For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, క్రితం జన్మలో మీరు ఎలా మరణించారో తెలుసుకునే వీలుందా?

|

కొన్నిసార్లు విమర్శలకు గురైనప్పటికీ, ఇంటర్నెట్లో అత్యధికంగా శోధించిన కీలక పదాలలో జ్యోతిష్యం ఒకటి. నమ్మినా, నమ్మకపోయినా, జ్యోతిషశాస్త్రంమీద నమ్మకం లేనివారికి కూడా ఆసక్తి కలిగిస్తూ వారి మనస్సులను కూడా ప్రలోభపరిచేదిలా ఉంటుంది. దీనికి కారణం,ఎంతో సులభంగా ప్రపంచంలోని అనేకమంది వ్యక్తిత్వాలను రాశిచక్రాల సంకేతాలతో కలుపుతుంది, క్రమంగా అందరినీ కట్టిపడేస్తుంది.

మీరు జన్మించిన నెల, మీ గత జీవితానికి ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండవచ్చు అని ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష్కులు వాదించారు. జీవితంలో ప్రతి అంశమూ విధి మీదనే ఆధారపడి ఉంటుంది. మరియు వీటి మద్య సంబంధాలు కూడా యాదృచ్చికంగా ఉంటాయి. అంతే కాకుండా, మీ గత జీవితంలో మీరు మరణించిన విధానాన్ని అంచనా వేయడానికి కూడా మీ పుట్టినరోజు లేదా నెల కూడా ఉపయోగపడవచ్చు అని చెప్తారు జ్యోతిష్య పండితులు.

how did you die in your past life according your zodiac sign

మీ రాశిచక్రం మీగురించి మీఊహకు మించిన అనేక విషయాలను వెల్లడిస్తుంది. మీరు మీ గతజీవితంలో ఎలా చనిపోయారనే అంశంతో సహా.

how did you die in your past life according your zodiac sign

కాబట్టి జ్యోతిష్య పండితుల ప్రకారం మీరు మీ గతజీవితంలో ఎలా చనిపోయారు మరియు మీ ప్రస్తుత జీవితంలో మీరు జాగ్రత్తపడాల్సిన అంశాలు ఏమిటి? తెలుసుకోడానికి ఈవ్యాసం చూడండి.

1.మేషం(మార్చి21-ఏప్రిల్19)

1.మేషం(మార్చి21-ఏప్రిల్19)

మీ రాశిచక్రం ఒకవేళ మేషం అయితే, మీరు ధైర్యవంతులుగా, సాహసవంతులుగా ఉంటారు. సవాళ్లను చేపట్టడానికి అస్సలు సంకోచించరు. మీ రాశ్యాధిపతి కుజుడు. మీ మూలకం అగ్ని. మీరు భావోద్వేగాలతో మరియు ఉద్వేగభరిత లక్షణాలతో ఉంటారు.

మీరు ఎలా మరణించారు?

మీరు మేషరాశిలో జన్మించినట్లయితే, మీ గతజీవితంలో మీరు కాల్చి చంపబడ్డారన్న అవకాశం ఉంది. బహుశా ఒక స్నేహితుడు లేదా మీ ప్రియమైన వ్యక్తిచేతనే చంపబడ్డారు అని చెప్పబడింది. స్నేహం నటించే వారిని కనుగొని దూరంగా ఉంచండి.

2.వృషభం (ఏప్రిల్20-మే20)

2.వృషభం (ఏప్రిల్20-మే20)

వృషభరాశి వారి మూలకం భూమి. క్రమంగా భూమికున్నంత ఓర్పు, సహనం మరియు విశ్వసనీయత వీరి ఆభరణాలుగా ఉంటాయి. దయ కలిగిన వారిగా, ఆచరణాత్మక విధానాలను పాటిస్తూ సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని పొందుతారు. మీ చుట్టూతా ఎల్లప్పుడూ ఒక సమూహం ఉంటుంది మరియు అనేకమంది స్నేహితులు ఉంటారు.

మీరు ఎలా మరణించారు?

మీ రాశిచక్రం ప్రకారం, మీరు దీర్ఘకాలికంగా ఆయురారోగ్యాలతో, ఫలవంతమైన మరియు ప్రశాంతమైన జీవితాన్ని గడిపిన తరువాతనే మరణించారు. మీరు జాగ్రత్త పడవలసిన సంకేతాలు, మీ ఆరోగ్య సమస్యలుగా ఉంటాయి. వైద్యుని సంప్రదించి, తరచుగా పరీక్షించుకుంటూ మీ ఆరోగ్యంపట్ల శ్రద్దని వహిస్తే, ఈజన్మలో కూడా క్రితంలాగే సుదీర్ఘమైన, సంతోషకరమైన జీవితాన్ని గడుపగలరని తెలుసుకోండి.

