For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీరు పుట్టిన నెలను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పే పూలు

  By Y .BHARATH KUMAR REDDY
  |

  మీరు ఏ నెలలో జన్మించారో దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఏమిటో చెప్పొచ్చు. అయితే జాతకాల ఆధారంగా కాదు. మనిషి జీవితం మొత్తం అతని నడతపై ఆధారపడి ఉంటుంది అనుకుంటారు. అయితే, ఇది కొంత వాస్తవం కావొచ్చు కానీ పూర్తిగా నిజం మాత్రం కాదు. మనిషి పుట్టిన నెల కూడా వారి జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక్కో నెలలో పుట్టిన వారికి ఒక్కో పువ్వులో ఉండే లక్షణాలుంటాయి. మరి మీరు ఏ నెలలో జన్మించారో ఆ నెలకు సంబంధించి ఒక పువ్వుపేరును కూడా మేము ఇస్తున్నాం. ఆ పువ్వు సుగుణాలు మీలో ఉంటాయి. అలాగే మరికొన్ని లక్షణాలను మీరు కలిగి ఉంటారు. మరి మీరు జన్మించిన నెలలను బట్టి ఆ పువ్వులేమిటి, మీ వ్యక్తిత్వం ఏమిటో ఒక్కసారి చూద్దామా.

  1. జనవరి - కార్నేషన్ ఫ్లవర్

  1. జనవరి - కార్నేషన్ ఫ్లవర్

  కార్నేషన్ పూలు ప్రేమ, అభిమానం, ప్రశంసలకు చిరునామాగా ఉంటాయి. జనవరిలో పుట్టిన వారు మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు.

  అయితే వీరిని తోటివారు ఎక్కువగా అర్థం చేసుకోలేరు. అంతేకాదు సమాజంలోని నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడమనేది వీరికి అంతగా నచ్చదు. వీరు మంచి కళాత్మక భావనతో ఉంటారు. అలాగే వీరిలో కవిత్వం కూడా ఎక్కువే. అందుకే వీరిని చాలామంది ఇష్టపడతారు. అయితే కొందర్ని మాత్రం వీరు అంతగా ఆకట్టుకోలేరు.

  2. ఫిబ్రవరి - వైలెట్

  2. ఫిబ్రవరి - వైలెట్

  ఫిబ్రవరిలో పుట్టిన వారికి వైలెట్ పువ్వు నిదర్శనం. ఈ నెలలో పుట్టిన వారు లాజిగ్గా వ్యవహరిస్తారు. వీరి వ్యక్తిత్వం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఏ పని చేయకున్నా కూడా మేము బిజీగా ఉన్నామని చెప్పే స్వభావం కలవారు. అయితే ఏ సమస్యనైనా పరిష్కరించే నేర్పు వీరికి ఉంటుంది.

  3. మార్చి - డాఫోడిల్

  3. మార్చి - డాఫోడిల్

  ఏదైనా కొత్తగా ప్రారంభం కావడం వంటి విషయాలకు ఈ పుష్పం సింబాలిక్ గా ఉంటుంది. ఈ నెలలో జన్మించిన వారు డాఫోడిల్ లాంటి వారు. వీరిలో వివిధ నైపుణ్యాలుంటాయి. ఇతరులకు కూడా వీరు ఆదర్శంగా ఉంటారు. ఇతరుల విషయంలో చాలా ఆత్మీయంగా, ఆప్యాయంగా వ్యవహరిస్తారు. వీరిని నమ్మినవారిని ఎప్పటికీ మోసం చేయరు. చాలా నిజాయితీగా ఉంటారు. అయితే వీరు చేస్తున్న పనిపై అంతగా నమ్మకం పెట్టుకోరు. అదొక్కటే వీరిలో ఉండే మైనస్ పాయింట్. డాఫోడిల్ మాదిరిగానే వీరి అంతర్గతం కూడా చాలా అందంగా ఉంటుంది. చాలా సున్నితమనస్కులు.

