ఎమిలీ రోస్ నిజ జీవిత గాథ : ఒక పీడ కల

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ఎమిలీ రోస్ నిజ జీవిత గాథ : ఒక పీడ కల

మీరు ఎక్కువగా థ్రిల్లర్ కథలు, దెయ్యాల కథలు ఇష్టపడే వాళ్లు అయితే, ఈ వ్యాసం మీకోసమే. తన జీవితమంతా ఎక్సార్సిజం తో గడిపిన ఎమిలీ రోస్ భయంగొల్పే కథను ఇప్పుడు మీరు వినబోతున్నారు.

అసలేం జరిగింది ఎమిలీ రోజ్ జీవితం లో ?

“ ది ఎక్సార్సిజమ్ ఆఫ్ ఎమిలీ రోజ్” సినిమా కూడా ఆవిడ పేరుతో విడుదలైంది అంటేనే అర్ధమవుతుంది రోజ్ జీవితం ఎంత దారుణంగా జరిగిందో. తద్వారా ఎక్సార్సిజం సంబంధించిన అనేక విషయాలు, ప్రపంచానికి కూడా తెలిశాయి.

ఎమిలీ రోజ్ మీరు తెలుసుకోవలసిన అనేక విషయాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి:

అసలు ఎమిలీ రోజ్ అసలు పేరేంటో తెలుసా :

అసలు ఎమిలీ రోజ్ అసలు పేరేంటో తెలుసా :

ఎమిలీ రోజ్ అసలు పేరు అన్నెలీస్ మైఖేల్ , తను సెప్టెంబర్ 21 న 1952 లో క్లింగెన్బెర్గ్, బవేరియా, జర్మనీ లో పుట్టింది. తను బాల్యంలో ఉన్నప్పుడు కాథలిక్ కుటుంబంలో అనేక నియమ నిబంధనల మద్య పెరిగింది.

ఆమె కుటుంబం గురించి:

ఆమె కుటుంబం గురించి:

ఎమిలీ రోజ్ కుటుంబం కాథలిక్ కుటుంబానికి చెందింది, పూర్తిగా క్రైస్తవ మత ఆరాధకులుగా ఉండేవారు. ఆవిడ కుటుంబం నమ్మకాల ప్రకారం కనీసం ఒక్కరైనా వారి పాపాలకు జీవితాంతం శిక్షను అనుభవిస్తారు.

ఎమిలీ రోజ్ కుటుంబం లో ఉన్న నియమ నిభంధనలు :

ఎమిలీ రోజ్ కుటుంబం లో ఉన్న నియమ నిభంధనలు :

వారి పాపాలను తొలగించుకునే క్రమంలో భాగంగా, వీరు అనేక నియమ నిభంధనలు పాటించేవారు. అవి వాళ్ళు గగుర్పొడిచేలా ఉండేవి కూడా. ఎమిలీ కుటుంబం మొత్తం అత్యంత చల్లగా ఉండే చలికాలంలో నేల మీద పడుకునేవారు, తద్వారా త్వరగానే ఎమిలీ అనేక అనారోగ్యాలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది.

ఎమిలీ నమ్మకాలు:

ఎమిలీ నమ్మకాలు:

ఎమిలీ చల్లటి నేల మీద పడుకున్నప్పుడు, డ్రగ్స్ కు బానిస అయిన వారందరూ తన త్యాగం వలన విముక్తిని పొందగలరని భావించేది. ముఖ్యంగా ఎవరైతే తమ జీవితం మీద ఆశను వదులుకున్నారో వారి పట్ల ఈ ఆలోచనలు చేసేది.

ఎమిలీ మొదటి అనారోగ్యం:

ఎమిలీ మొదటి అనారోగ్యం:

ఎమిలీ, తన 17 యేళ్ళ వయసులో 1968 లో, హై స్కూల్ చదువుతున్న రోజుల్లో, ఎక్కువగా మూర్ఛ వలన భాధపడేది. వర్జ్బెర్గ్ లోని నరాల స్పెషలిస్ట్లు, మరియు మానసిక వైద్యుల నివేదికల ప్రకారం ఎమిలీ “గ్రాండ్ మాల్ ఎపిలెప్సీ” అనే వ్యాధితో భాధపడుతుందని తేల్చారు. ఈ వ్యాధి కారణంగా భ్రాంతులకు గురవడం, మానసిక స్థితులలో తరచుగా మార్పులు రావడం జరుగుతూ ఉంటాయి.