 3.మిధునం (మే21- జూన్20)

3.మిధునం (మే21- జూన్20)

మీరు మిధునరాశికి చెందిన వారైతే, ప్రేమ మరియు అభిమానం కలయికల మేళవింపుగా ఉంటారు. మిధునరాశిలో శీఘ్రబుద్ది మరియు హాస్యచతురత అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. మీ ఈలక్షణాల వలన, ఎక్కడికెళ్ళినా కొత్త స్నేహితుల సమూహాన్ని ఏర్పరచుకోగలరు.

మీరు ఎలా మరణించారు?

మీరు ఒక మిధునరాశికి చెందిన వారు అయితే, గత జన్మలో ఎత్తు నుండి పడిపోవటం కారణంగా మరణించారని చెప్పబడింది. బహుశా మీరు పొరపాటున పడడం లేదా ఎవరైనా మిమ్ములను ముందుకు తోయడం ద్వారా జరిగింది. కావున ప్రధానంగా, ఎత్తైన భవనాలు, పర్వతాలు మరియు జెయింట్ వీల్ వంటి వాటి నుండి దూరంగా ఉండాలని సలహా ఇవ్వబడింది. తక్కువ ఎత్తులో ఉండండి.,సురక్షితంగా ఉండండి.

4.కర్కాటకం (జూన్ 21- జూలై 22)

4.కర్కాటకం (జూన్ 21- జూలై 22)

కర్కాటకరాశికి చెందిన వారు అత్యంత అనుకూలమైన, సున్నితమైన వ్యక్తులుగా ఉంటారు. ఎటువంటి పరిస్థితులలోనైనా ఇమిడిపోయే నీటి వంటి తత్వాన్ని కలిగి ఉంటారు. మీరు ఒక కర్కాటకరాశికి చెందిన వ్యక్తి అయితే, మీరు భావోద్వేగాలకు కేంద్రబిందువుగా విశ్వసనీయమైన లక్షణాలతో కూడి ఉంటారు. మరియు సృజనాత్మకంగా ఉంటారు. ఈ రాశిచక్రానికి చెందిన ప్రజలు నిజాయితీగా ఉండడంతో పాటు, తమ ప్రియమైనవారి పట్ల నిబద్దతను, విశ్వసనీయతను, జాగ్రత్తను ప్రదర్శిస్తుంటారు.

మీరు ఎలా మరణించారు?

మీరు కర్కాటకరాశికి చెందిన వారైతే, మీ గతజీవితంలో నీటిలో మునిగిపోయి మరణించినట్లు చెప్పబడింది. దీనిని నివారించడానికి, ఈతకొలనులు, సరస్సులు, బీచ్లు, నీటివనరులు మరియు వాటర్ పార్క్స్, మానవ నిర్మిత బావులు వంటి వాటికి దూరంగా ఉండవలసినదిగా సూచించడమైనది.

5.సింహం(జూలై23-ఆగస్టు 22)

5.సింహం(జూలై23-ఆగస్టు 22)

సింహం, అగ్నికి ప్రధాన సంకేతం, ఉద్వేగభరితమైన ఆలోచనలు కూడి, కోరికలు మెండుగా కలిగినవారు వీరు. నీవు సింహరాశికి చెందిన వ్యక్తి అయితే, సృజనాత్మకత కలిగిన వ్యక్తిగా, కష్టపడి శ్రమించే వ్యక్తిగా, మరియు జాలి, దయ కలిగిన వ్యక్తిగా ఉంటారు. మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా మీరే ఉంటారు, తర్వాతే ఎవ్వరైనా అన్న భావన మీది.

మీరు ఎలా మరణించారు?

మీరు ఒక సింహరాశికి చెందిన అయితే, మిమ్ములను మీ కార్యాలయంలోని వారే ఎవరైనా హత్య చేసే అవకాశం ఉంది. మీరు మాట్లాడే ప్రతి మాట గురించిన అవగాహన మీకు ఉండాలి. మీమాటల కారణంగా భాదపడిన వాళ్ళు కాని, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళ వలన కాని మీకు ఆపద తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కావున కనీస జాగ్రత్త అవసరం.

