For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ నిన్ను డిస్ట్రబ్ చేస్తూనే ఉంటారు, పట్టించుకోకు, నీ పని నువ్వు చేసేయ్ #mystory353

నన్ను నమ్మి నాపై పెట్టుబడి పెట్టే వాళ్ల మాట వింటాగానీ.. నా టాలెంట్ తెలియకుండా నన్ను విమర్శించే జఫ్పాగాళ్ల గురించి నాకెందుకు. అన్నా.. నేను పొలిటికల్ అయినా క్రైమ్ అయినా హిస్టారికల్ రిలేటెడ్ అయినా, భక్తి

By Arjun Reddy
|

ఎవ్వడి మాట వినకు...మనిషి మాట అసలు వినకు ఇది నేను నమ్మే సిద్దాంతం. నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ని. నేను హైదరాబాద్ లో ఉంటాను. సినిమాలనే నమ్ముకుని బతుకుతున్నాను. కానీ నేను నమ్మిన విలువలు ఇప్పుడు లేవు. అవతలి వ్యక్తులు అవి పాటించనప్పుడు మనం వాటిని పట్టుకుని వేలాడడం తెలివితక్కువ పని.

నేనెందుకు పక్కనోడి గురించి ఆలోచించాలి

నేనెందుకు పక్కనోడి గురించి ఆలోచించాలి

అందుకే నా పంథా మార్చుకున్నాను. నా రాత మారింది.. నా ఆలోచన మారింది. నేను భక్తిపరమైన సినిమాలు తీస్తే నేను పని చేసే ఆర్గనైజేషన్ కూడా నన్ను ఎక్కువ రోజులు భరించదు. నాకు నెలనెలా డబ్బులిచ్చి మాకు ఇన్ని వ్యూస్ కావాలి.. మీరు ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ తీయండని చెప్పినప్పుడు నేనెందుకు పక్కనోడి గురించి ఆలోచించాలి.

పక్కనోడు ఎవడూ నాకు ఒక్క పూట అన్నం పెట్టడు

పక్కనోడు ఎవడూ నాకు ఒక్క పూట అన్నం పెట్టడు

పక్కనోడు ఎవడూ నా కుటుంబాన్ని పోషించడు. నాకు ఒక్కపూట అన్నం కూడా పెట్టడు. అలాంటి జెఫ్ఫాగానోళ్లు చెప్పే నీతులు వినడానికి బాగుంటాయి. కానీ అవి పాటిస్తే చిప్పకూడు తినాల్సి వస్తుంది. ఒకడు నువ్వు చేసే పని విమర్శిస్తున్నాడంటే వాడికి ఆ పని చేతకాదని అర్థం.

గలీజ్ గా ఉన్నాయంటే..

గలీజ్ గా ఉన్నాయంటే..

చేతకాని వాళ్లే అలా మాట్లాడుతారు. జీతం తీసుకుంటున్నా కాబట్టి నాకు ఇచ్చిన పని హండ్రెట్ పర్సెంట్ చేయడం నా బాధ్యత. నేనే అదే చేస్తాను. గలీజ్ గా ఉన్నాయి అని కామెంట్ చేస్తే.. నిన్ను ఎవ్వడు చూడమని చెప్పాడురా అని నేనంటాను.

నా స్క్రిప్ట్ అలాగే ఉండాలని చెప్పారు

నా స్క్రిప్ట్ అలాగే ఉండాలని చెప్పారు

నా స్క్రిప్ట్ మొత్తం రిలేషన్ షిప్ రిలేటెడ్ గానే ఉండాలని నాకు జీతం ఇచ్చేవాళ్లు చెప్పారు. వాళ్లు చెప్పిందే నేను చేస్తాను. నేను రాస్తాను. నేను అంతకన్నా పవర్ ఫుల్ స్టోరీలు రాయగలను. కానీ అవి వాళ్లకు అక్కర్లేదు. సమాజంలో సమస్యలను కళ్లకు కట్టేలా చూపించగలను. హిస్టారికల్ రిలేటెడ్ గా స్టోరీస్ అదరగొట్టగలను. కానీ అవన్నీ మాకు అక్కర్లేదని వారు అన్నారు.

