Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
దిన ఫలాలు: మంగళవారం 26 డిసెంబర్ 2017
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.
ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..
ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది. 26-12-2017 తారీఖు, మంగళవారం నాటి దిన ఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, శీతాకాలం, పుష్య మాసం, శుద్ధ అష్టమి రాత్రి 9 గంటల 1 నిమిషం వరకూ ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 9 గంటల 4 నిమిషాల వరకు ఉంది. అమృత సమయం సాయంత్రం 4 గంటల 11 నిమిషాల నుండి 5 గంటల 48 నిమిషాల వరకూ ఉంది. వర్జ్యం ఉదయం 6 గంటల 27 నిమిషాల నుండి 8 గంటల 4 నిమిషాల వరకు ఉంది. ఉదయం దుర్ముహర్తం 8 గంటల 44 నిమిషాల నుండి 9 గంటల 28 నిమిషాల వరకు ఉంది. మరలా దుర్ముహర్తం రాత్రి 10 గంటల 30 నిమిషాల లగాయతు 11 గంటల 30 నిమిషాల వరకూ ఉంది. సూర్య ఉదయ సమయం 6 గంటల 30 నిమిషాల లగాయతు, సూర్య అస్తమయ సమయం 5 గంటల 20 నిమిషాలకు.

మేష రాశి ( 21 మార్చి-20 ఏప్రిల్ )
చేయు పనులు పట్టుదలగా చేయవలసి ఉంది. ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటారు. ఖర్చులపై ఆరా తీసుకుంటారు. ఏ విషయమైనా భార్యతో చర్చించి నిర్ణయం తీసుకోవటం మంచిది. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి.

వృషభ రాశి (21 ఏప్రిల్-21 మే )
చేయు పనులందు ఆటంకాలు ఏర్పడతాయి. బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. వారితో ఆనందంగా గడుపుతారు. బకాయిలు, బిల్లులు కట్టవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. పని వారి సహకారం కూడా లభిస్తుంది.

మిథున రాశి ( 22 మే-21 జూన్ )
వృత్తి వ్యాపారాలు ఆనందాన్ని ఇస్తాయి. సోదరులు సహకారంగా మసులుకోగలరు. పిల్లల ప్రవర్తన సంతృప్తిని ఇస్తుంది. వాణిజ్య అభివృద్ధికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. భార్య సహకారంతో పనులు చేయవలసి ఉంటుంది.

కర్కాటక రాశి (22 జూన్-22 జూలై )
తండ్రి గారి సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి. దూరపు బంధువుల కలయికలు ఉంటాయి. తల్లి గారి విషయం ప్రత్యేకంగా చూసుకుంటారు. పిల్లలు బాధ్యతగా మసులుకుంటారు. భార్య సలహాలు ప్రత్యేకంగా స్వీకరించవలసి ఉంటుంది.

సింహ రాశి (23 జూలై-21 ఆగష్ట్ )
ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. దైవ దర్శన ప్రాప్తి కూడా కలదు. బకాయిలు, బిల్లులు కట్టవలసిన సమయం. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు బాధ్యతతో పూర్తి చేస్తారు.

కన్యా రాశి ( 22 ఆగష్ట్-23 సెప్టెంబర్)
చేయు పనులు విజయవంతం అవుతాయి. ధన ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయి. తల్లి గారి ఆరోగ్యం పట్ల బాధ్యతగా ఉండాలి. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

తులా రాశి ( 24 సెప్టెంబర్-23 అక్టోబర్)
చేయు పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. కొత్త అవకాశాలు చేజారకుండా చూసుకోవాల్సి ఉంటుంది. పిల్లల విషయంలో బాధ్యతగా మసులుకోండి. భార్య అనుకూలంగా మసులుకోగలదు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

వృశ్చిక రాశి (24 అక్టోబర్-22 నవంబర్)
అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేయవలసి ఉంటుంది. పిల్లల కోసం అభివృద్ధి పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. దైవ దర్శనం చేస్తారు. మంచి భోజన సదుపాయం కలదు. పిల్లలతో షికార్లు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ధనం చేకూరగలదు.

ధనస్సు రాశి ( 23 నవంబర్-22 డిసెంబర్)
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, మెలకువలు అవసరం. ఇంటి పనులు బాధ్యతతో చేస్తారు. బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకర రాశి ( 23 డిసెంబర్-20 జనవరి)
దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చేయు పనులందు ఆటంకాలు ఉంటాయి. భార్య సంబంధ బంధువుల రాకపోకలు ఉంటాయి. పిల్లల గురించి ఆలోచించవలసిన సమయం. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి.

కుంభ రాశి ( 21 జనవరి-20 ఫిబ్రవరి)
ధన ప్రణాళికలు అనుకున్న ఫలితాలను ఇస్తాయి. పని వారి సహకారం ఉంటుంది. అధికారులు ప్రసన్నం అవుతారు. దూరపు బంధువుల రాకపోకలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మీన రాశి (20 ఫిబ్రవరి-20 మార్చి)
సుఖ భోజన ప్రాప్తి కలదు. ఆనందంగా ఉంటారు. అనుకున్న ఫలితాలు నెరవేరతాయి. దైవ దర్శన ప్రాప్తి కూడా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాధ్యతతో చేయవలసి ఉంటుంది.
ఇప్పటి వరకూ ఈ నాటి దిన ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications
