For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  హస్తసాముద్రికం ప్రకారం చేతిమీద ఉండే ఈ గుర్తులు మీ వ్యక్తిత్వాన్ని సూచించగలవు

  |

  భవిష్యత్తుని ఊహించడం లేదా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని విశ్లేషించడం అనేది జ్యోతిష్య శాస్త్రం, న్యూమరాలజీ లేదా హస్తసాముద్రికంతో సాధ్యమవుతుందని మనందరికీ తెలుసు.

  వ్యక్తుల యొక్క అరచేతిని చూడటం ద్వారా ఒక వ్యక్తి యొక్క భవిష్యత్ లేదా అదృష్టాన్ని అంచనా వేయడానికి వివిధ మార్గాలున్నాయి, వీటిని హస్తసాముద్రికం సహాయంతో ధృవీకరించవచ్చు.

  హస్తసాముద్రికం ప్రకారం చేతిమీద ఉండే ఈ గుర్తులు మీ వ్యక్తిత్వాన్ని సూచించగలవు

  మీ అరచేతి బాహ్య దిగువ భాగంలోని త్రిభుజాకార గుర్తు:

  మీ అరచేతి బాహ్య దిగువ భాగాన, బొటన వేలికి కాస్త దూరంలో త్రిభుజాకార గుర్తును కలిగి ఉన్నట్లయితే, మీరు భిన్న స్వరూపులుగా వ్యక్తిత్వాన్ని కలిగిన వైవిధ్య భరితమైన వ్యక్తిగా ఉంటారు .

  These Marks On The Palm Can Reveal A Lot About You; Read On!

  జీవితంలో అనేక ఉన్నతమైన స్థానాలను పొందగలరు. మీ ఆలోచనా విధానాలు అబ్బురపరచేవిలా ఉంటాయి. వ్యక్తిగా ఉన్నతమైన లక్షణాలను కలిగి ఉంటారు, మరియు మీ ప్రియమైన వారి నుండి అటువంటి లక్షణాలనే ఆశిస్తుంటారు. మరొక వైపు, మీరు స్థిరమైన దృక్పధాన్ని కలిగి ముందు చూపుతో వ్యవహరిస్తూ ఉంటారు. మానసిక ప్రశాంతత కోసం ఎల్లవేళలా పరితపిస్తూ ఉంటారు.

  ముఖ్యంగా మాటమీద నిలబడే తత్వం మీకు సమాజంలో గుర్తింపు, గౌరవాన్ని తెస్తుంది. ఎన్ని అవరోధాలు అడ్డొచ్చినా, ఇచ్చిన మాటను తప్పకూడదన్న ఉన్నతమైన ఆలోచన మీ సొంతం. విభిన్న దృక్పథాల నుండి అనేక విషయాలను తెలుసుకోగల తెలివితేటలు, అత్యంత ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి. విపత్కర మరియు ప్రతికూల ప్రభావిత పరిస్థితుల నందు మీ ఆలోచనా ధోరణి ఇతరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

  మీ అరచేతి బాహ్య దిగువ భాగాన త్రిశూలాకారం:

  మీ అరచేతి బాహ్య దిగువ భాగాన, బొటనవేలికి కాస్త దూరంలో త్రిశూలాకారాన్ని కలిగి ఉంటే, మీరు ముక్కుసూటి తత్వానికి ప్రతీకగా ఉంటారు. మీకు అసౌకర్యంగా అనిపించిన చోట మీ పదునైన మాటలతో ఇతరుల నోటికి కళ్ళెం వేసేలా మీ చర్యలు ఉంటాయి. కాస్త మొండి పట్టుదలను ప్రదర్శిస్తుంటారు. తద్వారా ప్రతికూల ప్రభావిత పరిస్థితులు కూడా అధికంగానే ఉంటాయి.

  మీ ఆలోచనలు స్పష్టంగా ఉండడమే కాకుండా, ఒక చమత్కార పూరిత లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తిగా ఉంటారు. ఒక వ్యక్తిగా, మీరు ఏ విషయం నందైనా సూటిగా ఉంటారు మరియు బలహీన మనస్కులకు మీరంటే కాస్త భయంగా ఉంటుంది కూడా.

  మరొక వైపు, మీ తెలివితేటలు మరియు మీ ఆలోచనా ధోరణి ఆదర్శప్రాయంగా ఉండడమే కాకుండా మీ నిజాయితీ, సంఘంలో పేరు ప్రఖ్యాతలను తీసుకుని రాగలదు.

  మీ అరచేతి బాహ్య దిగువ భాగాన వృత్తాకార గుర్తు:

  మీ అరచేతి బాహ్య దిగువ భాగాన, బొటనవేలికి కాస్త దూరంలో వృత్తాకారపు గుర్తు ఉన్నట్లయితే, మీరు వ్యక్తిగతంగా క్రమశిక్షణ కలిగిన వారిగా, వృత్తిపట్ల నిబద్దతతో ఉంటారు. కార్యసాధనలో దృఢనిశ్చయంతో ముందుకు సాగడం మీ తత్వంగా ఉంటుంది.

  మీ ఆలోచనలకు వ్యతిరేకంగా ఏ పనినీ చేయలేరు. అటువంటి వాతావరణంలో కూడా ఎక్కువసేపు ఇమడలేరు. మీకు మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుంది.

