Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
మే 2018 లో కుంభరాశి మాసఫలాలు
మే 2018లో కుంభరాశి మాసఫలాలుమాసఫలాలను తెలుసుకోవడం ద్వారా ఆ నెలలోని మన రాశికి సంబంధించిన విషయాలు తెలుస్తాయి. మే 2018లో కుంభరాశికి చెందిన మాసఫలాలను ఇక్కడ పొందుబరిచాము. వీటిని చదివి మీ రాశిఫలాన్ని తెలుస
ఈ నెలలో మీరు ధైర్యవంతంగా, సాహసోపేతంగా అలాగే భయం లేకుండా ఉంటారు. ఆస్ట్రో ఎక్స్పర్ట్స్ ప్రకారం మీరు ఈ నెలలో పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశం కలదు. ఆధ్యాత్మికతను ఆస్వాదిస్తారు. మీ తెలివితేటలు, ఉత్సాహం ఆలాగే నిర్ణయాన్ని తీసుకునే సామర్థ్యాన్ని తప్పక అభినందించి తీరాలి. ఈ నెల మీకు సానుకూలంగా ఉంటుంది. ఈ నెలంతా మీరు సంతోషంగా ఉంటారు.
కుంభరాశికి చెందిన వారు దృఢ నిశ్చయం కలిగి ఉంటారు. వీరు సందర్భానికి తగినట్టుగా ప్రవర్తిస్తారు. అలాగే మృదుస్వభావం కలిగిన వారు. విభేదాలను నివారించేందుకు ప్రాముఖ్యం ఇస్తారు.
వివిధ సోషల్ ఇష్యూల పట్ల వీరు ఆసక్తి కనబరుస్తారు. వివిధ సమస్యలకు పరిష్కారాలను కనుగునేందుకు ప్రయత్నిస్తారు. ఈ రాశికి చెందిన వారు ప్రకృతిని ఆరాధిస్తారు. సమస్యలను పరిష్కరించేందుకు నడుం బిగిస్తే వెనకడుగు వేయరు.

వీరు స్వాప్నికులు. ఇతరులు అర్థం చేసుకోవాలని అనుకునే తత్త్వం కలవారు. మరోవైపు, వీరు తమ స్వతంత్రాన్ని హరించబడడాన్ని ద్వేషిస్తారు. మూవ్మెంట్ కి అనువుగా లేని చిన్న చిన్న స్పేస్ లలో చిరాకుకు గురవుతారు.
ఈ లక్షణాలన్నీ ఈ రాశికి చెందిన వ్యక్తులను బాగా నిర్వచిస్తాయి. మే నెలలో ఈ రాశి వారి మాసఫలాల గురించి తెలుసుకుందాం.
చిన్న చిట్కా: ఈ నెలలో మీ లీడర్ షిప్ క్వాలిటీస్ అనేవి వెలుగులోకి వస్తాయి. అయితే, కొలీగ్స్ తో చిన్నపాటి క్లాషెస్ కలిగేందుకు కూడా ఆస్కారం ఉంది. కాబట్టి, అంటీ ముట్టనట్టు ఉండడం ఉత్తమం.
ఈ నెలలో ఈ రాశికి చెందిన మాసఫలాలను గురించి తెలుసుకుందాం.

ఆరోగ్యం:
ఆస్ట్రో ఎక్స్పర్ట్స్ ప్రకారం, మే 2018లో 21 వ తేదీ తరువాత నుంచి కుంభరాశికి చెందిన వారి ఆరోగ్యం పుంజుకోవడం ప్రారంభిస్తుంది. తగినంత రెస్ట్ తీసుకుని రిలాక్స్ అవడం మంచిది.
వృత్తిపరంగా:
వృత్తిపరంగా మీరు ఆశించినంత అభివృద్ధి మీకు ఈ నెలలో కనిపించదు. ఈ సమయంలో మీ ప్రియమైన వారు కూడా మీకు సహాయపడటంలో విఫలం అవుతారు. మరోవైపు, వర్క్ ప్లేస్ లోని పాలిటిక్స్ లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలని మీ కొలీగ్స్ శతవిధాలా ప్రయత్నిస్తారు. మీ సీనియర్స్ తో అలాగే మేనేజ్మెంట్ తో అభిప్రాయ బేధాలు తలెత్తగలవు. తీవ్రమైన అభిప్రాయబేధాలతో వర్క్ ప్లేస్ లో అశాంతి పెరుగుతుంది.

ఆర్థికపరంగా:
ఈ నెలలో ఆర్థిక అభివృద్ధి ఆశాజనకంగా ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్ ని సాధన చేస్తున్నవారికి సానుకూలమైన సమయం. మరోవైపు, రైటర్స్, పెయింటర్స్, మ్యూజీషియన్స్ మరియు స్కల్ప్చర్స్ కి గణనీయమైన లాభాలు కలిగే సమయమిది. అంతేకాక, ఈ సమయంలో మీరు కొత్త వెంచర్స్ అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అవకాశాలను గమనించవచ్చు.
లవ్ లైఫ్:
ఈ నెల ప్రేమానుబంధాలకు అనుకూల సమయం. మీ బంధం పదిలమయ్యే సమయం. అయితే, కొంత ఒడిడుకులు కూడా ఎదురవవచ్చు. మరోవైపు, బ్యాడ్ రిలేషన్ షిప్స్ నుంచి దూరంగా ఉండటం మంచిది. మీరు మీ భాగస్వామితో సమయాన్ని గడపడం ద్వారా మీ బంధం మరింత పటిష్టమవుతుంది.

అదృష్ట తేదీలు అలాగే రంగులు:
ఈ నెలలో ఈ రాశికి చెందిన అదృష్ట సంఖ్యలు - 17, 40, 46, 61, మరియు 76.
అదృష్ట తేదీలు: 6, 7,8, 17, 18, 25, 26.
అదృష్ట రంగులు: రెడ్, ఆపిల్ గ్రీన్, మరియు స్కై బ్లూ.



Click it and Unblock the Notifications