Most Read :అతను నన్ను నమ్మించి మోసం చేశాడు, కంటిన్యూగా నెల రోజుల పాటు ప్రపోజ్ చేశాడు అందుకే నమ్మాను #mystory350Most Read :అతను నన్ను నమ్మించి మోసం చేశాడు, కంటిన్యూగా నెల రోజుల పాటు ప్రపోజ్ చేశాడు అందుకే నమ్మాను #mystory350

జఫ్పాగాళ్ల గురించి నాకెందుకు?

జఫ్పాగాళ్ల గురించి నాకెందుకు?

నన్ను నమ్మి నాపై పెట్టుబడి పెట్టే వాళ్ల మాట వింటాగానీ.. నా టాలెంట్ తెలియకుండా నన్ను విమర్శించే జెఫ్ఫాగాళ్ల గురించి నాకెందుకు. అన్నా.. నేను పొలిటికల్ అయినా క్రైమ్ అయినా హిస్టారికల్ రిలేటెడ్ అయినా, భక్తిపరమైన స్క్రిప్ట్ అయినా ఇంకేదయినా ఆర్గనైజేషన్ లో ఎవడూ రాయలేనంత చక్కగా రాయగలను.

ఎవడి స్క్రిప్ట్ వాడిది

ఎవడి స్క్రిప్ట్ వాడిది

కానీ ఎవడి డిపార్ట్ మెంట్ వాడికి ఉంటుంది. ఎవడి సినిమాలు వాడివి. ఎవడి స్క్రిప్ట్ వాడిది. నాకు అప్పగించిన బాధ్యత మాత్రమే నిర్వహిస్తున్నా. నేనే కాదు.. జీవితంలో ఎవరైనా సరే మీరు చేసే ఏ పనిపై అయినా సరే పక్కనోడు పది వంకర్లు పెడతాడు.

ఎవ్వడి గురించి ఆలోచించకుండా..

ఎవ్వడి గురించి ఆలోచించకుండా..

నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయి జాబ్ కొట్టకుంటే వాడు వేస్ట్ రా.. ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నాడు వాడికి ఈ జన్మలో రాదంటారు. మీరు బిజినెస్ చేస్తే ఉండుండి అందులోకి దిగాడంటారు. మీరు ఎవ్వడి గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చేసుకుని ఇంటికొచ్చినా కూడా ఈ సమాజం నిన్ను విమర్శిస్తూనే ఉంటుంది.

ప్రేమగా మాట్లాడితే

ప్రేమగా మాట్లాడితే

సమాజానికి ఉపయోగపడాలని నువ్వు స్వచ్ఛంద సంస్థలు నడిపితే వీనికి అంత లాభం లేనిదే నడుపుతున్నాడా అంటారు. పక్కనోడు ఆపదలో ఉన్నాడని సాయం చేస్తే నాతో ఏదో పని ఉండి ఉంటుంది అందుకే సాయం చేశాడని వాడు అనుకుంటాడు. అవతలి వ్యక్తితో ప్రేమగా మాట్లాడితే ఏదో ఉన్నట్లుంది అందుకే అంతలా పడి చస్తున్నాడు అంటారు.