  మరోవైపు, మీరు మీ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని బలమైన సంకల్పంతో ముందుకు సాగేవారిగా ఉంటారు. లక్ష్య సాధనలో అవాంతరాలు ఎన్నొచ్చినా వెనుతిరగక కార్యసాధకునిగా ముందుకు సాగే తత్వం మీ సొంతం. మీ ప్రతి ఆలోచనా మీ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసమే ఉంటుంది.

  మీ అరచేతి బాహ్య దిగువ భాగాన నక్షత్రాకార గుర్తు:

  మీ అరచేతి బాహ్య దిగువ భాగాన బ్రొటన వేలికి దూరంగా నక్షత్రాకార గుర్తును కలిగి ఉన్న ఎడల, మీరు వ్యక్తిత్వంలో ఉన్నతంగా ప్రకాశించే వ్యక్తిగా చెప్పబడింది.

  సంఘంలో మీకు ఉన్నతమైన పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. దీనితో పాటు ఆశించిన లక్ష్య సాధన యందు కష్టేఫలి సిద్దాంతాన్ని పాటించేవారిగా ఉంటారు. క్రమశిక్షణ, పట్టుదల, దృడ సంకల్పం వంటి ఉన్నత లక్షణాల వలన, మీ వ్యాపారంలో లేదా మీ ఆఫీసునందు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. మీరు మీ సహోద్యోగులకు ఆదర్శప్రాయంగా ఉంటారు. ఎక్కడ ఉన్నా, మీకు తగ్గ గుర్తింపు మీకు ఉంటుంది. మీ ముందు చూపు ధోరణి మీ కుటుంబానికి, మీ ప్రియమైన వారికి ఎంతో మేలు చేస్తుంది.

  మీ అరచేతి బాహ్య దిగువ భాగాన మెష్ ఆకారంలో గుర్తు:

  మీ అరచేతి బాహ్య దిగువ భాగాన బొటనవేలికి కాస్త దూరంలో మెష్ ఆకారంలో గుర్తును కలిగి ఉన్న ఎడల, మీరు సృజనాత్మక ఆలోచనలు చేసేవారిలా ఉంటారు. మరియు క్లిష్టమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇతరులు మిమ్మల్ని నిర్వచించటం కూడా కష్టంగా ఉంటుంది. అంతే కాకుండా, మీ వ్యక్తిత్వానికి పలు రహస్య కోణాలు కూడా ఉంటాయి. తద్వారా ప్రజలకు ఒక ప్రశ్నగానే ఉంటారు.

  మరోవైపు, ఇతరుల కష్టాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని అత్యధికంగా కలిగి ఉంటారని మరియు ఎటువంటి పరిస్థితులనైనా అర్ధం చేసుకోగల అవగాహనా చాతుర్యం మీ సొంతమని చెప్పబడింది. ఒక వ్యక్తిగా,ఇతరులకు మీ భిన్న ఛాయలను అర్ధం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఏ విషయాన్నైనా మీకు మీరే పరిష్కరించుకోవాలన్న ఆలోచనలు చేస్తారు కానీ, ఇతరులకు బహిర్గతం చేయడానికి సిద్దంగా ఉండరు.

  మీ అరచేతి బాహ్య దిగువ భాగాన క్రాస్ ఆకారంలోని గుర్తు:

  మీ అరచేతి బాహ్య దిగువ భాగాన, బొటన వేలికి కాస్త దూరంలో క్రాస్ ఆకారంలో గుర్తు ఉన్న ఎడల, మీరు విశ్లేషణాత్మక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మరియు పదునైన ముక్కుసూటి స్వభావంతో నిర్ణయాత్మకమైన ధోరణిని ప్రతిబింబిస్తుంటారు.

  క్లిష్ట పరిస్థితుల నందు మిమ్ములను సావధాన పరచడం కాస్త కష్టమైన చర్యగా ఉంటుంది. మీ ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా లేని అంశాల పట్ల అసౌకర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. తద్వారా, ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం మీ అలవాటుగా ఉంటుంది. ఈ అలవాటు ఇతరులకు కాస్త ఇబ్బందికరంగా ఉన్నా, మీ వ్యక్తిత్వ ధోరణి మార్చుకొనుటకు మాత్రం సిద్దంగా ఉండరు. సంక్షిప్తంగా, ఈ పరిపూర్ణ స్వభావమే మీ వ్యక్తిత్వ లక్షణాన్ని నిర్వచిస్తుంది.

  మీకు అర్ధం పర్ధం లేని విషయాల పట్ల ఆసక్తి ఉండదు. మీ ఆలోచనలు, మీ లక్ష్యాలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఆ ప్రయత్నంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధైర్యాన్ని వీడరు.

  మీ అరచేతిలో పైన చెప్పిన గుర్తులలో ఏవైనా ఉన్నాయా? అయితే వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి. ఇటువంటి అనేక ఆద్యాత్మిక, జ్యోతిష్య, రాశి చక్ర మరియు హస్త సాముద్రిక సంబంధిత కథనాలకై మరిన్ని నవీకరణల కోసం మా విభాగాన్ని తరచూ తనిఖీ చేయండి!

  English summary

  These Marks On The Palm Can Reveal A Lot About You; Read On!

  These Marks On The Palm Can Reveal A Lot About You; Read On!, Predicting future or analysing the personality of an individual can be done by either astrology, numerology, or palmistry! There are different ways of predicting the future or luck of an individual by looking at the palm of individuals, which can be confirm
  Story first published: Monday, June 18, 2018, 16:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more