6.కన్య (ఆగస్టు23 - సెప్టెంబర్22)

6.కన్య (ఆగస్టు23 - సెప్టెంబర్22)

మీరు ఒక కన్యారాశికి చెందిన వ్యక్తి అయితే, మీరు సున్నితమైన మనస్కులుగా, దూరదృష్టి కలిగిన వారిగా, మరియు తక్కువ మాట్లాడే వ్యక్తిగా ఉంటారు. కష్టించి పనిచేసే మనస్తత్వం కలిగిన మీరు, ఏ పనియందైనా ప్రణాళికాబద్దమైన ఆలోచనలను కలిగి ఉంటారు. ఉదార స్వభావం కలిగి, మీ కుటుంబం మరియు ప్రియమైనవారి పట్ల నిబద్దతను కలిగి ఉంటారు.

మీరు ఎలా మరణించారు?

మీరు ఒక కన్యారాశికి చెందిన వ్యక్తి అయితే, మీరు మీ గతజీవితంలో కారు ప్రమాదంలో మరణించిన అవకాశం ఉంది! ఈ జన్మలో సురక్షితంగా ఉండుటకు, నిర్లక్ష్యమైన డ్రైవింగ్ మరియు రద్దీ రహదారులను నివారించండి. తాగి, డ్రైవింగ్ చేసే అలవాట్లు ఉంటే తక్షణమే మానండి. మీరు సరిగ్గా డ్రైవ్ చేయలేరని భావిస్తే మీ స్నేహితుల సహాయం తీసుకోండి.

7. తుల (సెప్టెంబర్23-అక్టోబర్22)

7. తుల (సెప్టెంబర్23-అక్టోబర్22)

మీరు తులారాశికి చెందిన వ్యక్తులైతే, సమాజంలో గౌరవ ప్రతిష్టలకు ఏమాత్రం కొదువ లేని వారిగా ఉంటారు. మరియు గొప్ప వక్తగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అద్భుతమైన మాట్లాడే నైపుణ్యాలను కలిగి ఉన్న వారిగా అందరి మన్ననలను పొందుతారు. మీసంభాషణలను నలుగురు వినుటకు ఉత్సుకతను ప్రదర్శిస్తుంటారు. తులారాశి వారు హింసకు వ్యతిరేకంగా ఉంటారు మరియు అసౌకర్య పరిస్థితులకు దూరంగా ఉంటారు.

మీరు ఎలా మరణించారు?

మీరు తులారాశికి చెందిన వ్యక్తి అయితే, మీరు ఒక తెలియని లేదా చనిపోయేనాటికి గుర్తుపట్టని అనారోగ్యంతో మరణించిన అవకాశం ఉంది. మీరు క్రమంతప్పకుండా మెడికల్ చెకప్ పొందడం, ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోవడం, మీ పరిసరాలను శుభ్రంగా ఉంచడం వంటివి చేసుకోవలసినదిగా సూచించడమైనది.

8. వృశ్చికం (అక్టోబర్23-నవంబర్21)

8. వృశ్చికం (అక్టోబర్23-నవంబర్21)

వృశ్చికరాశి వారి స్నేహపూర్వక స్వభావం వారిని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతుంది. వీరి ఆలోచనలను ఎల్లప్పుడూ కుటుంబ సభ్యుల మరియు ప్రియమైనవారి శ్రేయస్సు కొరకే అన్నట్లు ఉంటుంది. వారు ఒక వాదన ప్రారంభించే ముందు వారి దృష్టికోణంలో ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

మీరు ఎలా మరణించారు?

మీరు ఒక వృశ్చికరాశికి చెందిన వ్యక్తి అయితే, మీరు ఒక సీరియల్ కిల్లర్ చేత చంపబడిన అవకాశాలు ఉన్నాయి. ఒంటరిగా ఉండడం, రాత్రి వేళల్లో ఆలస్యంగా ఇంటికి రావడం వంటివి మంచిది కాదు. సమూహాలలో ప్రయాణం చేయడం, వీలైన మేర జాగ్రత్తగా ఉండేలా ప్రయత్నించడం మంచిదిగా సూచించబడినది.

