For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జూలై-13-2018 రాశిచక్రాల మీద పాక్షిక సూర్య గ్రహణం యొక్క ప్రభావాలు

|

జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం, జూలై -13 -2018న వచ్చే పాక్షిక సూర్య గ్రహణం, రానున్న రోజుల్లో రాశి చక్రాల మీద కొన్ని ప్రతికూల ప్రభావాలను చూపనుందని తెలుస్తోంది. పాక్షిక సూర్య గ్రహణం కర్కాటక-మకర అక్షాన్ని అత్యధికంగా ప్రభావితం చేస్తుంది.

ఈ ప్రభావం నెల, లేదా సంవత్సరం కాకుండా, ఈరోజు నుండి 2020 వరకూ ఉండవచ్చని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెప్తున్నారు.

కావున, ఈ పాక్షిక సూర్య గ్రహణ ప్రభావం రాశిచక్రాల మీద చూపే ప్రభావాల గురించి తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

జూలై-13-2018 రాశిచక్రాల మీద పాక్షిక సూర్య గ్రహణం యొక్క ప్రభావాలు

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

పాక్షిక సూర్య గ్రహణ ప్రభావం చేత మీ కుటుంబ జీవితానికి సంబంధించి మీరు అనేక ప్రతికూలతలను ఎదుర్కొనబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా దీని ప్రభావం మీ భావోద్వేగాలపై అధిక ప్రభావాన్ని చూపనున్నాయి. క్రమంగా మానసిక స్థైర్యం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న రోజులలో మీకు అధికారాలు, భాద్యతలు పెరుగుతుంటాయి. సమయానుసారం నడుచుకోవలసిన పరిస్థితులు దాపురిస్తాయి. మీ అంతరాత్మకు కట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం మూలంగా మీరు కొన్నిటి నుండి బయటపడగలరు. రానున్న రోజులు మీ జీవన గమనాన్ని మెరుగుపరచడానికి మరియు పూర్తిగా మీశ్రేయస్సుపై దృష్టి పెట్టడానికి సరైన సమయంగా ఉంది.

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ పాక్షిక సూర్య గ్రహణం వృషభ రాశిపై ప్రభావాన్ని కలిగి ఉన్నట్టుగా కనిపిస్తోంది. మీరు రానున్న కాలంలో ప్రతి అడుగులో ఆచి తూచి వ్యవహరించవలసి ఉంటుంది. దీనికి తోడు, మీరు రాబోయే రోజుల్లో కొన్ని ఒప్పందాలను కూడా కుదుర్చుకోవలసి వస్తుంది. తలకు మించిన భారాలుగా మారడమే కాకుండా, మీకు విశ్రాంతి కూడా తక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. ఈ దశ మీ జీవితంలో కొత్త ప్రారంభాలను తెస్తుందని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం మీరు తీసుకునే నిర్ణయాలే రేపు మీ మరియు మీ కుటుంబ భవిష్యత్తుకు పునాదిరాళ్ళని మరవకండి.

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ పాక్షిక సూర్య గ్రహణం మీ ఆర్ధిక పరిస్థితిని అధికంగా ప్రభావితం చేస్తుందని తెలుస్తోంది. ఇది మీ భద్రతా భావాన్ని చైతన్యవంతం చేస్తుంది. రాబోయే రోజులలో, మీరు పెట్టుబడులు, ఆదాయం, మరియు వాస్తవిక అంశాలపై మరింత దృష్టి పెడతారు. మీరు మీ అంతరాత్మతో చర్చలు జరిపిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మరియు మీ మార్గంలో అనేక అవకాశాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి అంశంలోనూ తెలివిదే ప్రధాన భాద్యత అవుతుంది.

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

ఆర్ధిక మరియు వృత్తి సంబంధిత విషయాలలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తుంది. మరియు మీరు రాబోయే రోజుల్లో ఇతరులతో వ్యవహరించేటప్పుడు సాదుస్వభావాన్ని కలిగి ఉండాలి. అలాగని ఆత్మగౌరవానికి సమస్య కలిగేలా కాదు. కొన్ని చెడు సంబంధాల కారణంగా అపనిందలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కావున సంబంధాల విషయాలలో కాస్త జాగురూతులై వ్యవహరించడం మేలు.

