మకరంలో కేతువు.. చాలా రాశులకు చేస్తాడు మేలు

Written By:
Subscribe to Boldsky

2017 లోనే కేతువు మకరంలోకి ప్రవేశించాడు. మరో 23 నెలల పాటు కేతు ఈ రాశిలోనే ఉంటాడు. అంటే 2018 తో పాటు 2019లోనూ కేతువు మకరరాశిలోనే తిష్టవేసుకుని కూర్చొంటాడు. అలాగే మకరరాశిలో శని కూడా ఉంటాడు. వీరిద్దరూ ప్రస్తుతం ఈ రాశిలో ఉండడం వల్ల మకరరాశి వారికి చాలా బాగా కలిసొస్తుంది. మరో రెండేళ్ల పాటు ఈ రాశి వారికి తిరుగు లేదు. అలాగే చాలా రాశుల వారికి కూడా కలిసొస్తుంది.

మేషం

మేషం

కేతువు వల్ల మేషరాశి వారిని కూడా కొన్ని రకాల అదృష్టాలు వరిస్తాయి. మేషరాశి వారి జీవితంలోనూ చాలా మార్పులు వస్తాయి. వీరు కూడా ఆనందాలను చూస్తారు. వీరికి కూడా కాస్త మేలు.

వృషభం

వృషభం

కేతువు ఈ రాశివారిపై కూడా అనుకూల ప్రభావం చూపుతాడు. వీరిని కూడా విజయాలు వరిస్తాయి. వీరు విదేశీ ప్రయాణాలు, విదేశాలకు వెళ్లే యోగ్యం కలుగుతుంది.

మిథునం

మిథునం

కేతువు వీరిపై ఎక్కువగా వ్యతిరేకంగా ప్రభావం చూపడు. వీరు అనారోగ్యంగా ఉన్నట్లయితే త్వరగా కోలుకుంటారు. మీరు చేపట్టేబోయే పనులకు కూడా ఎలాంటి ఆటంకాలు ఏర్పడవు. అన్నీ సజావుగా జరుగుతాయి.

కర్కాటకం

కర్కాటకం

ఈ రాశివారికి కూడా కేతువు అనుకూలంగా ఉంటాడు. మకరం లో కేతువు ఉండడం వీరికి చాలా మంచిది. ఒకవేళ మీకు పెళ్లికాకుంటే త్వరలోనే వివాహం జరుగుతుంది. ఒకవేళ ఇప్పటికే పెళ్లి అయింటే కాస్త మీరు చిన్నచిన్న ఇబ్బందులకు గురవుతారు.

సింహరాశి

సింహరాశి

కేతువు సింహరాశిలో ఆరో స్థానంలో ఉంటాడు. మీకు మంచిమంచి అవకాశాలు వస్తాయి. మీరు కోరుకున్న ఉద్యోగం మీకు వస్తుంది. మీరు అనుకున్న పనులు అన్నీ నెరవేరుతాయి.

కన్య

కన్య

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు లేదా విదేశాల్లో చదువుకునే వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వీరు ఆశలు ఫలిస్తాయి. అందువల్ల మీరు ఎలాంటి ఇబ్బందులకు గురికావాల్సిన అవసరం లేదు. ఈ రాశి వారికి కూడా కేతువు కాస్త అనుకూలంగానే ఉంటాడు.

తుల

తుల

కేతువు ఈ రాశిలో నాల్గో స్థానంలో ఉంటాడు. మీరు త్వరలో ఇల్లు, కారు లేదా ఏదైనా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది మీరు విదేశాలకు కూడా వెళ్తారు.

వృశ్చికం

వృశ్చికం

మకరం లో కేతువు ఉండడం ఈ రాశి వారికి చాలా మంచిది. వీరికి ఆదాయం కూడా పెరుగుతుంది. మీ తోబుట్టువులు, కుటుంబ సభ్యులతో సంబంధాలు ఇంకా మెరగవుతాయి.

ధనుస్సు

ధనుస్సు

కేతువు మీకు కూడా అనుకూలంగా ఉంటాడు. మీకు ఈ ఏడాది ఆదాయం పెరుగుతుంది. అయితే వ్యయాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి.

మకరం

మకరం

కేతువు ఇప్పుడు ఈ రాశిలోనే ఉంటాడు కాబట్టి మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. మీ లక్ష్యాలన్నీ నెరవేరుతాయి. మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు. మీకు తిరుగులేదు. గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి.

కుంభం

కుంభం

మీరు కొన్ని రోజుల వరకు కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల వరకు మాత్రమే మీపై కేతువు ప్రతి కూలంగా ప్రభావం చూపుతాడు.

మీనం

మీనం

మీన రాశివారిపై కేతువు అనుకూలంగానే ప్రభావం చూపుతాడు. మీరు ఎక్కువగా ఇబ్బందులుపడాలేమి పడరు. మీరు చేపట్టబోయే పనులకు ఎలాంటి ఆటంకాలు తలెత్తవు.

English summary

Ketu transits into Capricorn for 2.5 years luck will change for these Zodiac signs in 2018

Ketu transits into Capricorn for 2.5 years luck will change for these Zodiac signs in 2018
Story first published: Thursday, January 4, 2018, 11:41 [IST]