మీరు పుట్టిన రోజును బట్టీ మీ జీవితంలో వచ్చే సమస్యలు.. సంతోషాలివే

Written By:
Subscribe to Boldsky

మీరు పుట్టిన రోజును బట్టీ మీపై గ్రహాల ప్రభావం ఉంటుంది. ఒక్కోరోజు పుట్టిన వారు ఒక్కోరకంగా జీవితంలో ముందుకెళ్తుంటారు. మీరు ఏ రోజు పుట్టారో తెలిసి ఉంటే మీ జీవితం ఎలాంటి మార్గంలో పయనించనుంది.. మీ వ్యక్తిత్వం ఏమిటనేది మీరు సులభంగా తెలుసుకోవొచ్చు.

సోమవారం

సోమవారం

మీరు సోమవారం జన్మించినట్లయితే మీలో కొన్ని ప్రత్యేక గుణాలుంటాయి. మీరు చేసే ప్రతి పనిలో కాన్ఫిడెంట్ గా ఉంటారు. కచ్చితంగా అందులో విజయం సాధిస్తాం అనే ధీమాతో మీరు ముందుకెళ్తారు. మీరు చాలా సున్నితంగా ఉంటారు. మీరు మృదు స్వభావం కలిగి ఉంటారు. అయితే విద్యార్థులు మాత్రం చదువు విషయంలో కాస్త అశ్రద్ధ వహిస్తారు. రానురాను చదువులోనూ రాణిస్తారు. మీరు ప్రతి క్షణం ఆనందంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. మీ చుట్టుపక్కల వారిని కూడా సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు.

మంగళవారం

మంగళవారం

మంగళవారం జన్మించిన వారు కాస్త ఎక్కువగా ఆవేశం కలిగి ఉంటారు. క్షణికావేశంతో వీరు ఏదేదో చేస్తుంటారు. వీరు వీరి సన్నిహితులతో కూడా తరుచుగా గొడవలు పడుతుంటారు. చిన్నచిన్న విషయాలను పెద్దగా చేసుకుంటారు. వీరు కాస్త కోపం తగ్గించుకుని అందరితో కలిసి మెలిసి ఉంటే చాలు. జీవితం మొత్తం హ్యాపీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వీరిలాగే నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండాలని వీరు భావిస్తారు.

బుధవారం

బుధవారం

మీరు బుధవారం జన్మించినట్లయితే చాలా విశిష్ట లక్షణాలు కలిగి ఉంటారు. మీరు ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలపై మొగ్గు చూపుతారు. మీలో ఎక్కువగా భక్తి ఉంటుంది. మీరు దేవుడిని ఎక్కువగా నమ్ముతారు. ఏదైనా తప్పు చేస్తే కచ్చితంగా దేవుడి శిక్షిస్తాడని మీరు నమ్ముతారు. వీరు ఇతరులతో చాలా మర్యాదపూర్వకంగా ఉంటారు. వీరు చాలా వినయస్థులు. వీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచిస్తారు.

గురువారం

గురువారం

మీరు గురువారం జన్మించినట్లయితే మీకు చాలా తెలివి ఉంటుంది. అలాగే ఏదైనా విషయంలో వెంటనే నిర్ణయం తీసుకునే గుణం మీకు ఉంటుంది. చాలా ధైర్యంగా ఉంటారు. ఎలాంటి కష్టాన్ని అయినా ఎదుర్కొనే దమ్ము ధైర్యం మీకు ఉంటుంది. ఇతరులకు ఎలాంటి హాని చేయకూడదని మీరు భావిస్తారు. మిమ్మల్ని ఎప్పుడూ అదృష్టం వరిస్తూనే ఉంటుంది. ఏది తప్పు.. ఏది ఒప్పు.. ఏ మార్గంలో వెళితే మంచిదనే విషయాల్లో మీకు మంచి జ్ఞానం ఉంటుంది.

శుక్రవారం

శుక్రవారం

మీరు శుక్రవారం పుట్టినట్లయితే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటారు. మీ చుట్టూ ఉన్న వాళ్లు కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మీరూ భావిస్తారు. మీపైన బ్రుహస్పతి ప్రభావం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనులు విజయవంతం అవుతాయి. మీరు కష్టాల నుంచి కూడా ఈజీగా గట్టు ఎక్కుతారు.

శనివారం

శనివారం

మీరు శనివారం జన్మించినట్లయితే మీకు వ్యవసాయం అంటే చాలా ఆసక్తి ఉండి ఉంటుంది. అలాగే వాణిజ్యం లేదా టెక్నాలజీ రంగాల్లోనే కూడా మీకు మంచి ఆసక్తి ఉంటుంది. అయితే మీరు జీవితంలో అప్పుడప్పుడు కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ సన్నిహితులు మీపై ఎక్కువగా ప్రేమ చూపుతారు.

ఆదివారం

ఆదివారం

మీరు ఆదివారం జన్మించినట్లయితే మీరు ఒక ప్రణాళికతో జీవితంలో ముందుకెళ్తూ ఉంటారు. మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. మీలో సామాజిక ఆలోచనలుగా కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు మీ కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. వారి ఆనందం కోసం ఏదైనా చేద్దాం అనుకుంటారు.

English summary

This Is How Your Birth Day Can Influence Your Life

This Is How Your Birth Day Can Influence Your Life
Story first published: Wednesday, January 3, 2018, 12:30 [IST]