  4. ఏప్రిల్ - స్వీట్ పీ

  4. ఏప్రిల్ - స్వీట్ పీ

  ఈ పుష్పం ఆనందకరమైన విషయాలకు సూచికగా ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వారు సంతోషంగా ఉంటారు. వీరు తమకుతాము చాలా మంచివాళ్లమని భావిస్తూ ఉంటారు. అలాగే వాళ్లలో వాళ్లే ఎక్కువగా ఆశ్చర్యానికి లోనవుతుంటారు. అయితే వీరి ఎప్పుడూ పక్కవారితో ఆనందంగా గడుపుతుంటారు. వీరి చుట్టూ ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది.

   5. మే - లిల్లీ

  5. మే - లిల్లీ

  ఈ పువ్వు మానవత్వం, పవిత్రత, స్వచ్ఛతవంటి విషయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. ఈ నెలలో జన్మించినవారు లిల్లీ పువ్వుల మాదిరిగానే మంచి మనస్సు కలిగి ఉంటారు.

  వీరు కొద్దిసేపు ఎంతో బాగుంటారు. అయితే అంతలోపే విచారంగా మారిపోతారు. తమలో తామే ఎక్కువగా బాధపడుతుంటారు. వారిలో వారే కుమిలిపోతుంటారు. డిప్రెషన్ కు గురవుతుంటారు.

  ఊహించని పరిణామాలు ఏర్పడినప్పుడు వీరు ఎక్కువగా బాధపడతారు. అయితే ఆ విషయాన్ని ఎక్కువగా ఎవ్వరికీ చెప్పరు. కానీ వారిని ప్రేమించే వారు మాత్రం ఈజీగా ఈ సమస్యను కనుక్కోవొచ్చు.

  6. జూన్ - రోజాపూలు

  6. జూన్ - రోజాపూలు

  రోజా పువ్వులు మనకు ఎప్పుడూ దొరుకుతాయి. ఈ నెలలో పుట్టిన వారు రోజా పూల మాదిరిగానే ఎంతో రొమాంటిక్ గా ఉంటారు. వీరు మంచి స్నేహితులుగా ఉంటారు. కానీ వీరు జీవితంలో ఎక్కువగా భావోద్వేగాలకు గురవుతుంటారు. అయితే వీరికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారినే ఎక్కువగా ఇబ్బందిపెడుతుంటారు.

  ఒక్కోసారి కాస్త కఠినంగా వ్యవహరించినా, చాలాసార్లు వీరు తోటివారితో ఆనందంగా వ్యవహరిస్తుంటారు. అలాగే అందరి జీవితాల్లో రోజా పువ్వుల్లాంటి సువాసన తీసుకొస్తారు.

  7. జూలై - ఫాక్స్ గ్లోవ్

  7. జూలై - ఫాక్స్ గ్లోవ్

  ఈ నెల లో జన్మించిన వారు చాలా బలమైన నేరారోపణలు మరియు కుడి ఉంది ఏమి తప్పు ఉంది, ఇది వారు అనుకుంటున్నాను మరియు పనులను మార్గం ప్రతిబింబిస్తుంది గురించి కలవారు. వారు మైట్ పలువురు దూకుడు గా చూడవచ్చును, కానీ వారు ఎక్కువగా తగినంత వెంటనే డౌన్ ఉధృతిని మరియు కేవలం ఫాక్స్గ్లోవ్లో పుష్పం వంటి, ఇచ్చిన ఏ పరిస్థితి లో ఇముడుతుంది.

  8. ఆగష్టు - గ్లాడియోల్స్

  8. ఆగష్టు - గ్లాడియోల్స్

  ఈ పువ్వు గౌరవానికి సింబాలిక్ గా ఉంటుంది. ఆగస్టులో పుట్టిన వారికి ఈ పువ్వు లక్షణాలకు ప్రతీక. వీరు ఫ్రీ బర్డ్స్ లా ఉంటారు. అయితే వీరికి దేనిపై ఆసక్తి ఉంటుందో దానిపై ఎక్కువగా ఫోకస్ చేస్తారు.

  ఇక వీరు ఒక పని అనుకుంటే దాన్ని సాధించే వరకు విశ్రాంతి తీసుకోరు. నిర్విర్యామంగా పని చేస్తూనే ఉంటారు. వీరు ఎక్కువగా బయటకు వెళ్లేందుకు ఇష్టపడతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు, వారితో స్నేహం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం.