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 23

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 23

పాక్షిక సూర్య గ్రహణం యొక్క ప్రభావం మీ ఆధ్యాత్మిక చింతను, మరియు ఫలితాలను పెంచే దిశగా కనిపిస్తుంది. మీ కలలు రాబోయే రోజులలో అత్యంత శక్తివంతమైనవిగా ఉండనున్నాయి. మీ లక్ష్యాలకు కొన్ని ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశాలు ఉన్న కారణంగా, ప్రతి నిర్ణయం మీ ప్రియమైన వారితో చర్చించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఎటువంటి విషయాలలో అయినా రెండవ కోణంలో కూడా ఆలోచించే మనస్థితి అలవరచుకోవాలి.

కన్యా రాశి : ఆగస్టు 24 - సెప్టెంబర్ 23

కన్యా రాశి : ఆగస్టు 24 - సెప్టెంబర్ 23

ఈ పాక్షిక సూర్య గ్రహణం ప్రత్యేకంగా కన్యా రాశి మీద అధికంగా ప్రభావితం చేస్తున్నట్లు కనిపిస్తోంది. సమాజంలో, లేదా జీవితంలో మీరు సరికొత్త పాత్రలోకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అనగా కుటుంబ జీవితం, ప్రమోషన్స్ మొదలైనవి. క్రమంగా మీ జీవితం ఎంతో ఉల్లాసభరితంగా జరగనుంది. ముఖ్యంగా మీ తోబుట్టువుల, కుటుంబ సభ్యుల సహకారం మెండుగా ఉంటుంది. మీరు పొరపాటున వ్యతిరేకంగా భావించిన వారే మీ అండగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యక్తులతో సంబంధాలు ఏర్పడడం మీ జీవితంలో ఆశించిన మార్పులను తీసుకుని రాగలదు.

తులా రాశి : సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

తులా రాశి : సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

పాక్షిక సూర్య గ్రహణం మీ జన్మ కుండలిలోని 10వ గృహం మీది అధికారాన్ని కలిగి ఉంటుంది. క్రమంగా సమాజంలో పేరు ప్రతిష్టలు పెరగడంతో పాటు, కెరీర్ మరియు ఆర్ధిక సంబంధిత విషయాలలో ఆశించిన ఫలితాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ వృత్తిపరమైన జీవితంలో కొత్త ప్రారంభాలను సూచిస్తుంది. మీరు చేయవలసినదంతా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండడం, క్రమంగా రాబోయే రోజులలో ధైర్యంగా అడుగులు ముందుకు వేయడం. ఈ సమయంలో మీ కుటుంబం, మీ జీవితంలో ముఖ్యమైన ప్రభావంగా ఉంది. మీరు నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు మీ కుటుంబసభ్యులతో, మీ ప్రియమైన వారితో చర్చించడం మేలు.

వృశ్చిక రాశి : అక్టోబర్ 24 - నవంబరు 22

వృశ్చిక రాశి : అక్టోబర్ 24 - నవంబరు 22

ఈ పాక్షిక సూర్య గ్రహణం వ్యక్తిగత విస్తరణలో మీ పురోగతిని సూచిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో, మీరు విహార యాత్రకు కాని, ప్రమోషన్ లేదా ఉద్యోగ రీత్యా మీకు నచ్చే ప్రదేశానికి వెళ్ళడంగానీ జరిగే సూచనలు ఉన్నాయి. ఏ విషయాల్లోనూ మీ నిర్ణయాలనందు రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో కొన్ని ప్రతికూల ప్రభావిత అంశాలు కనిపిస్తున్నా, భవిష్యత్తుకు అవరోధాలుగా మాత్రం ఉండవు.

ధనుస్సు రాశి : నవంబర్ 23 - డిసెంబరు 22

ధనుస్సు రాశి : నవంబర్ 23 - డిసెంబరు 22

ఈ పాక్షిక సూర్య గ్రహణం మీ జీవితంలో కొన్ని నూతన మార్పులకు శ్రీకారంలా గోచరిస్తుంది. ముఖ్యంగా గృహ, స్థలం కొనుగోలు వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు మొదలైన వాటిలో మీకు ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రతి అడుగులోనూ మీ భాగస్వామి సహకారం మీకు సంతోషాన్నిస్తుంది. ఆర్ధికంగా కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ఫలితాలు మాత్రం ఆశాజనకంగా ఉంటాయి.

