న్యూమరాలజీ మీ జీవితంలో ఆత్మీయతానురాగాలపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

న్యూమరాలజీ అనేది సంఖ్యాశాస్త్రం. అంకెలను ఆధారంగా తీసుకుని మనుషుల ప్రవర్తనని అలాగే మనుషులకు సంబంధించిన విషయాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించే శాస్త్రం. మీ సైకిక్ నంబర్స్ ని ఆధారంగా తీసుకుని ఒక అంచనాకు న్యూమరాలజీ ద్వారా వస్తారు.

ఈ సైకిక్ నంబర్స్ అనేవి మీ వ్యక్తిత్వం మరియు లక్షణాలపై ప్రభావం చూపిస్తాయి. మరోవైపు, లైఫ్ పాత్ నంబర్ అనేది డెస్టినీ మిమ్మల్ని ఎటువైపు నడిపిస్తుందో వివరిస్తుంది.

How Does Numerology Influence Your Love Life

ఇప్పుడు, ఈ ఆర్టికల్ లో న్యూమరాలజీ ఏ విధంగా మీ జీవితంపై అలాగే ప్రేమానురాగాలపై ప్రభావం చూపుతుందో వివరించడం జరిగింది.

మీ డేట్ ఆఫ్ బర్త్ ను ఆధారంగా తీసుకుని ఈ ప్రెడిక్షన్స్ ను చేయవచ్చు. ఉదాహరణకి, మీ బర్త్ డే అనేది జనవరి 1st, 1991 లో పడితే, అప్పుడు 1+1+1+9+9+1= 22 అనే సంఖ్య వస్తుంది. సింగిల్ డిజిట్ గా మారిస్తే 2+2=4 అవుతుంది.

నంబర్ #1

నంబర్ #1

ఈ సంఖ్యకు చెందిన వ్యక్తులు ప్రేమ వ్యవహారాలలో ప్రధాన పాత్ర పోషిస్తారు. వీరు ప్రేమపై భక్తిభావంతో ఉంటారు. అగ్రెసివ్ సెక్సుయాలిటీని ఇష్టపడతారు. సహజంగా వీరు అధిపత్యభావం కలిగినవారు. ఎదురులేని వ్యక్తిగా ఉండేందుకు ఇష్టపడతారు.

నంబర్ #2

నంబర్ #2

ఈ సంఖ్యకు చెందిన వ్యక్తులు రిలేషన్ షిప్ అనేది సజావుగా సాగేందుకు ఎంతటి కష్టమైనా పడతారు. తమ ప్రేమికుడికి/ప్రేమికురాలికి ఏ సమయంలోనైనా ఎమోషనల్ సెక్యూరిటీని అందించడానికి ముందుంటారు.

నంబర్ #3

నంబర్ #3

నంబర్ 3 కి చెందిన వారు ఫన్ గా ఎనర్జటిక్ గా అలాగే లవ్ మేకింగ్ లో ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇష్టపడే వ్యక్తులు. వ్యక్తులుగా, వీరు అసహజంగా ఉంటారు. వీరు సృజనాత్మకత కలిగిన వారు. ఈ వ్యక్తులకు సెక్స్ అనేది ఫాంటసీకి అలాగే హ్యాపీనెస్ కు ఒక మార్గం.

నంబర్ #4

నంబర్ #4

నంబర్ #4 కి చెందిన వ్యక్తులకు రొమాన్స్ పై అలాగే సెక్స్ పై సాధారణంగా ఇంట్రస్ట్ ఉండదు. తమ పార్ట్నర్ కి సహాయం అందించడం అలాగే వారిని సుఖపెట్టడం వీరి ఉద్దేశ్యం. ప్రేమలో పడటం వీరికి ముఖ్యమైన విషయం.

నంబర్ #5

నంబర్ #5

ఈ సంఖ్యకు చెందిన వ్యక్తులు ప్యాషనేట్ గా ఉంటారు. వీరికి తీవ్రమైన లైంగిక వాంఛ కలిగి ఉంటుంది. వీరు ధైర్యవంతమైన ప్రేమికులు. కొన్నిసార్లు హింసాత్మకంగా కూడా ఉంటారు. పిచ్చిగా ప్రవర్తించవచ్చు. మరోవైపు, వీరు ఆపోజిట్ సెక్స్ కి ఆకర్షణీయంగా ఉంటారు.

నంబర్ #6

నంబర్ #6

ఈ సంఖ్యకు చెందిన వ్యక్తులకు విడిపోవడమంటే నచ్చదు. రిలేషన్ షిప్ స్మూత్ గా నడిచేందుకు తమవంతు కృషి చేస్తారు. వ్యక్తులుగా వీరికి తమ కుటుంబంతో అనుబంధం ఎక్కువగా ఉంటుంది. ఈ సంఖ్యకి చెందిన వ్యక్తులు స్టేబుల్ పార్ట్నర్స్ తో ఉన్నప్పుడు అత్యుత్తమంగా ఉంటారు.

నంబర్ #7

నంబర్ #7

ఈ సంఖ్యకు చెందిన వ్యక్తులు రిలేషన్ షిప్ కి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. వీరు కొన్ని సార్లు మెటీరియల్ థింగ్స్ పై ఆసక్తి కోల్పోయి, ఆధ్యాత్మికతకు ఆకర్షితులవుతారు. వీరు తమ పార్ట్నర్ ని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. వీరికి ఏకాంతంగా ఉండటం ఇష్టం.

నంబర్ #8

నంబర్ #8

ఈ సంఖ్యకు చెందిన వ్యక్తులు సెక్స్ విషయంలో క్రేజీ గా ఉంటారు. లుక్స్ పై అలాగే ప్రకృతిపై కూడా క్రేజీగా ఉంటారు. వీరు సున్నిత హృదయులు. ఉద్వేగం ఎక్కువ. వీరి అభిప్రాయంలో సెక్స్ అంటే మెటీరియల్ పవర్. వీరు అవకాశవాదులు. పవర్ ని అలాగే ఇన్ఫ్లుయెన్స్ ని బిల్డ్ చేసుకునేందుకు సెక్స్ ను వాడుకుంటారు.

నంబర్ #9

నంబర్ #9

ఈ సంఖ్యకు చెందిన వ్యక్తులు తమ భాగస్వామితో ప్రేమగా అలాగే కేరింగ్ గా ఉంటారు. వీరు సానుభూతిగలవారు. వీరిని ఇతరులు గ్రాంటెడ్ గా తీసుకునే అవకాశం ఉంది. తమ పార్ట్నర్స్ కి హెల్ప్ చేయడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఈ వ్యక్తులు సెక్స్ కు అలాగే నిజమైన ఆప్యాయతకు మధ్య కన్ఫ్యూజ్ అవుతారు. మరోవైపు, వీరు తమ పార్ట్నర్ నుంచి ప్రేమ గురించి భద్రతా భావాన్ని పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు.

గమనిక: ఇవి సాధారణంగా చేసిన ప్రెడిక్షన్స్. సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్ ను కలవడం ద్వారా మీకు ఖచ్చితమైన ప్రెడిక్షన్స్ తెలుస్తాయి.

English summary

How Does Numerology Influence Your Love Life

How often do you think that numbers play a role in influencing your life and intimacy? According to numerology, it is revealed that each number has its own importance. These numbers will help in understanding the individual and improve his/her love life and intimacy.Influence Of Numerology On Love Life