Most Read :నా లైఫ్ లో ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కడున్నారు. పెళ్లి చేసుకుంటానని చాలా కలలుగన్నా #mystory352Most Read :నా లైఫ్ లో ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కడున్నారు. పెళ్లి చేసుకుంటానని చాలా కలలుగన్నా #mystory352

తినే ప్రతి మెతుకు విలువ తెలిసిన వాడు

తినే ప్రతి మెతుకు విలువ తెలిసిన వాడు

ఇలా పనిలేని ప్రతి వాడూ ఏదో ఒకటి అంటుంటారు. కష్టాలు భరించి జీవితం విలువ తెలిసిన వాడు.. తినే ప్రతి మెతుకు విలువ తెలిసిన వాడు మాత్రమే పక్కనోడు చేసే ఏ పనిపై ఫోకస్ పెట్టడు. వాడి పని వాడు చేసుకుంటాడు. కానీ బలుపుతో ఉన్న కొందరు మాత్రం అవతలి వాడు పొట్టకూటి కోసం చేసే పనికి కూడా పది వంకర్లు పెడతారు.

సెక్సే ఉంటుంది.. బూతులే ఉంటాయి

సెక్సే ఉంటుంది.. బూతులే ఉంటాయి

నా స్టోరీల్లో సెక్సే ఉంటుంది.. బూతులే ఉంటాయి. వాటి గురించి రోజుకొకడు ఏదో కామెంట్ చేస్తే నాతో ఆ పని చేయిస్తున్నా నా ఆర్గనైజేషన్ వాళ్లకు సమాధానం ఇస్తుంది. అది నా బాధ్యత కాదు. నాకు అవకాశం ఇచ్చి, డబ్బిచ్చి, నా దగ్గరున్న టాలెంట్ ని వాళ్లు అలా వాడుకుంటున్నప్పుడు వాళ్లకు నేను రెస్పెక్ట్ ఇస్తానుగానీ.. ఎవడో జఫ్పాగాడికి నేనేందుకు ఇస్తాను.

డిస్ట్రబ్ చేస్తూనే ఉంటారు పట్టించుకోకు

డిస్ట్రబ్ చేస్తూనే ఉంటారు పట్టించుకోకు

సో.. నాలాగే మీరు ఏ జెఫ్ఫాగాళ్లని మీరు పట్టించుకోకండి. మీరు ఏమనుకుంటున్నారో అది చెయ్యండి. ఇలాంటి గొట్టంగానోళ్లు సమాజంలో చాలా మందే ఉంటారు. రోజుకొకడు, రోజుకొకతి నిన్ను డిస్ట్రబ్ చేస్తూనే ఉంటారు. వారినేమీ పట్టించుకోకు. నీ పని నువ్వు చేసేయ్.. నువ్వు చేసినా అదే మాట అంటారు..చెయ్యకున్నా అదే అంటారు.

నీకు కరెక్ట్ అనిపించింది చేసెయ్

నీకు కరెక్ట్ అనిపించింది చేసెయ్

ఎవ్వడి మాట వినకు... నీకు కరెక్ట్ అనిపించింది చేసెయ్. కష్టాల్లో నీతో ఉండేవారికే విలువ ఇవ్వు. నీతులు చెప్పే ప్రతి నాకొడుకుని నమ్మొద్దు.

(ఒరేయ్ జెఫ్ఫాగా నావి సెక్స్ స్టోరీలు అంటున్నావుగా... గలీజ్ వి అంటున్నావుగా నువ్వు ఎప్పుడైనా మొత్తం చూశావా అవి? చూసి మాట్లాడు.. అందులో ఒక మెసేజ్ ఉంటుంది. ఒకరి పెయిన్ ఫుల్ స్టోరీ ఉంటుంది . లేకపోతే అంతమంది ఎందుకురా చూస్తారురా.. జెఫ్ఫా.)

Most Read :నా కూతురు అలా చేస్తుందని ఊహించలేదు, చిత్ర హింసలు పెట్టింది, ఆస్తులన్నీ అమ్మించింది #mystory344Most Read :నా కూతురు అలా చేస్తుందని ఊహించలేదు, చిత్ర హింసలు పెట్టింది, ఆస్తులన్నీ అమ్మించింది #mystory344

English summary

i believe ethics and morals

i believe ethics and morals
Desktop Bottom Promotion