For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  అమెరికన్ జోడియాక్ సైన్స్ గురించి తెలుసుకోవలసిన విషయాలు

  |

  మనలో చాలా మందికి అమెరికన్ ఆస్ట్రాలజీ గురించి తెలియదు. ఇండియా ఆస్ట్రాలజీ లేదా చైనీస్ హోరోస్కోప్ లా అమెరికన్ ఆస్ట్రాలజీ అనేది అంతగా ప్రాచుర్యం పొందలేదు.

  అయితే, అమెరికన్ ఆస్ట్రాలజీ అనేది అక్యురేట్ గా ఉంటుందని నిపుణులంటున్నారు. ఇది దాదాపు 5000 ఏళ్ళ సంవత్సరాల క్రితానికి చెందినది.

  facts about American zodiac signs

  "మెసో అమెరికన్ క్యాలెండర్"పై ఆధారపడిన ఈ జోడియాక్ సైన్స్ లో ఫాల్కన్, బీవేర్, రావెన్ గూస్, ఆటర్ వంటి అమెరికన్ లెజెండ్ అనిమల్స్ పేర్లను వాడతారు.

  కాబట్టి, మీ అమెరికన్ జోడియాక్ సైన్ గురించి తెలుసుకుని మీ గురించి తెలుసుకోండి.

  ఫాల్కన్ (మార్చ్ 21 - ఏప్రిల్ 19; మేషరాశి)

  ఫాల్కన్ (మార్చ్ 21 - ఏప్రిల్ 19; మేషరాశి)

  మేషరాశి లాగానే, ఈ అమెరికన్ జోడియాక్ సైన్ కి చెందిన వ్యక్తులలో నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే వస్తాయి. సలహాల కోసం వీరిని సంప్రదిస్తూ ఉంటారు. వీరు అనుకున్న పనిని పూర్తి చేసుకునేందుకు కొన్ని సార్లు యారోగెంట్ గా కూడా ప్రవర్తిస్తారు. వీరు వారి స్వభావానికి తగిన ఎన్విరాన్మెంట్ లో ఉండటం వలన వీరి యారొగెన్స్ వలన వీరికి ఇబ్బంది ఎదురవదు. వీరు గొప్ప టీమ్ లీడర్ గా గుర్తింపు పొందుతారు. అయితే, వీరికి సరైన సపోర్ట్ సిస్టమ్ అవసరం.

  బీవేర్ (ఏప్రిల్ 20 - మే 20; వృషభ రాశి)

  బీవేర్ (ఏప్రిల్ 20 - మే 20; వృషభ రాశి)

  ఈ ఇండివిడ్యువల్స్ మిగతా రాశుల వారికంటే చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటారు. వీరు బిజినెస్ ఓరియెంటెడ్ అప్రోచ్ ని అనుసరిస్తారు. వారు తమ పనులను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మరోవైపు, వీరు కష్టజీవులు కూడా. పనులు సజావుగా జరిగేందుకు ఎంత కష్టమైనా పడతారు.

  డీర్ (మే 21 - జూన్ 20; మిథునరాశి)

  డీర్ (మే 21 - జూన్ 20; మిథునరాశి)

  వీరు ఎంతో చురుకుగా ఉంటారు. వీరి చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. వీరు అందరితో కలుపుగోలుగా ఉంటారు. వీరి సంభాషణా చాతుర్యం వలన అందరూ వీరిపట్ల ఆకర్షితులవుతారు. వీరు తమగురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. తమ స్వంత పనులకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారన్న పేరు సంపాదిస్తారు.

  వుడ్ పెకర్ (జూన్ 21 - జులై 21; కర్కాటక రాశి)

  వుడ్ పెకర్ (జూన్ 21 - జులై 21; కర్కాటక రాశి)

  ఈ జోడియాక్ సైన్ ని మిగతా జోడియాక్ సైన్స్ కి తల్లిలా పరిగణిస్తారు. మిగతా అన్ని సైన్స్ కంటే ఇది చాలా సాధు స్వభావం కలిగినది. ఈ రాశికి చెందిన వ్యక్తులు మిగతా వారికి సహాయపడే అవకాశాన్ని ఏమాత్రం మిస్ చేసుకోరు. మరోవైపు, తమ ప్రియమైన వారిపట్ల వీరు పొసెసివ్ యాటిట్యూడ్ తో ఉంటారు. త్వరగా, అసూయ చెందే స్వభావం కలిగిన వారు.

  సాల్మన్ (జులై 22 - ఆగస్టు 21;సింహరాశి)

  సాల్మన్ (జులై 22 - ఆగస్టు 21;సింహరాశి)

  ఈ రాశికి చెందిన వారు తమ చుట్టూ ఉన్నవారికి పాజిటివ్ ఎనర్జీని అందిస్తారు. వీరు ఎప్పుడూ ఇన్స్పిరేషన్ కోసం చూస్తూ ఉంటారు. మరోవైపు, వీరికి కూడా మంచి సపోర్ట్ సిస్టమ్ అవసరం. వీరు ఎందులోనైనా ఫెయిల్ అయితే తీవ్రంగా కలతచెందుతారు. ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ కలిగి ఉంటారు.