మకర రాశి : డిసెంబర్ 23 - జనవరి 20

మకర రాశి : డిసెంబర్ 23 - జనవరి 20

పాక్షిక సూర్య గ్రహణం మీ జన్మ కుండలి నందు 7వ గృహంపై ప్రభావాన్ని కలిగి ఉంది. క్రమంగా మీ ప్రేమ వ్యవహారాలలో ఆశించిన ఫలితాలను పొందగలరు. ఇదివరకే మీరు సంబంధంలో ఉన్న ఎడల, మీకు రాబోయే రోజులు అత్యంత అనుకూలంగా ఉండనున్నాయి. కొన్ని మార్పులకు సిద్ధంగా ఉండాలి. ఎటువంటి వ్యవహారాలలో అయినా ఆశించిన ఫలితాలు గోచరిస్తున్నాయి. కానీ నిర్ణయాలు తీసుకునే ముందు చర్చలు కూడా ముఖ్యం. నూతన వస్తు కొనుగోలు, మరియు రాబడి వంటి అంశాలు ప్రధానంగా గోచరిస్తున్నాయి. ఆర్ధిక పరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. కానీ, కొన్ని చిన్న చిన్న కుటుంబ కలహాలు కాస్త సమస్యగా కనిపిస్తుంటాయి.

కుంభ రాశి : జనవరి 21 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 21 - ఫిబ్రవరి 18

పాక్షిక సూర్య గ్రహణం మీ ఆరోగ్యం మరియు రోజువారీ రొటీన్లలో నూతన ప్రారంభాలను తీసుకువస్తుంది. ముఖ్యంగా మీ జన్మకుండలిలో 6 వ గృహాన ప్రభావం చూపుతున్న కారణంగా రోజువారీ జీవితంలో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. రాబోయే రోజులలో, మీరు అన్నిటా కొత్త పద్ధతులను అవలంబించడంతోపాటు, మెరుగైన జీవితాన్ని చూస్తారు. ఆర్ధిక పురోగతి కూడా బాగుంటుంది. కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల సహకారాలు ఉండడం మీకు సంతోషాన్ని కలిగించే విషయంగా ఉంటుంది. శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ మరియు వృత్తి సంబంధిత వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు గోచరిస్తున్నాయి. మరియ సంఘంలో గౌరవ ప్రతిష్టలకు ఏమాత్రం కొదువ ఉండదు.

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ పాక్షిక సూర్య గ్రహణం యొక్క ప్రభావం మీ జన్మ కుండలిలోని 5 వ గృహాన్ని ప్రభావితం చేస్తుంది. క్రమంగా సృజనాత్మక ధోరణి పెరగడం, అభిరుచుల పట్ల సమయాన్ని కేటాయించడం వంటి అంశాలు గోచరిస్తున్నాయి. మీరు ఏ వృత్తిలో ఉన్నా, రోజుకో నూతన విధానాన్ని అవలంభిస్తూ కార్యాలయంలోనే కాకుండా కుటుంబంలో కూడా మన్ననలను అందుకుంటారు. మీరుకోరుకునేలా మీ పరిసరాలను, స్నేహితులను కలిగి ఉండడం మీకు సంతోషం కలిగించే విషయంగా ఉంటుంది. మరియు, మీరు ప్రేమించే వ్యక్తులు మీతో ఉండుటకు ఎక్కువ శ్రద్ద కనపరుస్తూ ఉంటారు. మీ సృజనాత్మక ధోరణి మీలోని ప్రతిభను వెలికి తీయడమే కాకుండా, సరికొత్త ఆలోచనలకు నిర్ణయాలకు ప్రధాన కారకంగా మారుతుంది.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆద్యాత్మిక, రాశి చక్ర, హస్తసాముద్రిక సంబంధిత విషయాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ వీక్షించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాతో పంచుకోండి.

English summary

July 13th, 2018: Partial Solar Eclipse Brings In The Worst Effects On Zodiacs

The zodiac experts reveal that the July 13th partial solar eclipse will an impact on all the zodiac signs for the coming days as the partial solar eclipse will be illuminating the Cancer-Capricorn axis. According to astrology, the illuminating of the Cancer-Capricorn axis occurrence happens with the powerful lunations. This will impact all the zodiac signs starting from today until 2020.
Story first published: Saturday, July 14, 2018, 10:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more