నెమ్మదిగా ఎమిలీ పరిస్తితి దారుణంగా తయారయింది:

నెమ్మదిగా ఎమిలీ పరిస్తితి దారుణంగా తయారయింది:

ఎమిలీ మానసిక పరిస్థితిలో ఎటువంటి మార్పు కనపడని కారణంగా, నెమ్మదిగా ఏమిలీని మానసిక వైద్యశాల లో కూడా చేర్చాల్సి వచ్చింది. అక్కడ పరిస్తితి ఇంకా విషమించింది. తద్వారా అనేక దెయ్యాలకు సంబంధించిన భ్రాంతులను ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. ప్రార్ధనా సమయంలో కూడా దెయ్యాలు తలంపునకు వచ్చేవి. నెమ్మదిగా తన మాటలలో కూడా మార్పు రావడం, ఆ మాటలలో తనను తాను హీనంగా కించపరచుకునేలా మాట్లాడడం చేసేది.

మానసిక రోగులకు ఇచ్చే డ్రగ్స్:

మానసిక రోగులకు ఇచ్చే డ్రగ్స్:

వైద్యులతో తాను దెయ్యాల ముఖాలను చూస్తున్నానని చెప్పినప్పుడు, ఆవిడ మాటలను నమ్మని వైద్యులు మానసిక స్థితిలో మార్పును తెచ్చే దిశగా డ్రగ్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. కానీ ఇవి పని చేయకపోగా, నెమ్మదిగా డిప్రెషన్లోకి వెళ్ళేలా చేశాయి. మరియు వైద్యాన్ని నమ్మని కుటుంబం, పాస్టర్ల దగ్గరకు ఈ విషయాన్ని తీసుకెళ్లింది.

చివరికి తనను తాను చంపుకునే దిశగా:

చివరికి తనను తాను చంపుకునే దిశగా:

కాథలిక్ పద్దతులను పాటించే క్రైస్తవ భక్తురాలిగా, తనకు తెలుసు ఆత్మహత్య తనకు సరైన పరిష్కారం కాదని. అలా ఆత్మహత్య చేసుకోవడం కాథలిక్ పద్దతుల దృష్ట్యా క్షమించరాని నేరం కిందకు వస్తుంది. కానీ తన మనసులో తిష్ఠ వేసుకుని కూర్చున్న దెయ్యాలతో పోటీపడలేక ఒక సందిగ్ధంలో ఉండిపోవాల్సిన స్థితి, ఏమిలీ కి ఎదురయింది. తద్వారా ఏం చేయలేని నిస్సహాయ పరిస్తితి ఎదుర్కొనింది.

5సంవత్సరాల పాటు తన వైద్యం కొనసాగింది:

5సంవత్సరాల పాటు తన వైద్యం కొనసాగింది:

వైద్యులకు అంతుచిక్కని పరిస్థితిగా ఏమిలీ రోజ్ మానసిక పరిస్తితి తయారయింది. అనేక పరీక్షలు చేసి, అనేక రకాలు మందులు వాడినా ఎటువంటి ఫలితం లేక వైద్యులనే నివ్వెరపోయేలా చేసింది. మూర్ఛరోగం, దెయ్యాలు మనసుల్లో మెదలడం కూడా కొనసాగుతూ వచ్చాయి.

తన పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్చిని ఒక పరిష్కారంగా భావించారు కుటుంబ సభ్యులు.

తన పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్చిని ఒక పరిష్కారంగా భావించారు కుటుంబ సభ్యులు.