  బేర్ (ఆగష్టు 22 - సెప్టెంబర్ 21; కన్యారాశి)

  బేర్ (ఆగష్టు 22 - సెప్టెంబర్ 21; కన్యారాశి)

  వీరు నిరాడంబరులు. అలాగే కాస్త ఉన్నత పోసిషన్ లో ఉంటారు. అలాగే ప్రాక్టికల్ అప్రోచ్ ని నమ్ముతారు. మరోవైపు, జీవితంలోని కొన్ని విషయాలపట్ల వీరికి స్పష్టమైన అవగాహన ఉండదు. అయితే, సహనంతో అర్థం చేసుకుంటే మాత్రం వీరికంటే బాగా ఎవరూ అర్థం చేసుకోలేరని అనడంలో అతిశయోక్తి లేదు. అప్పుడు, వీరు అందరికీ ఇన్స్పిరేషన్ గా మారతారు.

  రావెన్ (సెప్టెంబర్ 22 - అక్టోబర్ 22; తులారాశి)

  రావెన్ (సెప్టెంబర్ 22 - అక్టోబర్ 22; తులారాశి)

  ఈ రాశి వారు ఎనర్జిటిక్ గా ఉంటారు. వ్యాపారవేత్తలుగా సక్సెస్ అవుతారు. అలాగే, వీరు నమ్మకస్తులు కూడా. అంతేకాదు, వీరు తమ భాగస్వాములకు సంతోషాన్ని పంచడానికి ఎంత దూరమైనా వెళతారు. వీరు కళాకారులు అలాగే రచయితలు అవడానికి ఆస్కారం ఉంది. మరోవైపు, వీరికి వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం వెన్నతో పెట్టిన విద్య.

  స్నేక్ (అక్టోబర్ 23- నవంబర్ 22;వృశ్చికరాశి)

  స్నేక్ (అక్టోబర్ 23- నవంబర్ 22;వృశ్చికరాశి)

  ఈ జోడియాక్ సైన్ కి చెందిన వారు ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారు. రాయల్ మరియు షార్ప్ నేచర్ వలన వారి ప్రియమైన వారు కూడా వీరితో మాట్లాడడానికి జంకుతారు. మరోవైపు, వీరు గొప్ప నాయకులు కాగలరు. సరైన దారిలో వీరి ఎనర్జీ ఫ్లో అయితే వీరు గొప్ప నాయకులుగా కీర్తి పొందుతారు.

  ఓల్ (నవంబర్ 23- డిసెంబర్ 21; ధనుస్సు రాశి)

  ఓల్ (నవంబర్ 23- డిసెంబర్ 21; ధనుస్సు రాశి)

  ఈ ఇండివిడ్యుయల్స్ దయాగుణం కలిగిన వారు. వీరు ఇతరుల అభిప్రాయాలను వినడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. వీరు అవుట్ గోయింగ్ నేచర్ కలిగిన వారు. వారి మాటలతో ఎటువంటి వారినైనా ఇంప్రెస్ చేస్తారు. వీరి సంభాషణా చాతుర్యానికి అందరు మంత్రముగ్ధులవుతారు.

  గూస్ (డిసెంబర్ 22-జనవరి 19; మకరరాశి)

  గూస్ (డిసెంబర్ 22-జనవరి 19; మకరరాశి)

  ఈ రాశికి చెందిన వారు జీవితమంటే ఒక స్పష్టమైన అభిప్రాయం కలిగి ఉంటారు. తమ లక్ష్యాలపై గురిపెడుతూ ఉంటారు. అయితే, కొన్ని సార్లు బాధకి అలాగే డిప్రెషన్ కి గురయ్యే ప్రమాదం ఉంది. అయినా కూడా పోటీలో నెగ్గుకురాగలుగుతారు.

  ఆటర్(జనవరి 20- ఫిబ్రవరి 18; కుంభరాశి)

  ఆటర్(జనవరి 20- ఫిబ్రవరి 18; కుంభరాశి)

  ఈ రాశివారికి విభిన్న రంగాలలో నైపుణ్యం కలదు. ప్రెసెంటేషన్ టెక్నీక్స్ లో వీరికి ప్రావీణ్యం ఉంది. అలాగే సృజనాత్మకంగా పనులను చేసేందుకు ఇష్టపడతారు. అనుకున్న పని మొదటి సారి జరగకపోయినా ఆ పనిని పూర్తిచేసేందుకు తమ సృజనాత్మకతను అంతా జోడిస్తారు.

  వోల్ఫ్ (ఫిబ్రవరి 19-మార్చ్ 20; మీనరాశి)

  వోల్ఫ్ (ఫిబ్రవరి 19-మార్చ్ 20; మీనరాశి)

  ఈ రాశికి చెందిన వారు భావోద్వేగాలు ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు అన్ని రాశుల కంటే ఎక్కువ సెంటిమెంటల్. అదే సమయంలో, వీరికి బాధ్యతలేకుండా ఫ్రీ గా తిరగడమంటే ఇష్టం. అందువలన, లైఫ్ లో బాలన్స్ ని మెయింటైన్ చేయడానికి ఇష్టపడతారు.

  English summary

  Have You Heard About The American Zodiac Signs?

  American zodiac signs are based on the spiritual connection of an individual with their counterpart animal. These specific animals define each zodiac sign as follows: Aquarius-Otter; Pisces-Wolf; Aries-Falcon; Taurus-Beaver; Gemini-Deer; Cancer-Woodpecker; Leo-Salmon; Virgo-Bear; Libra-Raven; Scorpio-Snake; Sagittarius-Owl and Capricorn-Goose.
  Story first published: Friday, February 23, 2018, 16:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more