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి.

English summary

these zodiac signs will remain affected until january 6

These Zodiac Signs Will Remain Affected Until January 6th!!