9.ధనుస్సు (నవంబర్ 22- డిసెంబర్ 21)

9.ధనుస్సు (నవంబర్ 22- డిసెంబర్ 21)

మీరు ఒక ధనుస్సురాశికి చెందిన వ్యక్తి అయితే, మీరు వ్యంగ్య ధోరణి కలిగి, మరియు హాస్య చతురతను కలిగిన వారిగా ఉన్నారు. మీరు మీ స్వంత నిబంధనల ప్రకారం జీవిస్తున్నారు మరియు ప్రతిరోజూ ఉత్తమంగా ఉండేలా మీ జీవనశైలిలో మార్పులు చేస్తూ ఉంటారు. స్వేచ్చకు అధిక ప్రాముఖ్యతని ఇస్తారు మరియు మీరు పంజరంలో చిలకలా బ్రతకడాన్ని ఎన్నటికీ స్వీకరించలేరు. మీ మాటలకు అడ్డు పడడాన్ని ఎన్నటికీ సహించలేరు. మీ భావోద్వేగాలతో నిరంతర పోరాటం ఉంటుంది.

మీరు ఎలా మరణించారు?

మీరు మీ గత జీవితంలో ఆత్మహత్య చేసుకున్న అవకాశం ఉంది. నిరాశ మరియు ఆందోళన సంకేతాలు ఉన్న ఎడల, అవసరమైతే మానసిక వైద్యుని సంప్రదించండి.

10.మకరం (డిసెంబర్ 22- జనవరి 19)

10.మకరం (డిసెంబర్ 22- జనవరి 19)

మకర రాశికి చెందిన వ్యక్తులు, బాధ్యత కలిగిన వారిగా, ఓర్పు సహనం కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. మీరు ఒక మకర రాశికి చెందిన వారైతే, మీరు గొప్ప వ్యక్తులుగా మరియు అద్భుతమైన స్వీయ నియంత్రణ కలిగి ఉన్న వ్యక్తులుగా ఉన్నారు. మరియు శాంతికాముకులుగా ఉంటారు.

మీరు ఎలా మరణించారు?

మీరు ఒక మకర రాశికి చెందిన వ్యక్తి అయితే, మీరు అపహరించి, హత్య చేయబడిన అవకాశం ఉంది. మీరు అపరిచితులకు కాస్త దూరంగా ఉండాలి. తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

11. కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)

11. కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)

కుంభ రాశిలో పుట్టిన వారు కొంచం పిరికిగా మరియు మానసిక స్తబ్దతను కూడుకున్న వారిగా ఉంటారు. కానీ మరోవైపు, విపరీత ధోరణి కలిగి, ఏ చిన్న మాటను సహించలేని వ్యక్తులుగా ఉంటారు. అయితే, అత్యంత తెలివితేటలు కలిగిన వ్యక్తులుగా, సులభంగా సమస్యలను పరిష్కరించగలిగిన వారిగా ఉంటారు.

మీరు ఎలా మరణించారు?

మీరు ఒక కుంభరాశి వారైతే, మీరు ఒక అగ్నిలో పడి మరణించిన అవకాశం ఉంది. అగ్ని దూరంగా ఉండండి. వంటలో జాగ్రత్తగా ఉండండి. విద్యుత్ ఉపకరణాలను విషయంలో జాగ్రత్తగా వహించండి.

12. మీనం (ఫిబ్రవరి19 - మార్చి20)

12. మీనం (ఫిబ్రవరి19 - మార్చి20)

మీనరాశి వారు స్నేహపూర్వకంగా ఉంటారు, వీరు ఎక్కడ ఉన్నా ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. వీరు నిస్వార్థమైన వ్యక్తులుగా ఉంటారు. ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయటానికి ఇష్టపడే వారిగా ఉంటారు. సానుభూతి, భావోద్వేగ సామర్ధ్యం వీరి ఆభరణాలుగా ఉంటాయి. వీరు నిర్ణయాత్మక ధోరణి కలిగిన వారిగా ఉంటారు. తమ పరిసరాలు తమకు అనుగుణంగా లేని ఎడల అసౌకర్యానికి గురవుతుంటారు.

మీరు ఎలా మరణించారు?

మీరు మీనరాశికి చెందిన వారైతే, వయసు మీరిన తర్వాత ఫ్లూ లేదా సాధారణ జలుబు కారణంగా మీరు మరణించారు. మీరు చలి, చల్లని పదార్ధాలు మొదలైనవాటికి దూరంగా ఉండాలి.

English summary

how did you die in your past life according your zodiac sign

Your zodiac sign reveals a lot about you, about ways more than you can possibly think of, beyond your imagination, including how you died in your past life.
Story first published: Thursday, July 5, 2018, 19:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more