  9. సెప్టెంబర్ - అస్టర్

  9. సెప్టెంబర్ - అస్టర్

  ఈ పువ్వు సహనం, చక్కదనానికి నిదర్శనం. ఈ నెలలో పుట్టిన వారు ఈ పువ్వులాగే కొన్ని సుగుణాలు కలిగి ఉంటారు.

  జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందించాలని భావిస్తారు. చిన్ని చిన్న ఆనందాలే వీరికి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి.

  ఇక వీరు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను ఎక్కువగా ప్రేమిస్తారు. వారికోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారి ఆనందం వీరిలో చాలా సంతోషాన్ని నింపుతుంది. ఇక వీరు చాలా విషయాల్లో మంచి టాలెంట్ కలగి ఉంటారు. అన్ని రంగాల్లో వీరికి మంచి అనుభవం ఉంటుంది. వీరిలో సృజనాత్మకత కూడా ఎక్కువే ఉంటుంది.

  10. అక్టోబర్ - బంతిపువ్వు

  10. అక్టోబర్ - బంతిపువ్వు

  ఆ నెలలో జన్మించిన వారు ఈ పుష్పంలాగే కల్మషం లేని మనస్సు కలిగి ఉంటారు.

  వీరు ఎప్పుడూ నిరుత్సాహానికి గురికారు. అలాగే వారి చుట్టు ఎప్పుడు కూడా నిరాశాజనకమైన పరిస్థితులు ఏర్పడకుండా వ్యవహరిస్తారు. వీరు ఎక్కువగా కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తారు. ఫ్యామిలికే అంకితమైపోతుంటారు.

  ఇంట్లో ఉండటానికి ఎక్కువగాఇష్టపడతారు. వీరు ఎక్కువగా ఆరెంజ్ కలర్ ను ఇష్టపడతారు.

  11. నవంబర్ - క్రిసాన్తిమం

  11. నవంబర్ - క్రిసాన్తిమం

  ఈ పువ్వు ఆశావాదం, సంతోషాన్ని సూచిస్తుంది. నవంబర్ లో ఫుట్టిన వారు ఈ పువ్వు గుణాలు కలిగి ఉంటారు. వీరు గొప్ప సానుభూతి కలిగి ఉంటారు. ప్రకృతిని బాగా ప్రేమిస్తారు. ఇక వీరి ప్రసంగాలు వినడమంటే జనాలకు భలే ఇష్టముంటుంది. వీరి మాటలు ఎక్కడ కూడా బోర్ కొట్టవు. మంచి ప్రేరణ కలిగిస్తాయి. వీరిని ఎక్కువమంది అనుకరిస్తు ఉంటారు.

  వీరు సమస్యల వల్ల ఒత్తిడికి గురైనా తమ చుట్టూ ఉండేవారు సంతోషంగా ఉండాలని భావిస్తారు. అందుకే ఎవ్వరినీ నొప్పించే విధంగా వ్యవహరించరు.

  12. డిసెంబర్ - పాన్ సెట్టియా

  12. డిసెంబర్ - పాన్ సెట్టియా

  డిసెంబర్ లో పుట్టిన వారు ఈ పువ్వు గుణాలు కలిగి ఉంటారు.

  ఈ పువ్వుకుంటే ఎరుపు రంగు రేకులు రక్తంతో ఉన్న క్రీస్తును గుర్తు చేస్తాయి. మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అలాగే వీరు వయస్సులో చిన్న అయినప్పటికీ వీరి సలహాలు, ఆలోచనలు మాత్రం అమోఘంగా ఉంటాయి. వీరు పెను తుపానులాగా వ్యవహరిస్తారు. వీరు స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు.

  English summary

  Your Birth Month Flower Can Reveal This About Your Personality

  Depending on which month you were born in, here is an analysis of your personality based on your flower representative. Each month has its own representative flower and here we are about to share the traits of each flower, based on the birth month.Check out on what does your birth month flower reveal about you.
  Story first published: Wednesday, November 8, 2017, 8:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more