తద్వారా పాస్టర్ ఎర్న్ స్ట్ ఆల్ట్ ను సంప్రదించారు, ఎమిలీ మానసిక స్థితిని సరిదిద్దేందుకు. ఎమిలీని బాగు చేసే సమయంలో చర్చి నేలమీద ఎమిలీ చేసిన వికృత చేష్టలకు సాక్ష్యంగా నిలవడం ఆయన వంతైoది.

చర్చిలో ఎమిలీ చెప్పిన మాటలు :

చర్చిలో ఎమిలీ చెప్పిన మాటలు :

ఎర్న్ స్ట్ ఆల్ట్ చెప్పిన కథనం ప్రకారం చర్చి నేల మీద ఎమిలీ మూత్ర విసర్జన చేయడమే కాకుండా అక్కడ ఉన్న బొగ్గును తినడం మరియు విచిత్రమైన భాషను మాట్లాడడం తనను నివ్వెరబోయేలా చేసిందని తెలిపారు. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని తన జీవితకాలంలో ఎదుర్కొనలేదని చెప్పారు.

పాస్టర్ ఎర్న్ స్ట్ ఆల్ట్ , ఎమిలీ ని దెయ్యం ఆవహించినట్లుగా భావించారు. తద్వారా దెయ్యాలు ఎమిలీని పూర్తిగా వశపరచుకోవాలని ప్రయత్నించినట్లు తెలిపారు. పూర్తిగా దెయ్యాల అధీనంలో ఎమిలీ ఉన్న కారణంగా ఎమిలీ ని సరిచేయ్యడానికి ఎంతో శ్రమించవలసి వచ్చిందని వాపోయారు.

ఎక్సార్సిజమ్ చికిత్స ప్రారంభమయింది:

ఎక్సార్సిజమ్ చికిత్స ప్రారంభమయింది:

ఎమిలీని పూర్తిగా దెయ్యాల నుండి దూరం చేసే ప్రక్రియలో భాగంగా కర్మ క్రతువుల ఆధారితంగా “రిట్యువల్లీ రుమేనం” అనే పద్దతిని అనుసరించవలసి వచ్చింది.

చికిత్సలో భాగంగా 67 రకాల ఎక్సార్సిజమ్ పద్దతులను అనుసరించారు:

చికిత్సలో భాగంగా 67 రకాల ఎక్సార్సిజమ్ పద్దతులను అనుసరించారు:

పదినెలల కాలంలో 67 రకాల ఎక్సారిజం పద్దతులను ప్రయోగించవలసి వచ్చింది వారి వారి అద్యయనాలకోసం ప్రతి ఒక్క పద్దతిని రికార్డు చేసి ఉంచారు కూడా. ఒక్కోసారి వారం వ్యవధిలోనే మరో పద్దతి కూడా ప్రయోగించవలసి వచ్చేది, మరియు ఒక్కో ప్రక్రియ 4 గంటలు కనీసం తీసుకునేది.

రాను రాను పరిస్తితి విషమించిది :

రాను రాను పరిస్తితి విషమించిది :

ఒక్కోసారి పరిస్తితి మెరుగ్గా అనిపించినా కూడా, అది మూన్నాళ్ల ముచ్చటగానే ఉండేది. మరియు తన కుటుంబ సభ్యులపైకే దాడి దిశగా ఉపక్రమించేది. కుటుంబ సభ్యులను కొరకడం, కొట్టడం, గీరడం వంటి చర్యలతో భయభ్రాంతులకు గురిచేసేది. మరియు ఎవరు లేని సమయంలో తనను తాను కూడా హీనాతిహీనంగా గాయపరచుకునేది.

కనీసం ఆహారం కూడా తీసుకునేది కాదు:

కనీసం ఆహారం కూడా తీసుకునేది కాదు:

పరిస్తితి విషమించే కొలదీ, దెయ్యాలు తనను ఆహారం తీసుకోవడానికి అంగీకరించలేదంటూ ఆహారాన్ని దూరం పెట్టేది. తద్వారా తన మోకాళ్ళను సైతం గాయపరచుకుంది. ఆత్మహత్య కాథలిక్స్ ప్రకారం తప్పు కావున , చనిపోవాలన్న ఆలోచన దృష్ట్యా, తనను చంపమని ప్రాధేయపడేది కూడా. తద్వారా రోగ నిరోధక శక్తి క్షీణత దృష్ట్యా, న్యుమోనియా బారిన కూడా పడింది. అయినా ఎక్సార్సిజo ప్రక్రియను మాత్రం ఆపలేదు.

