వీసాని పొందటం కోసం ప్రజలు సందర్శించే దేవాలయం

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

విదేశాలకు వెళ్ళడం చాలా మందికి ఒక కల, కానీ చాలా సమయాల్లో, ఆ కల - కలగానే ఉండిపోతుంది. చాలామంది ప్రజలు తమ వీసా అనుమతిని పొందకపోవటానికి అడ్డంకులను ఎదుర్కొంటారు.

మీరు భారతీయుడైనట్లైతే, చింతించకు మిత్రమా ! మీ కోసం కొన్ని ప్రత్యేక దేవాలయాలు ఉన్నాయి. ఇలాంటి దేవాలయాలలో, ఒకదానిలో ప్రార్ధనలను చెయ్యడం వలన వీసా క్లియరెన్స్ కి తప్పనిసరిగా మీకు సహాయం చేస్తుంది.

ఇండియాలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాలు!

కాబట్టి, మీరు దేని కోసం వేచి ఉన్నారు ? చిల్కుర్లో ఉన్న "వీసా బాలాజీ" ఆలయం గురించి మరింత ఆసక్తికరమైన వివరాలను తెలుసుకోండి.

ఈ ఆలయం గురించి :

ఈ ఆలయం గురించి :

ఈ ప్రసిద్ధ ఆలయంలో, ప్రధాన దేవుడిగా వెంకటేశ్వర స్వామి కొలువైయున్నాడు. అతనిని "వీసా మంజూరు బాలాజీ" అని కూడా పిలుస్తారు! ఈ పురాతన ఆలయం ఒస్మాన్ సాగర్ సరస్సు ఒడ్డున ఉంది.

ఈ ఆలయం వెనక గల చరిత్ర :

ఈ ఆలయం వెనక గల చరిత్ర :

1980 లో, చెన్నై US వీసా కాన్సులేట్లో తిరస్కరణకు గురైన విద్యార్ధులు, ఈ ప్రదేశాన్ని సందర్శించి ప్రార్ధించారు. అలా వారి అదృష్టం బాగుండి వారి కోరికలు నెరవేరాయి. అప్పటి నుండి ఈ దేవాలయం; సులభమైన ప్రక్రియ ద్వారా అమెరికన్ వీసా మంజూరు అయ్యేటట్లుగా ప్రసిద్ధి పొందింది.

ఇండియన్ బిలీనియర్స్ కంటే ఎక్కువ ధనం ఉన్న ఆలయాలు

ఇది ఎలా పని చేస్తుంది?

ఇది ఎలా పని చేస్తుంది?

ఈ ఆలయంలో దేవుని ఆశీస్సులు పొందాలంటే దానికి ఒక ప్రత్యేక మార్గం ఉంది. మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్లే ముందు, చిల్కుర్ వీసా బాలాజీ ఆలయాన్ని సందర్శించాలి. అలా దేవుడిని దర్శించుకున్న తర్వాత భక్తులందరిలానే అతను కూడా 3 సార్లు ప్రదక్షిణలు (ఆలయం చుట్టు తిరగాలి) చేసి వెళతాడు. వీటితో పాటుగా, వీసా పొందిన తరువాత వారు తిరిగి ఆలయానికి వచ్చి, ఆలయం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చెయ్యాలి. ఇలా ఈ వీసా దేవునికి కృతజ్ఞత చూపించడానికి ఇదోక మార్గం.

ఇక్కడ డబ్బు గూర్చి కాదు :

ఇక్కడ డబ్బు గూర్చి కాదు :

ఈ దేవాలయాన్ని సందర్శించటం ఉచితం, ఇక్కడ అన్ని సేవలకు ఉచితంగా ఉంటుంది. ఆలయం ఎవరి దగ్గరనుంచైనా, ఏ విధంగానైన డబ్బును తీసుకోకూడదు అనేమైన కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అత్యంత ప్రజాదరణ పెరుగుతున్న అద్భుతమైన దేవాలయాలలో ఇది ఒకటి.

English summary

Temple Where People Pray To Get Visa Clearance

God of Visa? Are you applying for the US visa? May be this can help!
Story first published: Sunday, September 3, 2017, 16:00 [IST]
Subscribe Newsletter