రాశిచక్రాల ఆధారంగా లైఫ్ లో బాలన్స్ ని పొందడమెలా?

Subscribe to Boldsky

మన వ్యక్తిత్వంపై అలాగే మన ప్రవర్తనపై కొన్ని అంశాలు ప్రభావం చూపుతాయన్న విషయం మీకు తెలుసా? రాశిచక్రం ఆధారంగా మీకు కాస్తంత గైడెన్స్ లభిస్తే మీరు పెర్ఫెక్ట్ లైఫ్ ను లీడ్ చేయగలుగుతారు.

జీవితం సాఫీగా గడిచిపోవాలంటే కొన్ని అంశాలపై మనం ప్రత్యేక దృష్టిని సారించాలి. రాశిచక్రాలకు సంబంధించినవైతే వాటిని పాటించి జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం మరింత సులభతరం కూడా!

కాబట్టి, జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి రాశిచక్రాల పరంగా లభించే సలహాలను సూచనలు పాటిస్తే మంచిది.

మేషరాశి: మార్చ్ 21 - ఏప్రిల్ 19

మేషరాశి: మార్చ్ 21 - ఏప్రిల్ 19

వీరు అనుకున్నది సాధించాలనే కోరిక ఎక్కువగా కలిగి ఉన్నవారు అలాగే వీరికి కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువే. అదే సమయంలో వీరు షార్ట్ టెంపర్ సమస్యతో సతమతమవుతారు. అలాగే, అవేశపరులు కూడా. వీరు తమ మనస్సుని ప్రశాంతపరచుకోవడానికి ప్రతి రోజూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. మెడిటేషన్ చేయాలి. వర్క్ ని అలాగే పెర్సనల్ లైఫ్ ని బాలన్స్ చేయడం తెల్సుకోవాలి. అలాగే, రొటీన్ ని సింప్లిఫై చేసుకోవడం ద్వారా ఇంటి బాధ్యతలని అలాగే వృత్తిపరమైన బాధ్యతలని చక్కగా నిర్వర్తించుకోగలుగుతారు.

వృషభ రాశి: ఏప్రిల్ 20 - మే 20

వృషభ రాశి: ఏప్రిల్ 20 - మే 20

వీరు సహృదయులు. దయభావం కలిగినవారు. అయితే, కొన్ని సమయాలలో కఠినంగా వ్యవహరిస్తారు. మొండిపట్టుదల పడతారు. స్వార్థంగా ఆలోచిస్తారు. లైఫ్ లో బాలన్స్ ని పొందేందుకు వీరు ఏదైనా నిర్ణయాన్ని తీసుకునే ముందు దాని వలన కలిగే పర్యవసానం గురించి దీర్ఘంగా ఆలోచించాలి. ఇతరులపై వీరి నిర్ణయం ఏ మేరకు ప్రభావం చూపుతుందో గమనించాలి. అలాగే, ఇతరుల ఆలోచనలను కూడా వినడం అలాగే అవసరమైతే పాటించడం వంటివి చేయాలి.

మిథున రాశి: మే 21 - జూన్ 20

మిథున రాశి: మే 21 - జూన్ 20

వీరు అత్యంత మేథావులు. అయితే, విపరీతమైన మానసిక ఒత్తిడికి వీరు గురవుతారు. జీవితాన్ని ఆహ్లాదంగా మలచుకోవాలంటే, వీరు తమ టెన్షన్ ని కంట్రోల్ చేసుకోవాలి. మెడిటేషన్ ని సాధన చేయాలి. ఆ విధంగా మానసిక ఒత్తిడి నుంచి వీరికి ఉపశమనం లభిస్తుంది.

కర్కాటక రాశి: జూన్ 21 - జూలై 22

కర్కాటక రాశి: జూన్ 21 - జూలై 22

వీరు కేరింగ్ తో పాటు ప్రొటెక్టివ్ యాటిట్యూడ్ కలిగిన వారు. అయితే, పరిమితులు దాటితే ఇబ్బంది కలగడం సహజం. అదే వీరి విషయంలోనూ జరుగుతుంది. కేరింగ్ పేరుతో అందరినీ అంటిపెట్టుకుని ఉంటారు. కాబట్టి, వీరు తమకోసం కొంత సమయాన్ని కేటాయించుకుని యోగాని సాధన చేయాలి. ఆ విధంగా పరిమితులలో ఎలా ఉండాలో వీరికి తెలుస్తుంది.

సింహ రాశి: జూలై 23 - ఆగస్టు 23

సింహ రాశి: జూలై 23 - ఆగస్టు 23

వీరు సృజనాత్మకతను కలిగి ఉంటారు. అలాగే, ధైర్యవంతులు. ఈ ప్రవర్తన వలన వీరు ఇతరులపై అజమాయిషీ చెలాయించే రకంగా కనిపిస్తారు. లైఫ్ లో బాలన్స్ కోసం వీరు తమ లిజనింగ్ స్కిల్స్ పై ఫోకస్ పెట్టాలి. ఇతరుల అభిప్రాయాలను వినడం నేర్చుకోవాలి.

