For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అది వచ్చిన రాత్రి నువ్వు నాతో అస్సలు పడుకోవు, నన్ను సుఖపెట్టవు, ఆ మాటలు వినేసరికి #mystory297

సెలవులప్పుడు నాన్న వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్తారని ఆశగా ఎదురు చూసేదాన్ని. కానీ ఆయన అస్సలు వచ్చేవాడు కాదు. హాస్టల్ లో ఒక్కదాన్నే ఏడుస్తూ ఉండేదాన్ని. ఒకసారి పండుగకు నన్ను మా నాన్న ఇంటికి తీసుకెళ్లాడు

By Arjun Reddy
|

నాకు పదేళ్ల వయస్సున్నప్పుడే మా అమ్మ చనిపోయింది. మా నాన్న కొన్నాళ్లు మా అమ్మలేదనే భావన నాలో ఎక్కడా కలగకుండా బాగా చూసుకున్నాడు. మా అమ్మలేని లోటును తీర్చాలని మరో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెను నాకోసమే పెళ్లి చేసుకున్నాడు.

ఆమెను నేను పిన్ని అనేదాన్ని. మా నాన్నతో ఆమెకు పెళ్లయిన కొత్తలో నన్ను చాలా బాగా చూసుకునేది. రానురాను తనకు నాపై ప్రేమ పూర్తిగా తగ్గింది.

నాన్న మనస్సును మార్చింది

నాన్న మనస్సును మార్చింది

మా నాన్న మనస్సును కూడా మార్చింది. ఆమెకు కొడుకు పుట్టడంతో మా నాన్న ఆమె చెప్పినట్లుగానే వినడం స్టార్ట్ చేశాడు. తర్వాత నన్ను పట్టించుకోవడం మానేశారు. ఇంట్లో పని మొత్తం నేనే చేసేదాన్ని.

పని మనిషిలాగా చూసేది

పని మనిషిలాగా చూసేది

మా పిన్ని నన్ను ఒక పని మనిషిలాగా చూసేది. మా నాన్న తమ్ముడి కోసం ఏవేవో తీసుకొచ్చేవాడు. నాకోసం ఏదీ తీసుకొచ్చేవాడు కాదు. కొన్నాళ్ల తర్వాత నన్ను హాస్టల్ లో వదిలిపెట్టారు. నేను అక్కడే ఉండి చదువుకునేదాన్ని.

ఒక్కదాన్నే ఏడుస్తూ ఉండేదాన్ని

ఒక్కదాన్నే ఏడుస్తూ ఉండేదాన్ని

సెలవులప్పుడు నాన్న వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్తారని ఆశగా ఎదురు చూసేదాన్ని. కానీ ఆయన అస్సలు వచ్చేవాడు కాదు. హాస్టల్ లో ఒక్కదాన్నే ఏడుస్తూ ఉండేదాన్ని. ఒకసారి పండుగకు నన్ను మా నాన్న ఇంటికి తీసుకెళ్లాడు.

నాన్నతో గుసగుసలాడుతూ ఉంది

నాన్నతో గుసగుసలాడుతూ ఉంది

ఆ రోజు నేను బయట వరండాలో పడుకుని ఉన్నాను. మా పిన్ని నాన్నతో గుసగుసలాడుతూ ఉంది. నేను పడుకుని ఉన్నానని వాళ్లు ఏవేవో మాట్లాడుకుంటూ ఉన్నారు. దాన్ని అక్కడే హాస్టల్ ఉండనీయకూడదా? మళ్లీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అంటూ మా పిన్ని నాన్నను తిడుతూ ఉంది.

సుఖంగా పండుకోలేము

సుఖంగా పండుకోలేము

ఒక రెండ్రోజులు ఉండి వెళ్లిపోతుందులే అని నాన్న అన్నాడు. అయినా పిన్ని నాన్నను తిడుతూనే ఉంది. అది ఇంటికి వస్తే మనం సుఖంగా పండుకోవడానికి కూడా ఉండదు. పక్కనే ఉండి అన్నీ నంగనాచిలాగా వింటూ ఉంటుంది. మనం ఏం చేసుకుంటుంటామో అని చూస్తూ ఉంటుంది.

నాతో అస్సలు పడుకోవు

నాతో అస్సలు పడుకోవు

నేను నీతో రాత్రంతా ఎలా పడుకోవాలి. నిన్ను ఎలా సుఖపెట్టాలి. అది వస్తే మనకు కొద్దిగా కూడా ప్రైవసీ ఉండదు. అది వచ్చిన రాత్రి నువ్వు నాతో అస్సలు పడుకోవు. నన్ను సుఖపెట్టవు. దాని గురించే ఆలోచిస్తూ ఉంటావు. ఇంట్లో అది అయినా ఉండాలి, నేనైనా ఉండాలి. ఇద్దరం అంటే అస్సలు కుదరదు అని పిన్ని నాన్నను తిడుతూ ఉంది.

నాకే అసహ్యం పుట్టింది

నాకే అసహ్యం పుట్టింది

పిన్ని మాటలు విన్న తర్వాత నా జీవితంపై నాకే అసహ్యం పుట్టింది. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. నా అడ్రస్ కూడా వాళ్లకు తెలియకూడదనుకున్నాను. సిటీకి వెళ్లి టైలరింగ్, ఎంబ్రాయిడింగ్ ఉచితంగా నేర్పించే శిక్షణ కేంద్రంలో జాయినయ్యాను.

కష్టాలు జీవితాన్ని మారుస్తాయి

కష్టాలు జీవితాన్ని మారుస్తాయి

అక్కడే వసతి ఉండడంతో నాకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. తర్వాత షాప్ పెట్టాను. ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. నా జీవితం చాలా హ్యాపీగా ఉంది. కష్టాలు వచ్చాయని కుంగిపోకండి. కష్టాలు కూడా మీ జీవితాన్ని మారుస్తాయి.

English summary

an incident that changed my life

an incident that changed my life
Desktop Bottom Promotion