చివరి ఎక్సారిజo:

చివరి ఎక్సారిజo:

జూన్ 30, 1976 న ఎమిలీ చివరి ఎక్సార్శిజo ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో అత్యంత హీనస్థితిలో, బలహీనతను అనుభవిస్తూ తన చివరిమాటగా తనకు విమోచనాన్ని ప్రసాదించమని కోరింది. మరియు తన అమ్మ చెవిలో తాను ఈ పరిస్థితులను భరించలేకున్నానని కూడా తెలిపింది. కానీ ఎక్సార్సిజo అయినా కూడా, తను అతి కొద్ది రోజుల్లోనే మరణించింది. దీనికి కారణం పోషకాహార లోపంగానే వైద్యులు తేల్చారు కూడా.

ఎమిలీ మరణం ఒక సంచలనం అప్పట్లో:

ఎమిలీ మరణం ఒక సంచలనం అప్పట్లో:

ఎమిలీ పరిస్థితిని అంచనా వేయలేక, వైద్యులకు బదులుగా పాస్టర్లను ఆశ్రయించి ఎమిలీ చావుకు కారణమైనందున, ఎమిలీ తల్లిదండ్రులపై దావా కూడా వేశారు. తద్వారా ఎమిలీ తల్లిదండ్రులు, పాస్టర్లకు 6నెలల జైలు శిక్షను కూడా విధించారు.

ఎమిలీ జీవిత కథ మనలో అనేకములైన ఆలోచనలకు తెరెతీసేలా చేసింది.

ఎమిలీ జీవిత కథ మనలో అనేకములైన ఆలోచనలకు తెరెతీసేలా చేసింది.

ఎమిలీ జీవిత కథ మనలో అనేకములైన ఆలోచనలకు తెరెతీసేలా చేసింది. ఏది నిజమో ఏది అబద్దమో తెలీని పరిస్థితులలో మానసిక రోగాన్ని దెయ్యాలకు అంటగట్టి ఇలాంటి ఎక్సార్సిజo పద్దతులను అనుసరించి ఎమిలీ ప్రాణాలతో చెలగాటం ఆడిన పేరెంట్స్, పాస్టర్లను చూసైనా బుద్ది తెచ్చుకుని మారాల్సిన అవసరం ఉంది. ఉన్న రోగానికి మందు లేదు, లేని దెయ్యాలను తరిమే పిచ్చి ప్రయత్నాల వలన, పోషకాహార లోపానికి గురై ఎమిలీ దారుణమైన చావును చవిచూసింది. సాంకేతికంగా ఎంతో అభివృద్ది చెందుతున్నా, మూడనమ్మకాలతో కొన్ని జీవితాలు ఇంకనూ నాశనం అవుతున్నాయి. అలాంటి జీవిత కథల్లో ఒకటి ఈ ఎమిలీ కథ.

సరైన వైద్యం పూర్తి చేసి ఉంటే ఎమిలీ ఇంకొంతకాలం బ్రతికి ఉండేదేమో మరి. నిజానికి ఎమిలీ తన కుటుంబంలో ఉన్న పోకడల వలనే ఇలా అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కావున మూడనమ్మకాలు ఇకనైనా తగ్గాల్సిన అవసరం ఉందని హేతువాదులు సూచనలిస్తుంటారు.

మీకు ఇలాంటి కథలు ఏమైనా తెలిస్తే క్రింద కామెంట్ సెక్షన్లో తెలుపండి.

English summary

The Exorcism Of Emily Rose

Emily Rose's story will break your heart with the struggle that she went through. But, at the same time, her pictures can scare one to death. She was believed to be possessed and hence underwent many exorcism cases. But modern science revealed her symptoms were compared with those of schizophrenia. Emily lost her life due to malnourishment.