కన్యా రాశి : ఆగస్టు 24 - సెప్టెంబర్ 23

కన్యా రాశి : ఆగస్టు 24 - సెప్టెంబర్ 23

ఈ రాశిలో జన్మించిన వారు పెర్ఫెక్షనిస్ట్ లుగా పేరుపొందుతారు. ప్రతి చిన్న విషయంపై విపరీతంగా ఆలోచిస్తారు. ఆ విధంగా వీరి చేష్టలు ఇతరులకు కొంత ఇబ్బందికరంగా మారతాయి. లైఫ్ లో బాలన్స్ ని పొందేందుకు, వీరు తమ ఇన్నర్ థాట్స్ పై శ్రద్ధ వహించాలి. తద్వారా, వీరికి ఏ విషయంపై ఎంత ఆలోచించాలి అన్నది తెలుస్తుంది.

లిబ్రా: సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

లిబ్రా: సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

వీరు ఆదర్శపూర్వకమైనవారు. ఇతరులు వీరి మాటలకు త్వరగా ప్రభావితులవుతారు. అయితే, లైఫ్ లో బాలన్స్ ని పొందేందుకు వీరు సాధ్యమైనంత కృషిని చేయాలి. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలోని నెగోషియేషన్స్ కి సంబంధించి సరైన నిర్ణయాలను తీసుకోవాలి. వీరి ఈజీ గోయింగ్ నేచర్ ని ప్రాక్టికాలిటీతో అలాగే కాన్ఫిడెన్స్ తో బాలన్స్ చేయడం అవసరం.

వృశ్చిక రాశి: అక్టోబర్ 24 - నవంబర్ 22

వృశ్చిక రాశి: అక్టోబర్ 24 - నవంబర్ 22

వీరు అత్యంత ప్యాషన్ కలిగిన వ్యక్తులు. అయితే, వీరి అసూయ అలాగే అబ్సెసివ్ నెస్ అనేవి వీరి బలహీనతలు. ఈ రెండు కోణాలను బాలన్స్ చేయడం అవసరం. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజులను వీరు సాధన చేయాలి. తద్వారా, తమ ఎమోషన్స్ పై కంట్రోల్ ని పొందగలుగుతారు.

ధనుస్సు రాశి: నవంబర్ 23 - డిసెంబర్ 22

ధనుస్సు రాశి: నవంబర్ 23 - డిసెంబర్ 22

ఈ వ్యక్తులు ఆశావాద దృక్పథం కలిగి ఉంటారు. అయితే, యూనివర్స్ అటువంటి ఆలోచనాధోరణిని ఎల్లప్పుడూ సపోర్ట్ చేయదన్న అంశాన్ని మరచిపోతూ ఉంటారు. లైఫ్ లో బాలన్స్ ని పొందేందుకు, వీరు రెండు సెట్ల లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. సాధ్యాసాధ్యాలను ప్రెడిక్ట్ చేయాలి. ఆ విధంగా వీరు రియాలిటీకి అలవాటు పడతారు.

మకర రాశి: డిసెంబర్ 23 - జనవరి 20

మకర రాశి: డిసెంబర్ 23 - జనవరి 20

వీరు అత్యంత ప్రాక్టికల్ మనస్తత్వం కలిగిన వారు. ప్రతి దాంట్లో చెడు జరిగే అవకాశం ఉందని భావించే వీరి సన్నిహితులకు వీరు దూరంగా ఉంటారు. వీరు, ప్రతి రోజుకు సంబంధించిన ఆహ్లాదకరమైన అంశాలను పొందుపరచుకుంటారు. ఆ విధంగా, పాజిటివ్ కోణాలను మళ్ళీ మళ్ళీ వల్లే వేసుకునేందుకు వీరు ఇష్టపడతారు.

కుంభ రాశి: జనవరి 21 - ఫిబ్రవరి 18

కుంభ రాశి: జనవరి 21 - ఫిబ్రవరి 18

వీరు ఎవరికీ అర్థం కారు. వీరి సన్నిహితులు కూడా వీరిని అర్థం చేసుకునేందుకు ఇబ్బందిపడతారు. వీరి చర్యలు ఉహించడానికి వీలు లేనివి. వీరి భావాలను సన్నిహితులతో అలాగే ప్రియమైన వారితో స్పష్టంగా పంచుకోవడం ద్వారా వీరు లైఫ్ ని బాలన్స్ చేసుకోగలుగుతారు.

మీన రాశి: ఫిబ్రవరి 19 - మార్చ్ 20

మీన రాశి: ఫిబ్రవరి 19 - మార్చ్ 20

వీరు సున్నితమనస్కులు. అందువలన వీరు గొప్ప వ్యక్తులవుతారు. అయితే, వారి ఆరోగ్యంపై ఈ సున్నితత్వం ప్రతికూల ప్రభావం చూపవచ్చు. వీరు ఒత్తిడికి ఎక్కువగా గురవుతారు. కాబట్టి, సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకుని అంచనా వేసుకుంటే వీరు ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. ఈ విధంగా వీరు లైఫ్ ని బాలన్స్ చేసుకోగలుగుతారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    How To Find Balance In Life, Based On Your Zodiac Sign

    To maintain balance in our individual lives, there are certain things that we need to follow and if these things are connected to our zodiac signs, then there is nothing better than that!So, check out on how you can make your life better by following certain advices and tips based on your zodiac sign…
    Story first published: Friday, February 2, 2018, 15:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more